అన్వేషించండి

UP Election 2022: దీపావళి రోజు అయోధ్యకు ప్రధాని మోదీ.. అందుకేనా?

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు భాజపా ప్రచారం మొదలుపెట్టనుంది. ఈ నెల 14న ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తర్ ప్రదేశ్ కు వెళ్లనున్నారు.

ఉత్తర్ ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల వేడి మొదలైంది. ప్రచారపర్వం ఇప్పటికే మొదలైంది. 403 స్థానాలు ఉన్న ఈ ఎన్నికలను అన్నీ పార్టీలు చాలా కీలకంగా తీసుకున్నాయి. మాజీ ముఖ్యమంత్రులు అఖిలేశ్ యాదవ్, మాయావతి, ఎఐఎమ్ఐఎమ్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు. అయితే అధికార భాజపా మాత్రం ఇప్పటివరకు ప్రచారం మొదలుపెట్టలేదు. మరి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని రాష్ట్ర భాజపా ప్లాన్ ఏంటి?

ఏబీపీ సమాచారం ప్రకారం.. భాజపా ప్రచార శంఖారావాన్ని ఈ నెల 14న ప్రధాని నరేంద్ర మోదీ పూరించనున్నారు. సెప్టెంబర్ 14న అలీగఢ్ లోని రాజ మహేంద్ర సింగ్ యూనివర్సిటీకి మోదీ శంకుస్థాపన చేయనున్నారు. సెప్టెంబర్ 26న లఖ్ నవూలో జరిగే అర్బన్ కాన్ క్లేవ్ కు మోదీ హాజరుకానున్నారు. ఈ ఏడాది దీపావళికి ప్రధాని మోదీ.. అయోధ్య వెళ్తున్నారని సమాచారం. రామమందిర నిర్మాణ శంకుస్థాపన తర్వాత మోదీ ఇప్పటివరకు అయోధ్య వెళ్లలేదు. ఎన్నికల నేపథ్యంలో ఈసారి మోదీ.. అయోధ్య పర్యటన భాజపాకు కలిసివస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. 

ఇప్పటికే వచ్చే ఏడాది జరగబోయే యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ఇన్ ఛార్జిల పేర్లను ప్రకటించింది భాజపా. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ను.. యూపీ అసెంబ్లీ ఎన్నికల ఇంఛార్జిగా నియమించింది. అనురాగ్ ఠాకూర్, సరోజ్ పాండే, అర్జున్ రామ్ మేఘవాల్ లను కో-ఎలక్షన్ ఇంఛార్జ్ లుగా ప్రకటించింది.

Also Read: TN Ganesh Chaturthi 2021: చవితి వేడుకలు రద్దు చేసినా సీఎంపై ప్రశంసల జల్లు

ఎస్పీ, బీఎస్పీ జోరుగా..

భాజపాను యూపీలో గద్దె దించడమే లక్ష్యంగా ఎస్పీ, బీఎస్పీ పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. కరోనా కట్టడిలో వైఫల్యం, మహిళలపై అత్యాచారాలు సహా మరిన్ని సమస్యలను ప్రస్తావిస్తూ సీఎం యోగి ఆదిత్యనాథ్ పై మాయవతి, అఖిలేశ్ యాదవ్ ప్రచారం చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ కూడా యూపీ ఎన్నికలపై భారీ ఆశలే పెట్టుకుంది. పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కొన్ని నెలలుగా యూపీ ఎన్నికలపైనే దృష్టి పెట్టారు. పార్టీని మళ్లీ పోటీలో నిలబెట్టేలా కార్యకర్తలను సమాయత్తం చేస్తున్నారు.  మరి ఈసారి భాజపాకు గట్టి పోటీ ఎదురవుతుందో లేక మళ్లీ కాషాయ జెండా రెపరెపలాడుతుందో చూడాలి.

Also Read: Third Front : దేశంలో "ధర్డ్ ఫ్రంట్" ప్రయత్నాలు ! 25న హర్యానాలో తొలి సమావేశం !

టాప్ హెడ్ లైన్స్

KTR On CM Revanth Reddy: 'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
AP Economic Regions: ఏపీ అభివృద్ధికి మూడు ఎకనమిక్ రీజియన్లు.. విశాఖ, తిరుపతి, అమరావతి ప్రణాళికలపై సీఎం చంద్రబాబు సమీక్ష!
ఏపీ అభివృద్ధికి మూడు ఎకనమిక్ రీజియన్లు.. విశాఖ, తిరుపతి, అమరావతి ప్రణాళికలపై సీఎం చంద్రబాబు సమీక్ష!
Kolathur MLA VS Babu Passes Away: తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
Jasprit Bumrah Milestone:  శ్రీనాథ్ ని వెనక్కి నెట్టిన బుమ్రా.. లీడింగ్ వికెట్ టేక‌ర్ల‌లో టాప్ 10లోకి ఎంట్రీ..
శ్రీనాథ్ ని వెనక్కి నెట్టిన బుమ్రా.. లీడింగ్ వికెట్ టేక‌ర్ల‌లో టాప్ 10లోకి ఎంట్రీ..

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR On CM Revanth Reddy: 'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
Kolathur MLA VS Babu Passes Away: తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
Polavaram Maoist Dump:చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
Rahul Gandhi US Remarks Row: అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
AICC Action on Komatireddy Rajagopal Reddy: ఢిల్లీకి చేరిన రాజగోపాల్ రెడ్డి వీడియోలు - అనిరుథ్ రెడ్డిపై కూడా పరిశీలన - సస్పెండ్ చేస్తారా, బుజ్జగిస్తారా?
ఢిల్లీకి చేరిన రాజగోపాల్ రెడ్డి వీడియోలు - అనిరుథ్ రెడ్డిపై కూడా పరిశీలన - సస్పెండ్ చేస్తారా, బుజ్జగిస్తారా?
Ramayana Collections : 1500 కోట్ల క్లబ్‌లో రామాయణ - ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్
1500 కోట్ల క్లబ్‌లో రామాయణ - ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్
Sunil Gavaskar Shock: సిరాజ్‌ను తప్పించడంపై గవాస్కర్ అసహనం.. వేటు ఎందుకంటూ సూటి ప్రశ్న,  గిల్ ఇంట్రెస్టింగ్ రిప్లై
సిరాజ్‌ను తప్పించడంపై గవాస్కర్ అసహనం.. వేటు ఎందుకంటూ సూటి ప్రశ్న,  గిల్ ఇంట్రెస్టింగ్ రిప్లై
Henry Nicholls Century: బుమ్రా నిప్పులు చెరిగినా కోలుకున్న కివీస్.. నికోల్స్,  ఫిలిప్స్ అద్భుత పోరాటం, తొలి రోజు న్యూజిలాండ్ దే..
బుమ్రా నిప్పులు చెరిగినా కోలుకున్న కివీస్.. నికోల్స్,  ఫిలిప్స్ అద్భుత పోరాటం, తొలి రోజు న్యూజిలాండ్ దే..
Embed widget