Rahul Gandhi on Modi: కేంద్రంపై రాహుల్ గాంధీ అదిరిపోయే 5 పంచ్‌లు, విమర్శల డోసు పెంచేశారుగా!
Rahul Gandhi on Modi: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ, కేంద్రంపై విమర్శల డోసు పెంచారు.
Rahul Gandhi on Modi:
ధరల పెరుగుదల నుంచి నిరుద్యోగం వరకూ...
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ భాజపాపై విమర్శల డోసుని పెంచేశారు. కాంగ్రెస్ నేతలకు వరుసగా ఈడీ సమన్లు జారీ చేయటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖార్గే పార్లమెంట్‌లో ఉండగానే ఈడీ సమన్లు జారీ చేయటంపై ఇప్పటికే కాంగ్రెస్ ఫైర్ అవుతోంది. ఇక రాహుల్ గాంధీ ఇంటినీ పోలీసులు కట్టడి చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. భాజపాపై తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. ధరల పెరుగుదల నుంచి నిరుద్యోగిత వరకూ దాదాపు అన్ని అంశాలనూ ప్రస్తావిస్తూ కేంద్రంపై విమర్శలు చేశారు. వీటిలో కొన్ని పంచ్‌లూ ఉన్నాయి. అందులో టాప్-5 ఏంటో చూద్దాం.
కేంద్రంపై రాహుల్ వేసిన టాప్-5 పంచ్‌లు ఇవే..
1. ప్రజాస్వామ్యం నాశనమైపోతుండటాన్ని మనం కళ్లారా చూస్తున్నాం. ఒక్కో ఇటుక పేర్చి ఇల్లు కట్టినట్టుగా, భారతదేశం ప్రజాస్వామ్యాన్ని సాధించుకుంది. శతాబ్దం కింద నిర్మించుకున్న ఈ సౌధం...ఇప్పుడు కళ్లముందే కూలిపోతోంది.
2. కేంద్రం కేవలం నలుగురైదుగురు బిగ్‌షాట్స్ కోసమే పని చేస్తోంది. ఇద్దరు ముగ్గురు బడా బిజినెస్ మేన్‌లకు ప్రయోజనం చేకూర్చేందుకు కేంద్రం ఇలా నియంతృత్వంగా వ్యవహరిస్తోంది. ఇది తప్పు అని వ్యతిరేకిస్తే వెంటనే దాడులు మొదలు పెడుతున్నారు. జైలుకు పంపుతున్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు అవకాశమే లేకుండా పోయింది. భారత్‌లో "ప్రజాస్వామ్యం" అనేది ఇకపై కేవలం ఓ "జ్ఞాపకంగా"మిగిలిపోతుందేమో.
3. ఆర్‌ఎస్‌ఎస్ భావజాలాన్ని అడ్డుకోవటమే నా పని. ఎన్ని ఆటంకాలు వచ్చినా ఇది కచ్చితంగా చేసి తీరతాను. నేనెంత గట్టిగా పోరాడితే, అంత కన్నా తీవ్రంగా దాడులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కానివ్వండి. మీరెంత దాడి చేసినా సంతోషమే.
4. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్..ఎవరికీ అర్థంకాని, తెలియని ఆర్థిక శాస్త్రం గురించి మాట్లాడుతున్నారు. భారత ఆర్థిక వ్యవస్థ స్థితిగతులు ఎలా ఉన్నాయో ఆమెకు అర్థమవుతున్నాయని నేను అనుకోవటం లేదు. ఆమెకున్న అవగాహన శూన్యం. కేవలం పార్లమెంట్‌లో ఓ మౌత్‌పీస్‌లా మిగిలిపోయారు.
5. గాంధీ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని ఎందుకు దాడులు చేస్తున్నారు..? మేం ఓ సిద్ధాంతానికి అనుగుణంగా పోరాటం చేస్తామనే మాపై ఇలా దాడి చేస్తున్నారు. మా లాంటి వాళ్లు దేశంలో కోట్లాది మంది ఉన్నారు. ప్రజాస్వామ్యం కోసం మేం పోరాడతాం. ఎన్నో సంవత్సరాలుగా ఈ పోరాటం కొనసాగుతూనే ఉంది. నేను మాత్రమే కాదు. నాతో పాటు ఎంతో మంది ఈ ఉద్యమంలో ఉన్నారు.
#WATCH | Congress leader Rahul Gandhi says, "I think the macroeconomic fundamentals that she is talking about is something else. I don't think the Finance Minister has any understanding of what is going on in the economy of India, zero understanding. She is there as a mouthpiece" pic.twitter.com/fSWfwwwmMv
— ANI (@ANI) August 5, 2022
Why do they attack the Gandhi family? They do it because we fight for an ideology & there are crores of people like us. We fight for democracy, for communal harmony and we have been doing this for years. It's not just me who did that, it has been happening for years: Rahul Gandhi pic.twitter.com/PSaaCqs51W
— ANI (@ANI) August 5, 2022
Also Read: Bimbisara Review - ‘బింబిసార’ రివ్యూ: మద గజ మహా చక్రవర్తిగా నందమూరి కళ్యాణ్ రామ్ మెప్పించారా? లేదా?
Also Read: Rahul Gandhi Press Meet: హిట్లర్ కూడా నెగ్గాడు- ఎన్నికల్లో ఎలా గెలవాలో నేనూ చూపిస్తా: రాహుల్ గాంధీ