News
News
X

Udhampur Bomb Blast: కశ్మీర్‌లో కలకలం- 8 గంటల్లో రెండు బాంబు పేలుళ్లు!

Udhampur Bomb Blast: జమ్ముకశ్మీర్‌లో వరుస బాంబు పేలుళ్లు కలకలం సృష్టించాయి. ఈ పేలుళ్లలో ఇద్దరికి గాయాలయ్యాయి.

FOLLOW US: 
 
Udhampur Bomb Blast: జమ్ముకశ్మీర్‌ బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. ఉదంపుర్‌లో 8 గంటల వ్యవధిలో రెండు బాంబు పేలుళ్లు జరగడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి.

రాత్రి

బుధవారం రాత్రి ఓ పెట్రోల్ బంక్ దగ్గర ఆగి ఉన్న బస్సులో మొదటి పేలుడు జరిగింది. రాత్రి 10.30 గంటలకు జరిగిన ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. వీరిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. పేలుడుకు సంబంధించిన దృశ్యాలు పెట్రోల్‌ బంక్‌లోని సీసీటీవీలో రికార్డయ్యాయి. పెట్రోల్ కొట్టించుకునేందుకు బస్సు.. ఆ బంకుకు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

రెండో పేలుడు

ఈ ఘటన జరిగిన 8 గంటల వ్యవధిలో ఉధంపుర్‌లో మరో బస్సులో పేలుడు జరిగింది. ఉదయం ఆరు గంటల సమయంలో బస్టాండ్​లో ఉన్న ఓ బస్సులో పేలుడు జరిగింది. ఉదంపుర్ నుంచి రామ్​నగర్​కు ఈ బస్సు వెళ్లాల్సి ఉండగా పేలుడు సంభవించింది. అయితే, బస్సులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడం వల్ల ప్రమాదం తప్పింది.పేలుడు ధాటికి బస్సు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ రెండు ప్రమాదాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

" ఇది ప్రమాదం కాదు. పేలుళ్లే అని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఏ రకమైన బాంబులను ఉపయోగించారనే విషయం తెలియాల్సి ఉంది. వరుస పేలుళ్ల కారణంగా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులతో పాటు ప్రభుత్వ ఏజెన్సీలు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నాయి. ప్రజలు భయపడకుండా ఉండాలని మేం కోరుతున్నాం. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తాం.  "
-                                                              సులేమాన్ చౌదరి, డీఐజీ 

హై అలర్ట్

ఈ ఘటనలతో భద్రతా ఏజన్సీలన్నీ అప్రమత్తమయ్యాయి. జనసాంద్రత ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో బాంబు స్క్వాడ్ తనిఖీలు చేస్తుంది. సైన్యం, పోలీసులు సంయుక్తంగా ఈ తనిఖీలు చేస్తున్నారు. ఈ మేరకు జమ్మూ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్.. ఏబీపీ న్యూస్‌కు తెలిపారు.

ఉదంపుర్‌లో ఎనిమిది గంటల వ్యవధిలో రెండు బాంబు పేలుళ్లు జరగడంతో కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేసింది. కాంగ్రెస్ కౌన్సెలర్ ప్రీతి ఖజురియా నేతృత్వంలోని స్థానికులు జమ్మూ పరిపాలన యంత్రాంగానికి వ్యతిరేకంగా ఆందోళన చేశారు. 

Also Read: Congress President Election: దిగ్విజయ్ వర్సెస్ శశిథరూర్, కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఇదే ఫైనల్ ఫైటా?

Also Read: CDS Anil Chauhan: త్రివిధ దళాలకు కొత్త బాస్‌గా అనిల్ చౌహాన్ నియమాకం!

Published at : 29 Sep 2022 10:31 AM (IST) Tags: J&K 2 Mysterious Blasts Parked Buses In Udhampur 2 Injured

సంబంధిత కథనాలు

Rahul Gandhi on BJP RSS: 'జై సీతారాం అని ఎందుకు అనరు? మోదీజీ మీరు అనాలి, నేను వినాలి'

Rahul Gandhi on BJP RSS: 'జై సీతారాం అని ఎందుకు అనరు? మోదీజీ మీరు అనాలి, నేను వినాలి'

Foreign Portfolio Investors: ఫారిన్‌ ఇన్వెస్టర్లకు మన స్టాక్‌ మార్కెట్లే పెద్ద దిక్కు, మరో ఆప్షన్‌ లేదు

Foreign Portfolio Investors: ఫారిన్‌ ఇన్వెస్టర్లకు మన స్టాక్‌ మార్కెట్లే పెద్ద దిక్కు, మరో ఆప్షన్‌ లేదు

Tirumala News: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, నిన్న హుండీ ఆదాయం ఎంతంటే?

Tirumala News: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, నిన్న హుండీ ఆదాయం ఎంతంటే?

AP Drugs Smuggling Cases: డ్రగ్స్, గంజాయిలో స్వాధీనం ఏపీ టాప్- స్మగ్లింగ్ ఇన్ ఇండియా రిపోర్ట్ సంచలనం

AP Drugs Smuggling Cases: డ్రగ్స్, గంజాయిలో స్వాధీనం ఏపీ టాప్- స్మగ్లింగ్ ఇన్ ఇండియా రిపోర్ట్ సంచలనం

దేవినేని అవినాష్‌, వల్లభనేని వంశీ ఇళ్లపై ఐటీ దాడులు- వంశీరామ్‌ బిల్డర్స్‌తో సంబంధాలపై ఆరా

దేవినేని అవినాష్‌, వల్లభనేని వంశీ ఇళ్లపై ఐటీ దాడులు- వంశీరామ్‌ బిల్డర్స్‌తో సంబంధాలపై ఆరా

టాప్ స్టోరీస్

Balakrishna New Movie : బాలకృష్ణకు జోడీగా 'టాక్సీవాలా' ప్రియాంక?

Balakrishna New Movie : బాలకృష్ణకు జోడీగా 'టాక్సీవాలా' ప్రియాంక?

Breakfast: మనదేశంలో బ్రేక్‌‌ఫాస్ట్ తినడం ఎప్పటి నుంచి మొదలైందో తెలుసా?

Breakfast: మనదేశంలో బ్రేక్‌‌ఫాస్ట్ తినడం ఎప్పటి నుంచి మొదలైందో తెలుసా?

Pawan Kalyan : బాలీవుడ్ స్టార్స్‌కు 'నో' చెప్పేసి పవన్‌తో సినిమా - ఎగ్జైట్ అవుతున్న అకిరా

Pawan Kalyan : బాలీవుడ్ స్టార్స్‌కు 'నో' చెప్పేసి పవన్‌తో సినిమా - ఎగ్జైట్ అవుతున్న అకిరా

టమోటోల్లా కనిపిస్తున్న ఈ పండ్లను పోల్చారా? మనకు బాగా తెలిసినవే

టమోటోల్లా కనిపిస్తున్న ఈ పండ్లను పోల్చారా? మనకు బాగా తెలిసినవే