News
News
వీడియోలు ఆటలు
X

TTD News: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ - నిన్న హుండీ ఆదాయం ఎంతంటే?

TTD News: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. నిన్న ఒక్క రోజే 67 వేల 853 మంది స్వామి వారిని దర్శించుకోగా.. రూ.3.19 కోట్ల హుండీ ఆదాయం నెలకొంది. 

FOLLOW US: 
Share:

TTD News: వేసవి సెలవులు, వారంతరం కావడంతో తిరుమలలో‌ భక్తుల రద్దీ కొనసాగుతుంది. గురువారం (ఏప్రిల్ 11) రోజున 67,853 మంది స్వామి వారి దర్శించుకున్నారు. ఇక స్వామి వారికి 33,381 మంది తలనీలాలు సమర్పించగా.. రూ.3.19 కోట్ల రూపాయలు భక్తులు హుండీ ద్వారా కానుకలుగా సమర్పించారు. ఇక సర్వదర్శనం భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్సులోని అన్ని కంపార్ట్మెంట్లల్లో భక్తులు నిండి పోగా.. బయట టీబీసీ వరకూ భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. దీంతో టైం స్లాట్ టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులకు ఇరవై నాలుగు గంటల సమయం పడుతుంది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మూడు గంటల సమయం పడుతుంది. 

పంచాంగ శ్రవణం, హుండీ జనాకర్షణ

శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ వేంకటేశ్వరుడికి కైంకర్యాలు నిర్వహిస్తున్నారు అర్చకులు. శుక్రవారం ప్రత్యూషకాల ఆరాధనతో ఆలయ ద్వారముకు తెరిచిన అర్చకులు.. బంగారు వాకిలి వద్ద శ్రీ వేంకటేశ్వర సుప్రభాత స్త్రోతంతో స్వామి వారిని మేలు కొలిపారు. అనంతరం ఆకాశ జలాలతో శ్రీ వేంకటేశ్వరుడికి అభిషేక సేవను ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.‌ ఆ తర్వాత తోమాల, అర్చన సేవలు నిర్వహించిన అర్చకులు.. ప్రాతఃకాల ఆరాధనలో‌ భాగంగా స్నపన మండపంలో శ్రీకొలువు శ్రీనివాసమూర్తిని వారి సమక్షంలో దర్భార్ నిర్వహించారు. శ్రీవారికి పంచాంగ శ్రవణం, హుండీ జనాకర్షణ విన్నవించి, బెల్లంతో కలిపిన నువ్వుల పిండిమి స్వామి వారికి నైవేద్యంగా సమర్పించారు. నవనీత హారతి సమర్పించి అనంతరం శ్రీనివాసమూర్తిని తిరిగి సన్నిధిలో వేంచేపు చేశారు. ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా మొదటి ఘంటా నివేదనలో "బెల్లం పూర్ణం బోండాలు, పోలీల" శుక్రవారం ప్రత్యేకంగా నివేదిస్తారు. ఇక వీటితో పాటుగా అన్నప్రసాదం, లడ్డూ, వడలు స్వామి వారికి నైవేద్యంగా సమర్పించారు.

ఆర్జిత బ్రహ్మోత్సవం, ఆర్జిత వసంతోత్సవం సేవల నిర్వహణ

సన్నిధిలో శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం సాత్తుమొర నిర్వహించిన అనంతరం సర్కారు హారతి అందించి ప్రోటోకాల్ పరిధిలోని భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం కల్పించింది టీటీడీ. అనంతరం స్వామి వారికి రెండోవ గంట నివేదన, బలి జరిపి సర్వదర్శనం భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతించారు. శ్రీవారి ఉత్సవమూర్తులు అయినా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని విమాన ప్రదక్షణగా సంపంగి ప్రాకారంలోనికి వేంచేపు చేసి మధ్యాహ్నం 12 గంటలకు నిత్య కల్యాణోత్సవాన్ని నేత్ర పర్వంగా నిర్వహిస్తారు. ఆ తర్వాత ఆలయంలోని అద్దాల మండపంలో డోలోత్సవం సేవను నిర్వహించి,‌ ఉత్సవ మూర్తులను ఆలయ వెలుపల ఉన్న వైభోత్సవ మండపానికి ఊరేగింపుగా తీసుకెళ్లి ఆర్జిత బ్రహ్మోత్సవం, ఆర్జిత వసంతోత్సవం సేవలు నిర్వహిస్తారు. సాయంకాలం సహస్ర దీపాల కొలువులో ఊంజల్ సేవ నిర్వహించిన పిదప నిత్యోత్సవం జరిపిస్తారు. సర్వదర్శనం నిలుపుదల చేసిన అనంతరం శ్రీవారికి రాత్రి కైంకర్యాలు ప్రారంభిస్తారు. ఈ కైంకర్యాల్లో‌ భాగంగా రాత్రి తోమాల, అర్చన, రాత్రి గంట, తిరువీసం, ఘంటాబలి నిర్వహిస్తారు. తిరిగి సర్వదర్శనం భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతించి, సర్వదర్శనం పూర్తి అయిన తరువాత ఆగమోక్తంగా శ్రీవారికి చివరి సేవగా ఏకాంత సేవను నిర్వహిస్తారు.

Published at : 12 May 2023 09:05 AM (IST) Tags: AP News TTD News Tirumala Rush Tirumala Hundi Income Tirumala News

సంబంధిత కథనాలు

మార్గదర్శి కేసులో ప్రభుత్వం దూకుడు- ఆస్తులు అటాచ్‌ చేసేందుకు సీఐడీకీ అనుమతి

మార్గదర్శి కేసులో ప్రభుత్వం దూకుడు- ఆస్తులు అటాచ్‌ చేసేందుకు సీఐడీకీ అనుమతి

CIBIL Score: సిబిల్‌ స్కోర్ తక్కువగా ఉన్నా లోన్ వస్తుంది! ఈ చిట్కాలు ప్రయోగించండి

CIBIL Score: సిబిల్‌ స్కోర్ తక్కువగా ఉన్నా లోన్ వస్తుంది! ఈ చిట్కాలు ప్రయోగించండి

Coin Deposit: బ్యాంక్‌ అకౌంట్‌లో ఎన్ని నాణేల్ని డిపాజిట్ చేయవచ్చు?

Coin Deposit: బ్యాంక్‌ అకౌంట్‌లో ఎన్ని నాణేల్ని డిపాజిట్ చేయవచ్చు?

ICAR JRF: ఐసీఏఆర్ ఏఐసీఈ- జేఆర్‌ఎఫ్‌/ ఎస్‌ఆర్‌ఎఫ్‌ (పీహెచ్‌డీ)-2023 నోటిఫికేషన్, ప్రవేశాలు ఇలా!

ICAR JRF: ఐసీఏఆర్ ఏఐసీఈ- జేఆర్‌ఎఫ్‌/ ఎస్‌ఆర్‌ఎఫ్‌ (పీహెచ్‌డీ)-2023 నోటిఫికేషన్, ప్రవేశాలు ఇలా!

Gold-Silver Price Today 30 May 2023: ఎటూ కదలని పసిడి - ఇవాళ బంగారం, వెండి ధరలు

Gold-Silver Price Today 30 May 2023: ఎటూ కదలని పసిడి - ఇవాళ బంగారం, వెండి ధరలు

టాప్ స్టోరీస్

Telangana CM KCR: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలపై అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు

Telangana CM KCR: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలపై అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు

4 Years Of YSRCP: వైఎస్ జగన్ పాలనకు నాలుగేళ్లు పూర్తి- భారీగా బైక్ ర్యాలీలు, కార్యక్రమాలకు నేతలు శ్రీకారం

4 Years Of YSRCP: వైఎస్ జగన్ పాలనకు నాలుగేళ్లు పూర్తి- భారీగా బైక్ ర్యాలీలు, కార్యక్రమాలకు నేతలు శ్రీకారం

CSK Vs GT: ధోనికి కప్పు గిఫ్టిచ్చిన జడేజా - లాస్ట్ బాల్ థ్రిల్లర్‌లో జీటీపై చెన్నై విక్టరీ!

CSK Vs GT: ధోనికి కప్పు గిఫ్టిచ్చిన జడేజా - లాస్ట్ బాల్ థ్రిల్లర్‌లో జీటీపై చెన్నై విక్టరీ!

MS Dhoni: ఆ విషయంలో తను, నేను సేమ్ టు సేమ్ - రాయుడు గురించి ధోని ఏమన్నాడంటే?

MS Dhoni: ఆ విషయంలో తను, నేను సేమ్ టు సేమ్ - రాయుడు గురించి ధోని ఏమన్నాడంటే?