News
News
X

AP Airports : ఎయిర్‌పోర్టులన్నీ అభివృద్ధి చేస్తాం..మీదే ఆలస్యం! జగన్‌కు కేంద్రం లేఖ..!

కేంద్రం ఏపీలో విమానాశ్రయాల అభివృద్ధికి కట్టుబడినా రాష్ట్రం సహకరించడం లేదని విమానయాన మంత్రి సింధియా అసంతృప్తితో ఉన్నారు. ఏపీ వైపు నుంచి చేయాల్సిన పనులు, చెల్లించాల్సిన నిధులపై సీఎం జగన్‌కు లేఖ రాశారు.

FOLLOW US: 
Share:

ఆంధ్రప్రదేశ్‌లో విమానాశ్రయాల విస్తరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం చాలా ఆసక్తిగా ఉంది. అయితే ప్రభుత్వ సహకారం కోసం ఎదురు చూస్తోంది. ఏపీలో కేంద్ర విమానయానశాఖ చేపట్టాలనుకున్న ప్రాజెక్టులు.. వాటికి రాష్ట్ర ప్రభుత్వ సహకారం కోసం ఇటీవలే విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన జ్యోతిరాదిత్య సింధియా ప్రత్యేకంగా ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాశారు. అందులో కేంద్ర ప్రభుత్వ ప్రణాళికలను వివరించారు. రాష్ట్ర చేయాల్సిన సహకారాన్ని గుర్తు చేశారు. 

తిరుపతి విమానాశ్రయానికి చాలా కాలం క్రితం అంతర్జాతీయ హోదా వచ్చింది. అయితే అక్కడ రన్ వే మాత్రం ఇంకా చిన్నగానే ఉంది. దాన్ని విస్తరిస్తే పెద్ద విమానాలు దిగడానికి అవకాశం ఏర్పడుతోంది. ఈ ప్రతిపాదనలు చాలా కాలం నుంచి ఉన్నాయి. రన్ వే విస్తరణ, ఇతర అవసరాల కోసం 14.31 ఎకరాల భూమి అవసరం ఉంది. దీన్ని సమీకరించి ఇవ్వాలని కేంద్రమంత్రి సీఎంను కోరారు. అలాగే రాజమండ్రి విమానాశ్రయంలో వివిధ రకాల అవసరాలకు  10.25 ఎకరాలు , కడపలో రన్‌వే విస్తరణ, అప్రోచ్‌ లైనింగ్‌ సిస్టం కోసం 50 ఎకరాలు అవసరమని గుర్తు చేశారు. ఈ అవసరాలను చాలా కాలం కిందటే రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపినా స్పందించలేదని సింధియా లేఖలో పేర్కొన్నారు. 

ఇటీవలే విజయవాడ రన్‌వేను విస్తరించి ప్రారభించారు. అయితే ఆ రన్‌వేను  4వేల మీటర్ల వరకు విస్తరించే ప్రణాళికలు ఉన్నాయి. ఇలా చేయాలంటే ఏలూరు కాలువను మళ్లించాల్సి ఉంది. ఈ పనులను చేపట్టాలని సింధియా సీఎం జగన్‌ను కోరారు. ఉడాన్ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.14.64 కోట్లను చెల్లిచాల్సి ఉందని..  వెంటనే ఈ మొత్తాన్ని  రీజినల్‌ ఎయిర్‌ కనెక్టివిటీ ట్రస్టుకు జమ చేయాలని కోరారు.  వీజీఎఫ్‌ వాటాగా 20 శాతం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని గుర్తు చేశారు.  విశాఖపట్నం - దుబాయి మధ్య అంతర్జాతీయ విమానాలు నడపాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. దీని కోసం ఏం చేయాలో కూడా లేఖలో సింధియా వివరించారు. వయబులిటీ గ్యాప్ ఫండింగ్ కింద వంద శాతం మొత్తాన్ని సమకూరిస్తే ఎయిర్‌లైన్స్‌ కోసం బిడ్డింగ్‌కు పెడతామని చెప్పారు.

వీటన్నింటిపై ఏపీ సర్కార్ స్పందించిన తర్వాత అన్ని పనులను వేగంగా పూర్తి చేస్తామని సింధియా తన లేఖలో పేర్కొన్నారు. ఇటీవల గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి పలు కంపెనీలు తమ విమాన సర్వీసులను నిలిపివేశాయి. దీనికి కారణం ఉడాన్ పథకం కింద వారికి ఇవ్వాల్సిన ప్రోత్సహకాలు ఇవ్వకపోవడమే కారణం అని వార్తలు వచ్చాయి. ఇప్పుడు కేంద్రమంత్రి కూడా.. రూ.14.64 కోట్లను చెల్లిచాల్సి ఉందని చెప్పడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరుతోంది. 
 
Published at : 26 Aug 2021 12:09 PM (IST) Tags: cm jagan Andhra letter airports aviation minister aipports devolepment

సంబంధిత కథనాలు

నిజామాబాద్ జిల్లాకు గోల్డ్‌ మెడల్, భద్రాద్రి, హన్మకొండకు వెండి, ఖమ్మంకు కాంస్యం

నిజామాబాద్ జిల్లాకు గోల్డ్‌ మెడల్, భద్రాద్రి, హన్మకొండకు వెండి, ఖమ్మంకు కాంస్యం

LPG Cylinder Subsidy: పీఎంయూవై లబ్దిదారులకు గుడ్ న్యూస్, ఎల్పీజీ సిలిండర్ పై సబ్సిడీ మరో ఏడాది పొడిగింపు

LPG Cylinder Subsidy:  పీఎంయూవై లబ్దిదారులకు గుడ్ న్యూస్, ఎల్పీజీ సిలిండర్ పై సబ్సిడీ మరో ఏడాది పొడిగింపు

Bhatti Vikramarka Padayatra : టీఎస్పీఎస్పీ పేపర్ల లీకేజీకి బాధ్యత వహిస్తూ సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలి - భట్టి విక్రమార్క

Bhatti Vikramarka Padayatra : టీఎస్పీఎస్పీ పేపర్ల లీకేజీకి బాధ్యత వహిస్తూ సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలి - భట్టి విక్రమార్క

IGNOU: ఇగ్నోలో 200 జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులు- అర్హతలివే!

IGNOU: ఇగ్నోలో 200 జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులు- అర్హతలివే!

APPSC Group-4 Exam: 'గ్రూప్-4' మెయిన్స్ తేదీ ఖరారు, హాల్‌టికెట్లు ఎప్పటినుంచంటే?

APPSC Group-4 Exam: 'గ్రూప్-4' మెయిన్స్ తేదీ ఖరారు, హాల్‌టికెట్లు ఎప్పటినుంచంటే?

టాప్ స్టోరీస్

YSRCP Reverse : దెబ్బ మీద దెబ్బ - వ్యూహాత్మక తప్పిదాలే వైఎస్ఆర్‌సీపీకి నష్టం చేస్తున్నాయా ?

YSRCP Reverse :   దెబ్బ మీద దెబ్బ  - వ్యూహాత్మక తప్పిదాలే వైఎస్ఆర్‌సీపీకి నష్టం చేస్తున్నాయా ?

MIW Vs UPW Highlights: యూపీని ఎలిమినేటర్‌లోనే ఆపేసిన ముంబై - 72 పరుగుల విజయంతో ఫైనల్లోకి ఎంట్రీ!

MIW Vs UPW Highlights: యూపీని ఎలిమినేటర్‌లోనే ఆపేసిన ముంబై - 72 పరుగుల విజయంతో ఫైనల్లోకి ఎంట్రీ!

AP Cag Report : 13.99 శాతం వడ్డీకి అప్పులు తెస్తున్న ఏపీ సర్కార్ - కాగ్ రిపోర్టులో సంచలన విషయాలు

AP Cag Report :  13.99 శాతం వడ్డీకి అప్పులు తెస్తున్న ఏపీ సర్కార్ - కాగ్ రిపోర్టులో సంచలన విషయాలు

రైతులపై కేసీఆర్ ది ఎన్నికల ప్రేమ, మీరిచ్చే రూ.10 వేలు ఏ మూలకు సరిపోతాయి - వైఎస్ షర్మిల

రైతులపై కేసీఆర్ ది ఎన్నికల ప్రేమ,  మీరిచ్చే రూ.10 వేలు ఏ మూలకు సరిపోతాయి - వైఎస్ షర్మిల