TN Ganesh Chaturthi 2021: చవితి వేడుకలు రద్దు చేసినా సీఎంపై ప్రశంసల జల్లు

బహిరంగ చవితి వేడుకలను నిషేధించినప్పటికీ తమిళనాడు సీఎం స్టాలిన్ ను ప్రశంసిస్తున్నారు విగ్రహ తయారీదారులు. ఎందుకంటే వారికి రూ.5 వేల ఆర్థిక సాయం ప్రకటించారు.

FOLLOW US: 

తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్ కే స్టాలిన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. గణేశ్ విగ్రహాలు తయారు చేసే కళాకారులకు ఒక్కొక్కరికి రూ.5వేల ఆర్థిక సాయం ప్రకటించారు. రాష్ట్రంలోని 3 వేల మంది దీని ద్వారా లబ్ధి పొందనున్నారు. కరోనా వ్యాప్తి కారణంగా వినాయక చవితికి బహిరంగ వేడుకలను రద్దు చేస్తూ ఇటీవల సీఎం స్టాలిన్ నిర్ణయం తీసుకున్నారు.

ఆర్థిక సాయం..

వినాయక చవితి వేడుకలను రద్దు చేయడం వల్ల దీన్నే నమ్ముకొని బతికే ఎన్నో వేలమంది కళాకారులు ఆందోళన చెందారు. అయితే వారికి రూ.5 వేలు సాయం చేసి ఆదుకుంటామని అసెంబ్లీలో సీఎం ప్రకటించారు. గణేశ్ చతుర్థిని బహిరంగంగా జరుపుకునేలా అనుమతి ఇవ్వాలని అసెంబ్లీలో భాజపా డిమాండ్ చేసింది. దీనిపై స్పందిస్తూ సీఎం కీలక ప్రకటన చేశారు.

" ఇప్పటికే బతుకుతెరువు కోల్పోయిన 12 వేలమంది కుమ్మరివాళ్లకు రూ.5 వేల ఆర్థికం సాయం ప్రభుత్వం ఇస్తోంది. గణేశ్ వేడుకలు రద్దు చేయడం వల్ల నష్టపోయే కళాకారులకు కూడా రూ.5 వేలు ఇచ్చి ఆదుకోవాలని మేం నిర్ణయించాం. దీని వల్ల 3 వేల మంది లబ్ధి పొందుతారు.                        "
-     ఎమ్ కే స్టాలిన్, తమిళనాడు సీఎం

స్టాలిన్ నిర్ణయంపై విగ్రహ తయారీదారులు హర్షం వ్యక్తం చేశారు. వేడుకలు రద్దు చేసినప్పటికీ తమ గురించి ఆలోచించి ఈ సాయం ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

వేడుకలు రద్దు..

కరోనా వ్యాప్తి కారణంగా బహిరంగ ప్రదేశాల్లో గణేశ్ విగ్రాహాలు పెట్టడం, నిమర్జన కార్యక్రమాలను రద్దు చేసింది తమిళనాడు సర్కార్. పండుగను ఇంటివద్దే జరుపుకోవాలని సూచించింది. ఒక్కొక్కరుగా వెళ్లి విగ్రహాలను నిమర్జనం చేయాలని పేర్కొంది. చెన్నై వాసులు.. బీచ్ లో విగ్రహాలు నిమర్జనం చేయరాదని స్పష్టం చేసింది.

కరోనా వ్యాప్తి ఉద్ధృతంగా ఉన్న  కారణంగా పండుగలను బహిరంగంగా జరుపుకోకుండా చూడాలని కేంద్ర హోంశాఖ ఇటీవల రాష్ట్రాలకు తెలిపింది. సెప్టెంబర్ 30 వరకు ఈ ఆదేశాలు పాటించాలని వెల్లడించింది. ఇందుకోసమే సెప్టెంబర్ 10న వచ్చిన వినాయకచవితి వేడుకలపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది.

" ఓనం, బక్రీద్ పండుగలకు అనుమతి ఇవ్వడం వల్ల కేరళలో కరోనా కేసులు విపరీతంగా పెరిగాయి. తమిళనాడులో వైరస్ ఇంకా పూర్తిగా పోలేదు. కనుక ప్రజా క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వినాయకచవితి సహా సెప్టెంబర్ 15 వరకు జరుపుకోబోయే అన్ని పండుగలపై ఆంక్షలు విధించాం. అయితే బహిరంగ వేడుకలను మాత్రమే రద్దు చేశాం. కొవిడ్ నియమాలు పాటిస్తూ ఇంట్లో పండుగను ఆనందంగా జరుపుకోండి.                                         "
-       ఎమ్ కే స్టాలిన్, తమిళనాడు సీఎం

Published at : 08 Sep 2021 01:36 PM (IST) Tags: Tamil Nadu mk stalin Vinayaka Chaviti CM Tamil Nadu Ganesh idol TN Ganesh Chaturthi 2021

సంబంధిత కథనాలు

Rains in AP Telangana: నేడు ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన -  ఏపీ, తెలంగాణలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన IMD

Rains in AP Telangana: నేడు ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన - ఏపీ, తెలంగాణలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన IMD

Gold Rate Today 2nd July 2022: పసిడి ప్రియులకు బిగ్ షాక్, భారీగా పెరిగిన బంగారం ధర, దిగొచ్చిన వెండి - లేటెస్ట్ రేట్లు ఇవీ

Gold Rate Today 2nd July 2022: పసిడి ప్రియులకు బిగ్ షాక్, భారీగా పెరిగిన బంగారం ధర, దిగొచ్చిన వెండి - లేటెస్ట్ రేట్లు ఇవీ

Tirumala RTC Charges : శ్రీవారి భక్తులకు అలెర్ట్, భారీగా పెరిగిన తిరుమల-తిరుపతి ఆర్టీసీ బస్సుల ఛార్జీలు

Tirumala RTC Charges : శ్రీవారి భక్తులకు అలెర్ట్, భారీగా పెరిగిన తిరుమల-తిరుపతి ఆర్టీసీ బస్సుల ఛార్జీలు

Defence Ministry: ఆర్మీ, నేవీలో అగ్నిపథ్ నియామకాలు ప్రారంభం, ఎయిర్ పోర్స్ లో 2.72 లక్షల దరఖాస్తులు

Defence Ministry:  ఆర్మీ, నేవీలో అగ్నిపథ్ నియామకాలు ప్రారంభం, ఎయిర్ పోర్స్ లో 2.72 లక్షల దరఖాస్తులు

DRDO : త్వరలో మేడిన్ ఇండియా మానవ రహిత యుద్ధ విమానాలు - డీఆర్డీవో లెటెస్ట్ సక్సెస్ స్టోరీ ఇదిగో

DRDO :  త్వరలో మేడిన్ ఇండియా మానవ రహిత యుద్ధ విమానాలు -  డీఆర్డీవో లెటెస్ట్ సక్సెస్ స్టోరీ ఇదిగో

టాప్ స్టోరీస్

Pavithra Lokesh: కావాలనే నన్ను బ్యాడ్ చేస్తున్నారు - పవిత్రా లోకేష్ ఎమోషనల్ కామెంట్స్

Pavithra Lokesh: కావాలనే నన్ను బ్యాడ్ చేస్తున్నారు - పవిత్రా లోకేష్ ఎమోషనల్ కామెంట్స్

The warriorr Trailer: రామ్ 'ది వారియర్' ట్రైలర్ వచ్చేసిందోచ్ - యాక్షన్ పీక్స్

The warriorr Trailer: రామ్ 'ది వారియర్' ట్రైలర్ వచ్చేసిందోచ్ - యాక్షన్ పీక్స్

BJP PLenary Plan On TRS : తెలంగాణలో కాషాయజెండా పాతడమే లక్ష్యం ! బీజేపీ అత్యున్నత భేటీ వెనుక అసలు వ్యూహం ఇదే

BJP PLenary Plan On TRS :  తెలంగాణలో కాషాయజెండా పాతడమే లక్ష్యం ! బీజేపీ అత్యున్నత భేటీ వెనుక అసలు వ్యూహం ఇదే

Chandrababu : జగన్‌ను చూసి చాలా నేర్చుకున్నాను - చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు !

Chandrababu :  జగన్‌ను చూసి చాలా నేర్చుకున్నాను -   చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు !