Twitter Jobs Cut: ఉద్యోగం ఉంటుందా ఊడుతుందా - ట్విటర్ ఉద్యోగుల్లో టెన్షన్
Twitter Jobs Cut: ట్విటర్‌లో 3,500 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
![Twitter Jobs Cut: ఉద్యోగం ఉంటుందా ఊడుతుందా - ట్విటర్ ఉద్యోగుల్లో టెన్షన్ Twitter Jobs Cut Elon Musk Plans To Eliminate 3700 Jobs At Twitter To Pare Costs Reports Twitter Jobs Cut: ఉద్యోగం ఉంటుందా ఊడుతుందా - ట్విటర్ ఉద్యోగుల్లో టెన్షన్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/07/3112eeef2c643f51e27acb7121a519571665112098860379_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Twitter Jobs Cut:
లేఆఫ్‌లపై చర్చ..
ట్విటర్‌లో లే ఆఫ్‌ల గురించి రోజుకో వార్త వినబడుతోంది. కొన్ని రిపోర్ట్స్ అయితే "భారీగా లేఆఫ్‌లు" అని తేల్చి చెబుతుంటే...అటు మస్క్ మాత్రం దీనిపై ఎలాంటి స్పష్టతనివ్వటం లేదు. అవన్నీ అవాస్తవం అని మొన్నామధ్య ట్వీట్ చేసినప్పటికీ...ఇంకా దీనిపై క్లారిటీ రావట్లేదు. Bloomberg ఇచ్చిన రిపోర్ట్ మరోసారి..ట్విటర్‌లో ఉద్యోగుల తొలగింపు విషయమై చర్చకు తెరతీసింది. బ్లూమ్‌బర్గ్ రిపోర్ట్ ప్రకారం....3,500 మందిని తొలగించేందుకు మస్క్ ప్లాన్ రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో ఆయా ఉద్యోగులకు మస్క్ నేరుగా మెయిల్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించే అవకాశముందని చెబుతోంది బ్లూమ్‌బర్గ్ రిపోర్ట్. అంతే కాదు. ఇన్నాళ్లూ...ఎంప్లాయిస్ అందరూ ఎక్కడి నుంచైనా పని చేసుకునే వెసులుబాటు ఉండేది. ఇకపై ఈ ఆప్షన్‌నీ తొలగించనున్నారు మస్క్. అందరూ కచ్చితంగా ఆఫీస్‌కు వచ్చి రిపోర్ట్ చేయాలని చెబుతున్నారట. కొందరికి మాత్రమే మినహాయింపు ఉంటుందని సమాచారం. మస్క్ టీమ్‌లోని సలహాదారులు...ఈ జాబ్ కట్స్‌ని ఏ విధంగా అమలు చేయాలని స్కెచ్ సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఉద్యోగాలు కోల్పోయే వారికి 60 రోజుల "పే" ఇచ్చి పంపాలని ఎలన్ మస్క్ భావిస్తున్నట్టు సమాచారం. కాస్ట్ కట్టింగ్‌లో భాగంగానే...ఈ స్థాయిలో జాబ్ కట్స్ ఉంటాయన్న మాటా వినిపిస్తోంది. ర్యాంక్‌ల ఆధారంగా ఈ లేఆఫ్‌లు ఉంటాయని సమాచారం. ట్విటర్ మేనేజర్‌లతో పాటు టెస్లాలోని ఉన్నతాధికారులూ...."అసెస్‌మెంట్" చేసిన తరవాతే...ఎవరిని ఉంచాలి, ఎవరిని తీసేయాలని అనేది నిర్ణయిస్తారట.
ఉద్యోగులపై ఒత్తిడి..
బ్లూటిక్ కోసం డబ్బులు కట్టాలని ఇప్పటికే వార్తలు వినిపిస్తుండగా...ఇప్పుడు మరో అప్‌డేట్‌పై చర్చ జరుగుతోంది. ఉద్యోగులపై ఒత్తిడి పెంచేందుకు మస్క్ రెడీ అవుతున్నారట. ట్విటర్ మేనేజర్‌పై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారట. బ్లూ టిక్ పెయిడ్ ఫీచర్‌ని నవంబర్ 7వ తేదీలోగా లాంచ్ చేయాలని భావిస్తున్నారు ట్విటర్ సీఈవో ఎలాన్ మస్క్. ఇందుకోసం ఎంత కష్టమైనా పడాల్సిందే అని తేల్చి చెప్పారు మస్క్. అవసరమైతే 24X7 పని చేయాలనీ ఆదేశించారు. ఇలా పని చేసేందుకు ఎవరు ఇబ్బంది పడినా ఉద్యోగం మానేయొచ్చని చాలా కచ్చితంగా చెప్పినట్టు సమాచారం. అందుకే...ఇప్పుడు ట్విటర్ ఎంప్లాయిస్‌లో ప్రెజర్ పెరిగిపోతోంది. ఉద్యోగం ఊడుతుందేమోనన్న భయంతో
దినదినగండంగా పని చేస్తున్నారు. ఆన్‌టైమ్‌లో పని పూర్తి కాకపోతే...మస్క్ ఆగ్రహంతో ఊగిపోతారట. అంతకు ముందు స్పేసెక్స్ ఉద్యోగులు కొందరు ఇదే విషయమై అప్పట్లో ఓ లెటర్ రాసి పెద్ద దుమారమే రేపారు. ఇప్పుడు ఈ బాధలు ట్విటర్ ఎంప్లాయిస్ పడుతున్నారు. తమ ఆదేశాలను పెడ చెవిన పెట్టిన వారిని, కంపెనీ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోని వారిని వీలైనంత త్వరగా పక్కన పెట్టేయాలని చూస్తున్నారు మస్క్. అంతర్గత వర్గాలు ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి కూడా. ప్రస్తుతం ట్విటర్ ఇంజనీర్లు తప్పనిసరిగా బ్లూ టిక్ పెయిడ్ ఫీచర్‌ను అనుకున్న సమయంలోగా అందుబాటులోకి తీసుకురావాల్సిందే.
Also Read: Elon Musk Twitter : ఎనిమిది డాలర్లు కట్టడానికి ఏడుపెందుకు... | Twitter Blue tick | ABP Desam
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)