అన్వేషించండి

తమిళులపై కేంద్రమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు, ఆ తరవాత క్షమాపణలు

Shobha Karandlaje: తమిళులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి ఆ తరవాత క్షమాపణలు చెప్పారు.

Shobha Karandlaje Tamilians Remark: కేంద్రమంత్రి శోభా కరంద్లాజే (Shobha Karandlaje) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలుడు కేసు నిందితుడు తమిళనాడుకి చెందిన వ్యక్తే అని అన్నారు. దీనిపై తమిళులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్‌కే స్టాలిన్ కూడా ఈ కామెంట్స్‌పై ఫైర్ అయ్యారు. తమిళనాడుకి చెందిన వ్యక్తే కేఫ్‌లో బాంబు పెట్టాడంటూ శోభా చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు. స్టాలిన్ విమర్శలకి కౌంటర్ ఇచ్చిన ఆమె ఆ తరవాత క్షమాపణలు చెప్పారు. రామేశ్వరం పేలుడు కేసులో ప్రధాన నిందితుడు తమిళాడులోని కృష్ణగిరి అడవుల్లోనే శిక్షణ పొందాడని ఆరోపించారు శోభ కరంద్లాజే. ఆమె చేసిన ఈ వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

"తమిళనాడుకి చెందిన వాళ్లే ఈ అడవుల్లోకి వస్తుంటారు. ఇక్కడే ట్రైనింగ్ తీసుకుంటారు. బాంబులు ఎలా పెట్టాలో నేర్చుకుంటారు. అలా నేర్చుకున్న వ్యక్తే రామేశ్వరం కేఫ్‌లో బాంబు పెట్టాడు"

- శోభా కరంద్లాజే 

ఈ వీడియోని రీట్వీట్ చేసిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్‌కే స్టాలిన్ తీవ్రంగా మండి పడ్డారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలా ఎలా మాట్లాడతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

"ఎలాంటి ఆధారాల్లేకుండా ఇలా ఇష్టమొచ్చినట్టు మాట్లాడడం సరికాదు. బీజేపీని పక్కన పెట్టేయడంలో తమిళులు, కన్నడిగులు ఒకేరకంగా ఆలోచిస్తారు. జాతీయ సమైక్యతకి, శాంతియుత వాతావరణానికి ఇబ్బంది కలిగించే ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ప్రధాని నరేంద్ర మోదీ నుంచి ప్రతి ఒక్కరూ ఇలాంటి రాజకీయాలు చేసే వాళ్లే. ఎన్నికల సంఘం ఈ వ్యాఖ్యల్ని తీవ్రంగా పరిగణించాలి"

- ఎమ్‌కే స్టాలిన్, తమిళనాడు ముఖ్యమంత్రి

ఆ తరవాత కేంద్రమంత్రి క్షమాపణలు చెబుతూ X వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. తమిళ ప్రజలందరినీ క్షమాపణలు కోరారు. మనోభావాలు దెబ్బ తీయడం తన ఉద్దేశం కాదని చెప్పారు. ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నట్టు వెల్లడించారు. 

"తమిళనాడు ప్రజలందరినీ క్షమాపణలు చెబుతున్నాను. మీ మనోభావాలు దెబ్బ తీయాలని నేనీ వ్యాఖ్యలు చేయలేదు. కేవలం కృష్ణగిరి అడవుల్లో ట్రైనింగ్ అవుతున్న వారి గురించి మాత్రమే మాట్లాడాను. నా వ్యాఖ్యలతో ఎవరైనా బాధ పడి ఉంటే క్షమించండి. ఆ వ్యాఖ్యల్ని నేను వెనక్కి తీసుకుంటున్నాను"

- శోభా కరంద్లాజే, కేంద్ర మంత్రి

 

 

Also Read: రామ్ దేవ్ బాబాకి సుప్రీంకోర్టు నోటీసులు, పతంజలి ప్రకటనలపై తీవ్ర అసహనం

టాప్ హెడ్ లైన్స్

Ashes Test In India:  షాకింగ్.. ఇండియాలో యాషెస్ టెస్ట్ మ్యాచ్ ? చెన్నై బిగ్ బాష్ లీగ్ తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా క్రేజీ ప్లాన్!
షాకింగ్.. ఇండియాలో యాషెస్ టెస్ట్ మ్యాచ్ ? చెన్నై బిగ్ బాష్ లీగ్ తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా క్రేజీ ప్లాన్!
Modi video:
"స్పందించి సలహాలు ఇచ్చిన వారికి ధన్యవాదాలు" మరో సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన ప్రధానమంత్రి
CJP Protest: సీజేపీ నిరసన ప్రదర్శన వాంటెడ్‌ నేరస్థులకు కొత్త స్వర్గధామంగా మారిందా? వచ్చిన 216 మందిలో 215 మంది గుర్తింపు!
సీజేపీ నిరసన ప్రదర్శన వాంటెడ్‌ నేరస్థులకు కొత్త స్వర్గధామంగా మారిందా? వచ్చిన 216 మందిలో 215 మంది గుర్తింపు!
Breaking News: మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై గృహ హింస కేసు..!
మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై గృహ హింస కేసు..!

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Warning to PM Modi : జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
Andhra Pradesh Rainfall: ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
Kumki Elephants: పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
Viral Video: యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
Honda ZR-V Review: మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Embed widget