Dehradun Toll Plaza Accident: అయ్య బాబోయ్! జస్ట్ మిస్- టోల్ ప్లాజాను ఢీ కొట్టిన ట్రక్కు, వీడియో చూశారా?
Dehradun Toll Plaza Accident: టోల్ ప్లాజా వద్ద జరిగిన ఓ ప్రమాదం వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
Dehradun Toll Plaza Accident: టోల్ ప్లాజా వద్ద జరిగిన ఓ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉత్తరాఖండ్ రాజధాని దెహ్రాదూన్‌లో ఈ ఘటన జరిగింది. టోల్ ప్లాజా దగ్గరికి ఓ ట్రక్ వేగంగా వచ్చి ఢీ కొట్టింది.
ఇలా జరిగింది
దెహ్రాదూన్‌లోని ఓ టోల్ ప్లాజా వద్దకు ఓ కారు వచ్చి ఆగింది. అయితే అదే సమయంలో వెనుక నుంచి ఓ ట్రక్కు వేగంగా వచ్చి టోల్ ప్లాజా వద్ద అదుపుతప్పింది. టోల్ ప్లాజాను ఢీ కొట్టింది.
ध्यान से देखें. देहरादून के टोल प्लाजा दुर्घटना में एक युवती ने अपनी जान की परवाह किये बगैर बूथ के अंदर मौजूद कर्मी को दौड़कर बचाया. pic.twitter.com/qZmn5BJZwu
— Awanish Sharan (@AwanishSharan) July 24, 2022
అయితే అదే సమయానికి అక్కడ ఉన్న ఓ యువతి.. ధైర్యంగా టోల్ ప్లాజా లోపలికి వెళ్లి అందులో ఉన్న సిబ్బందిని బయటకు తీసుకు వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ అమ్మాయిని ప్రశంసిస్తున్నారు.
ఇటీవల
అత్యంత వేగంగా అంబులెన్స్‌ను టోల్‌బూత్‌ను ఢీ కొట్టిన ఓ వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయింది. కర్ణాటక ఉడిపి జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘోర ప్రమాదంలో అంబులెన్స్‌లో ఉన్న రోగి, ఇద్దరు సహాయకులు, టోల్ బూత్ సిబ్బంది సహా నలుగురు మృతి చెందారు.
ఉడిపీ జిల్లాలోని కుందాపురం నుంచి ఒక రోగిని అంబులెన్స్‌లో హొన్నవర ఆసుపత్రికి తరలిస్తున్నారు. భారీ వర్షంలో కూడా ఆ అంబులెన్స్ వేగంగా ప్రయాణిస్తోంది. అంబులెన్స్ రాకను గమనించిన టోల్ బూత్ సిబ్బంది ప్లాస్టిక్ బారికేడ్లను తొలగించి ప్రత్యేక లైన్‌లో దానికి దారి ఇచ్చేందుకు ప్రయత్నించారు.
🇮🇳🚑Four people died and four others sustained injuries after a speeding ambulance had hit a tollgate in Karnataka.
— Naren Mukherjee 🇮🇳 (@narendra52) July 21, 2022
🔍The driver failed to control the vehicle and hit the tollgate despite the staff's efforts to clean the road for the ambulance.
CCTV footage for toll plaza. 👇 pic.twitter.com/zAD42HCEff
అయితే అతి వేగంగా వస్తున్న అంబులెన్స్ తడిచి ఉన్న రోడ్డుపై అదుపు తప్పింది. చక్రాలు జారిపోవడంతో అంబులెన్స్ టోల్ బూత్ క్యాబిన్‌ను బలంగా ఢీకొట్టింది. ఆ ధాటికి అంబులెన్స్‌లో ఉన్న రోగి, ఇద్దరు సహాయకులు వాహనం నుంచి రోడ్డుపైకి ఎగిరి పడ్డారు. వీరు ముగ్గురు మృతి చెందారు.
అలాగే అంబులెన్స్ ఢీ కొట్టడంతో టోల్ బూత్‌లో పని చేసే ఓ వ్యక్తి కూడా చనిపోయాడు. తీవ్ర గాయాల పాలైన డ్రైవర్ మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ ప్రమాద దృశ్యాలు సీసీటీవీ కెమేరాలో రికార్డ్ అయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read: Rajya Sabha seats for 100 crore: రాజ్యసభ సీటు కావాలా, గవర్నర్ పోస్ట్ చాలా- రూ.100 కోట్లు ఇస్తే ఓకే!
Also Read: Congress MPs Suspended: నలుగురు కాంగ్రెస్ సభ్యులు సస్పెండ్- లోక్‌సభ స్పీకర్ వార్నింగ్!