By: ABP Desam | Updated at : 15 Sep 2021 04:21 PM (IST)
టీటీడీ పాలక మండలి ఏర్పాటు
తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిలోఈ సారి 75 మందికిపైగా ప్రభుత్వం చోటు కల్పించే అవకాశం కనిపిస్తోంది. ఇంత మందిని బోర్డులో చేరిస్తే భక్తల నుంచి తీవ్ర విమర్శలు వచ్చే అవకాశం ఉండటంతో 50 మందిని ప్రత్యేక ఆహ్వానితుల కేటగిరిలో చేర్చాలని భావిస్తున్నారు. ప్రస్తుతం అధికారికంగా పాలక మండలి సభ్యుల జాబితాను ప్రభుత్వం ఏ క్షణమైనా విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది.
25 మందితో టీటీడీ పాలక మండలి ఏర్పాటు !
పాలక మండలి సభ్యులుగా ఏపీ నుండి పోకల అశోక్ కుమార్, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ,ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి , గొల్ల బాబూరావు, మధుసూదన్ యాదవ్‌లకు చాన్సిచ్చారు. యానాంకు చెందిన మాజీ ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావుకు కూడా చోటిచ్చారు. తెలంగాణ నుండి మైహోం అధినేత రామేశ్వర్ రావు, లక్ష్మినారాయణ, పార్థసారధి, మూరంశెట్టి రాములు, కల్వకుర్తి విద్యాసాగర్ లకు అవకాశం దక్కనున్నట్లు సమాచారం. తమిళనాడు నుండి శ్రీనివాస్, ఎమ్మెల్యే నందకుమార్,కన్నయ్య, కర్ణాటక నుండి శశిధర్, ఎమ్మెల్యే విశ్వనాథ్ రెడ్డిలకు అవకాశం కల్పించారు. మహారాష్ట్ర నుండి శివసేన కార్యదర్శి మిలింద్ కు అవకాశం కల్పించారు. ప్రస్తుతం పాలక మండలి సభ్యుల జాబితాలను ప్రకటించారు. రేపో..మాపో ప్రత్యేక ఆహ్వానితుల జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. Also Read : జగన్, విజయసాయిలకు ఊరట ... బెయిల్ రద్దు పిటిషన్లను కొట్టేసిన సీబీఐ కోర్టు !
రేపో,మాపో మరో 50 మంది ప్రత్యేక ఆహ్వానితుల ప్రకటన
టీటీడీ పాలక మండలికి ప్రస్తుతం వైవీ సుబ్బారెడ్డి చైర్మన్‌గా ఉన్నారు. గత పాలకమండలి గడువు పూర్తయిన తర్వాత స్పెసిఫైడ్ అధారిటీని నియమించారు. ఆ తర్వాత వైవీ సుబ్బారెడ్డినే చైర్మన్‌గా నియమించారు. పాలక మండలి సభ్యుల ఎంపిక కోసం కసరత్తు చేస్తున్నారు. పదవీ కాలం ముగిసిపోయిన పాలక మండలిలో చైర్మన్‌తో పాటు 24 మంది సభ్యులు, నలుగురు ఎక్స్ఆఫీషియో సభ్యులు, ఏడుగురు ప్రత్యేక ఆహ్వానితులు ఉన్నారు. మొత్తంగా 36 మందిని పాలకమండలిలో ఉన్నారు. రాష్ట్ర విభజనకు ముందు వరకూ 12 మందితో టీటీడీ పాలక మండలి ఉంది. తర్వాత టీడీపీ హయాంలో ఈ సంఖ్యను 15కు పెంచారు. ముగ్గురు ప్రత్యేక ఆహ్వానితులకు చాన్సిచ్చారు. వైసీపి ప్రభుత్వం పాలక మండలి సంఖ్యను 25కి పెంచుతూ..11 మందికి ప్రత్యేక ఆహ్వానితులుగా చోటు కల్పించింది. ఇప్పుడు మరోసారి రెట్టింపు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే ఇప్పటి వరకూ ఉన్న 36 మందిని 72 మందిని చేసే ఆలోచనలో ఉంది. ఇంకా ఎక్కువే కావొచ్చని చెబుతున్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన చట్టంలో మార్పుల ప్రకారం 24 మంది మాత్రమే బోర్డులో ఉంటాలి. ప్రత్యేక ఆహ్వానితుల పేరుతో ఎంత మందినైనా చేర్చుకోవచ్చు. అందుకే ఇప్పుడు కూడా ప్రత్యేక ఆహ్వానితుల కేటగిరిలో యాభై మంది వరకూ చేర్చే అవకాశం కనిపిస్తోంది. Also Read : వివేకా హత్య కేసు.. సీన్ రీ కన్ స్ట్రక్షన్.. ఆ నలుగురు వ్యక్తులు లోపలికి ఎలా వచ్చారు?
తమిళనాడు కోటాలో సభ్యునిగా నియమించిన కన్నయ్యపై తీవ్ర అభియోగాలు
తమిళనాడు కోటాలో నియమితులైన కన్నయ్య పై తీవ్రమైన అభియోగాలు ఉన్నాయి. 2018లోనే పిఎంఓ ఆదేశాల మేరకు కన్నయ్యపై సిబిఐ విచారణ జరపాలని రైల్వే విజిలెన్స్ శాఖ కోరింది. ఆయనకు 1500 కోట్ల అక్రమ ఆస్తులు ఉన్నట్లు అభియోగాలు ఉన్నాయి. కన్నయ్య ఛైర్మన్ గా ఉన్న రైల్వే సొసైటీ సంబంధించి మరో 108 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. అయినప్పటికీ టీటీడీ పాలక మండలిలో చోట ుకల్పించారు. తమిళనాడు సీఎం స్టాలిన్ సిఫార్సు మేరకు ఈ నియామకం జరిగినట్లుగా తెలుస్తోంది. Also Read : ఏపీలో ఇద్దరు ఐఏఎస్‌లకు జైలు శిక్ష.. కోర్టు ధిక్కరణే కారణం !
లాబీయింగ్ కోసం ఎవర్నీ సభ్యులుగా నియమించలేదన్న సజ్జల
పాలక మండలి నియామకం అంశంపై కొద్ది రోజులుగా తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. టీటీడీ పదవుల ఆశ చూపి ఇతర పనులు చేయించుకుంటున్నారని ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. అయితే అలాంటి అవసరం లేదని ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. ప్రత్యేక ఆహ్వానితులకు ప్రత్యేక అధికారాలు ఉండవని శ్రీవారి సేవ కోసమే వారికి పదవులు ఇస్తున్నామని చెప్పుకొచ్చారు.
Also Read : ఏపీలో నేరాల విప్లవం - తెలంగాణలో సైబర్ క్రైమ్ హవా ! వెలుగులోకి కీలకమైన నేర గణాంకాలు !
Gold Rate Today 1st July 2022: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్, మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు - లేటెస్ట్ రేట్లు ఇవీ
Parliament Monsoon session 2022 : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు మూహూర్తం ఖరారు, ఎప్పుడంటే?
AP Govt GPF Issue : ఉద్యోగుల ఖాతాల్లో నగదు మాయంపై న్యాయపోరాటం చేస్తాం - సూర్యనారాయణ
Chittoor News : మేయర్ దంపతుల హత్య కేసులో మరో ట్విస్ట్, విచారణ నుంచి తప్పుకున్న ఏపీపీ
Minister Gudivada Amarnath : పరిశ్రమలకు మరింత ప్రోత్సాహం, ఆగస్టులో రూ. 500 కోట్ల ఇన్సెంటివ్ లు- మంత్రి గుడివాడ అమర్నాథ్
GPF Money Moved To Pensions : ఉద్యోగుల జీపీఎఫ్ సొమ్ములు సామాజిక పెన్షన్లకు మళ్లించారా ?
IND Vs ENG Squads: ఇంగ్లండ్ వన్డేలు, టీ20లకు జట్లను ప్రకటించిన బీసీసీఐ - మొత్తం మూడు జట్లు!
Eknath Shinde: 'ఉద్ధవ్ ఠాక్రేకు ఎన్నో సార్లు చెప్పాను- ఆయన సైనికుడ్ని భాజపా సీఎం చేస్తుంది'
AP Weekly Five Days : వారానికి ఐదు రోజులే పని - మరో ఏడాది పొడిగించిన ఏపీ ప్రభుత్వం !