అన్వేషించండి

Trump Rally Shooting: ట్రంప్‌పై దుండగుల కాల్పులు, స్పీచ్‌ ఇస్తుండగా గన్‌ఫైర్‌ - తృటిలో తప్పిన ప్రాణాపాయం

Trump Attacked: అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌పై దుండగులు కాల్పులు జరిపారు. పెన్సిల్వేనియాలో స్పీచ్ ఇస్తుండగా గన్‌ఫైర్ చేశారు. ఈ దాడిలో ట్రంప్‌ చెవికి గాయమైంది.

Donald Trump Attacked: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం జరగడం అంతర్జాతీయంగా సంచలనం సృష్టించింది. పెన్సిల్వేనియాలో ఆయన ఎన్నికల ప్రచారం చేస్తుండగా దుండగులు కాల్పులు జరిపారు. ఆయన వెంటనే అప్రమత్తమై ఆ కాల్పుల నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఆయన సెక్యూరిటీ అలెర్ట్ అయి ఆయనను ఆ వేదిక నుంచి సురక్షితంగా కార్‌లోకి తీసుకెళ్లింది. ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. 

డొనాల్డ్ ట్రంప్‌ ప్రసంగిస్తుండగా ఉన్నట్టుండి కాల్పులు జరిగాయి. ఆ తూటాల నుంచి తప్పించుకునేందుకు ఆయన వెంటనే కిందకు వంగారు. ఈ లోగా సెక్యూరిటీ అప్రమత్తమై ఆయనను రక్షించింది. అయితే..ఈ కాల్పుల తరవాత ట్రంప్ తన కుడి చెవిని పట్టుకున్నారు. ఓ బులెట్ ఆయన చెవి నుంచి దూసుకుపోయి గాయమైంది. రక్తస్రావమూ అయింది. ఈ ఘటనతో ర్యాలీకి వచ్చిన వాళ్లంతా షాక్‌కి గురయ్యారు. ఏం జరుగుతోందో అర్థం కాక కేకలు పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

ఈ దాడిలో ట్రంప్‌కి ఎలాంటి హాని జరగలేదని, ఆయన బాగానే ఉన్నారని అధికారులు వెల్లడించారు. తక్షణమే స్పందించి తన ప్రాణాన్ని కాపాడిన సెక్యూరిటీకి ట్రంప్ థాంక్స్ చెప్పినట్టు ఆయన మద్దతుదారులు తెలిపారు. ప్రస్తుతానికి ఆయన వైద్యం అందిస్తున్నట్టు వివరించారు. అయితే..యూఎస్ మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం ఇద్దరు దుండగులు ఈ కాల్పులు జరిపారు. వీరిలో ఒకరిని సెక్యూరిటీ మట్టుబెట్టింది. ఓ నిందితుడు రక్తపు మడుగులో కనిపించాడని మీడియా తెలిపింది. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. ఆయన సురక్షితంగా ఉన్నాడన్న వార్త తెలిసి కాస్త ఊపిరి పీల్చుకున్నానని, పూర్తి వివరాల కోసం వేచి చూడాలని X వేదికగా ఓ పోస్ట్ పెట్టారు.

మరి కొద్ది నెలల్లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే ట్రంప్‌ జోరు పెంచారు. బైడెన్‌ని గద్దె దించాలన్న పట్టుదలతో ఉన్నారు. ప్రచారమూ ముమ్మరం చేశారు. సరిగ్గా ఈ సమయంలో ఆయనపై ఇలా కాల్పులు జరగడం కలకలం సృష్టించింది. ఈ ఘటనతో అమెరికా అంతా హైఅలెర్ట్ ప్రకటించారు. ఇప్పటికే ఈ కేసుని FBI విచారిస్తోంది. అతి తక్కువ దూరం నుంచే దుండగులు కాల్పులు జరిపినట్టు తేలింది.

Also Read: Trump Shooting: రాజకీయాల్లో హింసకు తావు లేదు, ట్రంప్‌పై కాల్పుల ఘటనపై ప్రధాని మోదీ అసహనం

టాప్ హెడ్ లైన్స్

LPG Lite Instant Cylinder: విశాఖలో భారత్ గ్యాస్ 'జిప్ సిలిండర్' ప్రారంభం.. కేవలం 4 గంటల్లోనే డెలివరీ!
విశాఖలో భారత్ గ్యాస్ 'జిప్ సిలిండర్' ప్రారంభం.. కేవలం 4 గంటల్లోనే డెలివరీ!
Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
IRCTC Japan Tour Package : IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే
IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Amaravati Seed Access Road: అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
Hushar Pittalu Trailer : ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
పల్సర్‌ 150లో భారీ మార్పులు.. కొత్త ఇంజిన్‌, కొత్త ఫ్రేమ్‌తో వస్తున్న బజాజ్‌ యూత్‌ఫుల్‌ బైక్‌!
కొత్త బజాజ్‌ పల్సర్‌ 150 న్యూ లుక్‌ భలే ఉంది, మీరు చూశారా?.. ఫోటోలు లీక్‌
Claude Vs ChatGPT: చాట్‌జీపీటీ, క్లాడ్‌ మధ్య తేడా ఏంటి? ఏది ఉపయోగించడం సులభం? 
చాట్‌జీపీటీ, క్లాడ్‌ మధ్య తేడా ఏంటి? ఏది ఉపయోగించడం సులభం? 
Embed widget