Third Front : దేశంలో "ధర్డ్ ఫ్రంట్" ప్రయత్నాలు ! 25న హర్యానాలో తొలి సమావేశం !
కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలన్నీ మూడో కూటమిగా జట్టుకట్టాలనే ప్రయత్నాలు ప్రారంభించాయి.ఆర్ఎన్‌ఎల్డీ నేత చౌతాలా సమావేశం నిర్వహిస్తున్నారు. గతంలో కేసీఆర్ ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు.
దేశంలో అప్పుడే ఎన్నికల వాతావరణం ప్రారంభమయింది. వచ్చే ఎన్నికల కోసం అన్ని రాజకీయ పార్టీలు తమ తమ సన్నాహాలు ప్రారంభించాయి. జాతీయ స్థాయిలోనూ ఈ హడావుడి కనిపిస్తోంది. ఇప్పటి వరకూ మూడో కూటమి అనే చర్చ రాలేదు. ఇక ఇప్పుడు ఆ అంశమూ తెరపైకి వస్తుంది. గతంలో మూడో కూటమి అంశాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ముందుకు తీసుకెళ్లారు. ఇప్పుడు ఆ బాధ్యతను హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలా తీసుకున్నారు. ఆయన ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.
Also Read : ఏపీలో కరెంట్ బిల్లులు ఎందుకు పెరిగాయి ?
మాజీ ఉప ప్రధాని దేవీలాల్ జయంతి సందర్భంగా హర్యానాలో ఈ నెల 25న ఇండియన్ నేషనల్ లోక్ దళ్ .. ఐఎన్‌ఎల్‌డీ సభను నిర్వహిస్తోంది. ఈ సభకు బీజేపీ, కాంగ్రెస్ కూటముల్లో లేని పార్టీలను ఆహ్వానిస్తున్నారు. సమాజ్‌వాదీ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్, జేడీయూ నేత నితీశ్ కుమార్, జేడీ ఎస్ నేత దేవెగౌడ, అకాలీదళ్ అధినేత ప్రకాశ్ సింగ్ బాదల్ ఈ సమావేశానికి వచ్చేందుకు అంగీకరించారు. ఎన్సీపీ , టీఎంసీ నేషనల్ కాన్ఫరెన్స్ , ఆర్‌ఎల్డీ వంటి పార్టీలనూ ఆహ్వానించారు. అయితే వారు ఇంకా వచ్చేందుకు ఆమోదం తెలియచేయలేదు. బీజేపీ,కాంగ్రెసేతర పార్టీలకు వ్యతిరేకంగా మూడో కూటమి పెట్టాలన్న లక్ష్యంతో చౌతాలా ఉన్నారు.
Also Read : మరో అగ్రిగోల్డ్ తరహా మోసం చేసిన వైసీపీ నేత
ధర్డ్ ఫ్రంట్ విషయంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ గతంలో చాలా ప్రయత్నాలు చేశారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు.. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కూటమిని ఏర్పాటు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. వివిధ రాష్ట్రాల సీఎంలతో.. జాతీయ స్థాయి నేతలతో సమావేశాలు నిర్వహించారు. కుమారస్వామి, శరద్ పవర్, మమత బెనర్జీ, కేజ్రీవాల్, పినరాయ్ విజయన్, స్టాలిన్, అఖిలేష్ యాదవ్, నవీన్ పట్నాయక్ లాంటి నేతలతో భేటీ అయ్యారు గత డిసెంబర్‌లోనూ ప్రాంతీయ పార్టీలతో సమావేశం నిర్వహిస్తమని కేసీఆర్ అన్నారు కానీ వెనక్కి తగ్గారు. అయితే చౌతాలా నుంచి కేసీఆర్‌కు ఆహ్వానం పంపారో లేదో స్పష్టత లేదు. Also Read : హరీష్ రావును మళ్లీ దూరం పెడుతున్నారా ?
మూడో కూటమి అంటే బీజేపీకి రాజకీయంగా లాభమేనని ప్రశాంత్ కిషోర్ పలుమార్లు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఆయన పలు ప్రాంతీయ పార్టీలకు స్ట్రాటజిస్ట్‌గా ఉన్నారు. వారందరికీ మూడో కూటమి వర్కవుట్ అవదనే సలహానే ఇచ్చారు. కాంగ్రెస్ కూటమితోనే బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ కలిసి పోటీ చేస్తేనే ఫలితం ఉంటుందని అంటున్నారు. అయితే కాంగ్రెస్‌తో కలిసేందుకు కొన్ని పార్టీలు సిద్ధంగా లేవు. కొన్ని పార్టీలు రెడీగా ఉన్నాయి. ఎన్డీఏలో లేకపోయినప్పటికీ చాలా పార్టీలు బీజేపీతో లోపాయికారీ రాజకీయాలు చేస్తున్నాయి. వీరందరూ బీజేపీకి వ్యతిరేకంగా ఏకమయ్యే చాన్స్ లేదు. కానీ ధర్డ్ ఫ్రంట్‌గా మారవచ్చని చెబుతున్నారు. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ జాతీయ రాజకీయాలు కూడా ఊపందుకుంటున్నాయి.
Also Read : ఈ గెజిట్ వెబ్‌సైట్‌లో ఏపీ జీవోలు