By: ABP Desam | Updated at : 02 Jun 2023 03:07 PM (IST)
Edited By: jyothi
శ్రీవారిపై అపారమైన భక్తి - ఆ భక్తుడి బంగారు చైన్ పై శ్రీనివాసుడి ప్రతిమలు
Tirumala: మధ్యప్రదేశ్ రాష్ట్రం రాట్లంకి చెందిన సోనీ నానురామ్ దయరాం అనే భక్తుడితో పాటు అతని కుటుంబ సభ్యులు తిరుమలకు వచ్చారు. అయితే వారికి శ్రీవారిపై ఉన్న అపారమైన భక్తిని.. వెరైటీగా చెప్పారు. ఆ భక్తులు వేసుకున్న చైన్ అందరూ ఆసక్తిగా తిలకించారు.
చైన్ ద్వారా భక్తి తెలియడం ఏంటి?
సోనీ నానురామ్ దయరాం వేసుకున్న బంగారు చైన్ పై తిరుమల శ్రీనివాసుడి ప్రతిమలు ఉన్నాయి. అంతే కాకుండా ఆయన కుటుంబ సభ్యుల మెడల్లో కూడా ప్రత్యేకమైన చైన్లు ఉన్నాయి. వెంకటేశ్వరుడి ప్రతిమతో పాటు, పద్మావతి అమ్మ వారు, అలివేమ మంగతాయారు అమ్మవారి లాకెట్లతో పాటు కళశం లాకెట్లను ధరించారు. వీరు బయటకు వచ్చిన సమయంలో భక్తులందరినీ వీరు చైన్లు అందరినీ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా స్వామి వారి దర్శనానంతరం ఆలయం వెలుపలకు వచ్చిన చాలా మంది భక్తులు వీరి మెడలో ఉన్న చైన్లను చూస్తూ.. ఇంత పెద్ద లాకెట్లు ఉంటాయా అంటూ తెగ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
నేటి నుంచి ఆదివారం వరకు తిరుమలలో జ్యేష్ఠాభిషేకం..
తిరుమలలో వైభవంగా జేష్టాభిషేకం ప్రారంభమైంది. మూడు రోజులపాటు జరిగే ఈ ఉత్సవంలో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి కవచాలు తొలగిస్తారు. సంవత్సరం పొడవునా కవచాలతో దర్శనం ఇచ్చే స్వామివారు జేష్టాభిషేకం నాడు మాత్రమే సహజ సిద్ధంగా దర్శనం ఇస్తారు. ఈ సందర్భంగా వజ్ర, ముత్యాలు, బంగారు ఆభరణాలతో మూడు రోజుల పాటు దర్శనం ఇస్తారు. 1980 దశకంలో జేష్టాభిషేకాన్ని ప్రారంభించింది టీటీడీ. తిరుమల శ్రీవారి ఆలయంలో నేటి నుండి 4వ తేదీ వరకు మూడు రోజుల పాటు జ్యేష్ఠాభిషేకం జరుగనుంది. అభిషేకాలు, పంచామృత స్నపన తిరుమంజనాల కారణంగా శ్రీదేవి, భూదేవి, మలయప్ప స్వామివారి ఉత్సవ మూర్తుల విగ్రహాలు అరిగిపోకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు వైఖానసాగమోక్తంగా నిర్వహించే ఉత్సవమే జ్యేష్ఠాభిషేకం. ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠా నక్షత్రానికి ముగిసే విధంగా స్వామివారికి ఈ ఉత్సవం నిర్వహిస్తారు. ఆలయంలోని సంపంగి ప్రదక్షిణంలో గల కల్యాణ మండపంలో ఈ ఉత్సవం చేపడతారు. దీనిని 'అభిధేయక అభిషేకం' అని కూడా అంటారు.
రెండో రోజు ముత్యాల కవచ సమర్పణ చేసి ఊరేగింపు
మొదటిరోజు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి హోమాలు, అభిషేకాలు, పంచామృత స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. తర్వాత స్వామి, అమ్మవార్లకు వజ్రకవచం అలంకరించి పుర వీధుల్లో ఊరేగిస్తారు. ఈ సందర్భంగా వజ్రాభరణాలతో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి భక్తులకు దర్శనం ఇస్తారు. రెండో రోజు ముత్యాల కవచ సమర్పణ చేసి ఊరేగిస్తారు. మూడో రోజు కూడా తిరుమంజనాదులు పూర్తి చేసి బంగారు కవచాన్ని సమర్పించి ఊరేగింపు నిర్వహిస్తారు. ఈ బంగారు కవచాన్ని మళ్లీ జ్యేష్ఠాభిషేకంలోనే తీస్తారు. అంత వరకు అంటే సంవత్సరం పొడవునా శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి వారు బంగారు కవచంతోనే ఉంటారు. సంవత్సరంలో జేష్టాభిషేకం సందర్భంగా మాత్రమే కవచాలు తొలగిస్తారు. జ్యేష్ఠాభిషేకం కారణంగా శ్రీవారి ఆలయంలో జూన్ 4 వ తేదీ కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు.
హిజాబ్ రూల్ పాటించలేదని యువతిపై ఇరాన్ పోలీసుల దాడి! కోమాలో బాధితురాలు
Breaking News Live Telugu Updates: ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారాయణ పిటిషన్‌పై విచారణ వాయిదా
IWST: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఉడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ బెంగళూరులో పీజీ డిప్లొమా ప్రోగ్రామ్
IT Stocks: ఫారినర్ల మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో ఐటీ స్టాక్స్, రెండున్నర నెలల్లో రూ.7 వేల కోట్ల షాపింగ్
ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్ కేసులో లాలూకి ఊరట, బెయిల్ ఇచ్చిన ఢిల్లీ కోర్టు
Medico Preethi: మెడికో ప్రీతి ఆత్మహత్య కేసు నిందితుడికి ఊరట- సైఫ్ సస్పెన్సన్ తాత్కాలికంగా రద్దు
సిక్కింలో ఆకస్మిక వరదలు-23 మంది సైనికులు మిస్సింగ్
Ram Charan: ముంబై సిద్ధివినాయక ఆలయంలో రామ్ చరణ్ ప్రత్యేక పూజలు, గణనాథుడి సమక్షంలో అయ్యప్ప దీక్ష విరమణ
ప్రైవేట్‌గా మాట్లాడుకుని పరిష్కరించుకుందాం, భారత్‌కి కెనడా రిక్వెస్ట్
/body>