Top Headlines Today: ఈనెల 16న వైసీపీ అభ్యర్థుల జాబితా- ప్రెస్‌మీట్ నుంచే బీఆర్‌ఎస్ నేతను తీసుకెళ్లిపోయిన మాజీ మంత్రి
AP Telangana Latest News 13 March 2024: తెలుగు రాష్ట్రాల్లో నేటి ఉదయం నుంచి టాప్ హెడ్ లైన్స్ మీకోసం..
Telugu News Today: ఈనెల 16న వైసీపీ అభ్యర్థుల జాబితా- ఇడుపులపాయలో ప్రకటించనున్న జగన్
ఈనెల 16న వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థుల జాబితాను ఇడుపులపాయలో జగన్ ప్రకటించనున్నారు. వైఎస్‌ఆర్‌సీపీ ఫైనల్ జాబితా సిద్ధమైపోయింది. దీన్ని ఆ పార్టీ అధినేత జగన్ ఈ నెల 16వ తేదీన ప్రకటించనున్నారు. ఇడుపులపాయ వేదికగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయే అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థుల జాబితాను వెల్లడించనున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
ముద్రగడ వైసీపీలో చేరిక వాయిదా - కార్ల ర్యాలీ కూడా ! అసలేం జరిగింది?
వైసీపీలో ముద్రగడ చేరిక వాయిదా పడింది. ఈ నెల 14న తన అనుచరులతో సహా సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతానని గతంలో ప్రకటించారు. ఇందు కోసం ఏర్పాట్లు చేసుకున్నారు. ద్ద సంఖ్యలో అనుచరులు వాహనాల్లో తరలి రండి, ఎవరి భోజనాలు వారే తెచ్చుకోండి అంటూ ఆమధ్య ముద్రగడ ఓ బహిరంగ లేఖ కూడా రాశారు. అయితే అనూహ్యంగా ఆయన మళ్లీ తన అనుచరులకు మరో లేఖ రాశారు. చేరిక వాయిదా పడిందని సమాచారమిచ్చారు. మరో తేదీలో తాను ఒక్కడినే వెళ్లి పార్టీలో చేరుతానని చెప్పారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
ప్రెస్‌మీట్ నుంచే బీఆర్‌ఎస్ నేతను తీసుకెళ్లిపోయిన మాజీ మంత్రి- హనుమకొండలో హైడ్రమా
లోక్‌సభ ఎన్నికల ముందు తెలంగాణలో రాజకీయాల్లో అనూహ్యమైన మార్పులు జరుగుతున్నాయి. ముఖ్యంగా బీఆర్‌ఎస్‌లో పరిస్థితులు ఆసక్తికరమైన మలుపులు తిరుగుతున్నాయి. అధికారానికి దూరమైన కారణంగా చాలా మంది నేతలు ఆ పార్టీని వీడి వేరే పార్టీల్లోకి వెళ్లిపోతున్నారు. ఇది ఆ పార్టీ కేడర్‌కు తీవ్ర నిరాశకు గురి చేస్తోంది. అలా పార్టీ మారాలని ఆలోచన ఉన్న వారిలో హనుమకొండకు చెందిన ఆరూరి రమేష్. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
అమిత్‌షా హైదరాబాద్ పర్యటన రోజే కేంద్రం కీలక నిర్ణయం- సెప్టెంబర్ 17 అధికారిక కార్యక్రమాలు నిర్వహించేలా గెజిట్
ఓ వైపు అమిత్‌షా పర్యటన మరోవైపు లోక్‌సభ ఎన్నికలు ఇలాంటి టైంలోనే కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎప్పటి నుంచో వివాదానికి కారణమవుతున్న సెప్టెంబర్ 17ను అధికారికం చేసింది. ఇకపై ఆ రోజును "హైదరాబాద్ లిబరేషన్ డే"గా నిర్వహించాలని కేంద్రం గెజిట్ జారీ చేసింది. సెప్టెంబర్ 17న అధికారిక కార్యక్రమాలు నిర్వహించాలని దీన్ని స్వేచ్ఛకు గుర్తుగా ప్రజలను భాగస్వాములను చేయాలని ఎప్పటి నుంచో బీజేపీతోపాటు చాలా వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
చిలకలూరిపేట సభ ఏర్పాట్లు ప్రారంభం- ప్రాంగణంలో లోకేష్ పూజలు
ఈనెల 17న చిలకలూరిపేట మండలం బొప్పూడిలో జరిగే "టీడీపీ-జనసేన-బీజేపీ" సభ ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. సభా స్థలి వద్ద టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి లోకేష్ భూమి పూజ చేసి ప్రక్రియ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నారా లోకేష్‌తోపాటు బీజేపీ, జనసేన నాయకులు హాజరయ్యారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఇతర ముఖ్య నేతలతో కలిసి సభా స్థలాన్ని నారా లోకేష్ పరిశీలించారు. సభా ప్రాంగణం వద్ద పనులను ప్రారంభించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి