News
News
వీడియోలు ఆటలు
X

Top Headlines Today: మే 17 నాటి షెడ్యూల్డ్‌ హెడ్‌లైన్స్ ఏంటంటే?

Top Headlines Today: తెలుగు రాష్ట్రాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఇవాళ్టి షెడ్యూల్‌లో ఉన్న ముఖ్యమైన అంశాలు ఇవే.

FOLLOW US: 
Share:

Top Headlines Today:

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం
భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ఇవాళ కీలక సమవేశం నిర్వహిస్తున్నారు. కేసీఆర్ అధ్యక్షతన ప్రజా ప్రతినిధుల సమావేశం నిర్వహించనున్నారు.  తెలంగాణ భవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం జరుగుతుంది.  కేసీఆర్‌ అధ్యక్షతన బీఆర్‌ఎస్‌ లెజిస్లేటీవ్‌, పార్లమెంటరీ పార్టీ భేటీ ఉంటుందని.. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ హాజరు కావాలని ఇప్పటికే సమాచారం పంపారు.                         

బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల సమావశంలో కేసీఆర్ ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారన్న దానిపై స్పష్టత లేదు. మొన్నటిదాకా ఇలా ప్రజాప్రతినిధులు లేదా కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేస్తే ముందస్తు ఎన్నికల గురించి ఏమైనా చెబుతారేమో అనుకునేవారు. అయితే ఇప్పుడు ఆ సమయం దాటిపోయింది. వచ్చే ఆరు నెలల్లోనే తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పుడు ప్రభుత్వాన్ని రద్దు చేసినా ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయి కాబట్టి అలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. ఎన్నికలకు ఎలా సిద్ధం కావాలన్న దానిపై ప్రజా ప్రతినిధులకు కేసీఆర్ దిశానిర్దేశం చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

పల్లె పల్లెలో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ 
తెలంగాణలోని అన్ని గ్రామాల్లో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ చేపట్టనున్నారు. ఈ కార్యక్రమం నేటి నుంచి 23 వరకు సాగనుంది. వారం రోజుల పాటు ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేపట్టి ప్రజారోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకోనున్నారు. ఎలాంటి అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచనలు చేయనున్నారు. బడులు, ఆరోగ్య కేంద్రాలు, మార్కెట్ స్థలాలు, బస్టాప్‌లు, ఇలా ప్రతి పబ్లిక్‌ ప్లేస్‌లో నిత్యం శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోనున్నారు. 

పూర్ణాహుతి కార్యక్రమానికి సీఎం జగన్ 
విజయవాడలో జరుగుతున్న రాజశ్మాల సుదర్శన శ్రీ లక్ష్మీ యాగం నేటితో ముగియనుంది. పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ పాల్గోనున్నారు. మొదటి రోజు యాగాన్ని ప్రారంభించిన సీఎం జగన్‌ నేడు పూర్ణాహుతితో ప్రక్రియను ముగిస్తారు. ముగింపు కార్యక్రమంలో గణపతి సచ్చిదానంద స్వామి పాల్గొంటారు. 

ఉత్తరాంధ్రలో టీడీపీ అధినేత టూర్

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర పర్యటన షెడ్యూల్ ఖరారైంది. నేటి నుంచి మూడు రోజుల పాటు ఉత్తరాంధ్రలో చంద్రబాబు పర్యటించనున్నారు.  పెందుర్తి, S.కోట, అనకాపల్లి నియోజకవర్గాల్లో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో టీడీపీ అధినేత పాల్గొననున్నారు. మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు జూబ్లీహిల్స్ లోని తన నివాసం నుంచి బయలుదేరడంతో చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటన మొదలువుతుంది. తన పర్యటన ముగించుకుని చంద్రబాబు తిరిగి మే 19న రాత్రి హైదరాబాద్ కు చేరుకోనున్నారని పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. 

ఐపీఎల్‌లో నేడు 
ఐపీఎల్‌ 2023లో భాగంగా నేడు మరో కీలక పోరు జరగనుంది. పంజాబ్ కింగ్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది. ధర్మశాల వేదికగా మ్యాచ్‌ సాయంత్రం 7.30కి ప్రారంభంకానుంది. ఇప్పటి వరకు పంజాబ్‌ 12 మ్యాచ్‌లు అడగా ఆరింటిలో గెలిచి పాయింట్ల పట్టికలో ఎనిమిదో ప్లేస్‌లో ఉంది. ఢిల్లీ 12 మ్యాచ్‌లలో కేవలం నాలుగు మాత్రమే గెలిచి చివరి స్థానంలో ఉంది. అయితే ఈ మ్యాచ్‌లో గెలిపి ప్లే ఆఫ్‌ ఆశలు సజీవంగా ఉంచుకోవాలని పంజాబ్ భావిస్తుంది.

ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి: 

ఎయిర్‌టెల్: 2023 మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఏకీకృత నికర లాభంలో 50% వృద్ధితో రూ. 3,006 కోట్లను భారతి ఎయిర్‌టెల్ ఆర్జించింది. ఏకీకృత ఆదాయం 14.3% YoY వృద్ధితో రూ. 36,009 కోట్లకు చేరుకుంది. జనవరి-మార్చి కాలంలో ఎయిర్‌టెల్‌ ఆర్పు (ARPU) ప్రత్యర్థి కంపెనీ రిలయన్స్‌ జియో ఆర్పు రూ. 178.8 కంటే మెరుగ్గా రూ. 193 వద్ద ఉంది. మార్చి త్రైమాసికంలో 3.1 మిలియన్ కొత్త సబ్‌స్క్రైబర్‌లను ఎయిర్‌టెల్‌ జోడించింది. డిసెంబర్ త్రైమాసికంలోని 4.4 మిలియన్ల చేరికల కంటే ఇప్పుడు తక్కువగా ఉంది. ఒక్కో షేరుకు రూ. 4 తుది డివిడెండ్‌ చెల్లించాలని ఎయిర్‌టెల్‌ బోర్డు సిఫారసు చేసింది. 

 

జిందాల్ స్టీల్: జనవరి-మార్చి కాలంలో జిందాల్ స్టీల్ అండ్ పవర్ ఏకీకృత నికర లాభం 69% తగ్గి రూ. 462 కోట్లకు పరిమితం అయింది. రిపోర్టింగ్ త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం కూడా 4% తగ్గి రూ. 13,691 కోట్లకు చేరుకుంది.

వి మార్ట్: Q4FY23లో వి మార్ట్ నికర నష్టం రూ. 37 కోట్లకు పెరిగింది. కార్యకలాపాల ద్వారా రూ. 594 కోట్ల ఆదాయం వచ్చింది.

ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్: 2022-23 నాలుగో త్రైమాసికంలో ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ రూ. 1,180 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ఇదే కాలానికి ఎన్‌ఐఐ రూ. 1,990 కోట్లుగా వచ్చింది.

ఒబెరాయ్ రియాల్టీ: 2023 మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఒబెరాయ్ రియాల్టీ రూ. 480 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఇదే త్రైమాసికంలో ఆదాయం రూ. 961 కోట్లుగా ఉంది.

అంబర్ ఎంటర్‌ప్రైజెస్: జనవరి-మార్చి కాలానికి అంబర్ ఎంటర్‌ప్రైజెస్ రూ. 104 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అదే కాలంలో ఆదాయం రూ. 3,002 కోట్లుగా ఉంది.

హీరో మోటోకార్ప్: ఈ టూ వీలర్‌ కంపెనీ సరికొత్త OBD-II, E20 కంప్లైంట్ అడ్వెంచర్ మోటార్‌సైకిల్‌ XPulse 200 4 Valve లాంచ్‌ చేసింది, దీని ద్వారా ప్రీమియం పోర్ట్‌ఫోలియోను పెంచుకుంది.

త్రివేణి టర్బైన్: క్యూ4లో రూ. 55 కోట్ల నికర లాభాన్ని త్రివేణి టర్బైన్ మిగుల్చుకుంది. ఆ త్రైమాసికంలో ఆదాయం రూ. 370 కోట్లుగా ఉంది.

మెట్రోపొలిస్ హెల్త్‌కేర్: నాలుగో త్రైమాసికంలో మెట్రోపొలిస్ హెల్త్‌కేర్ రూ. 33 కోట్ల నికర లాభాన్ని సాధించగా, కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం స్వల్పంగా రూ. 282 కోట్లకు తగ్గింది.

పేటీఎం: సీనియర్ వైస్ ప్రెసిడెంట్ భావేష్ గుప్తాను కంపెనీ ‘ప్రెసిడెంట్ అండ్‌ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్’గా పేటీఎం బోర్డ్ నియమించింది.

Published at : 17 May 2023 09:26 AM (IST) Tags: Telangana Updates IPL 2023 BRS Jagan Chandra Babu Headlines Today Andhra Pradesh Updates

సంబంధిత కథనాలు

ALIMCO Recruitment: అలిమ్‌కోలో103 ఉద్యోగాలు, అర్హతలివే! ఎంపికైతే రూ.90,000 వరకు జీతం!

ALIMCO Recruitment: అలిమ్‌కోలో103 ఉద్యోగాలు, అర్హతలివే! ఎంపికైతే రూ.90,000 వరకు జీతం!

ఒడిశా రైలులో మరో రైలు ప్రమాదం, పట్టాలు తప్పి పడిపోయిన గూడ్స్ ట్రైన్

ఒడిశా రైలులో మరో రైలు ప్రమాదం, పట్టాలు తప్పి పడిపోయిన గూడ్స్ ట్రైన్

Wrestlers Protest: బ్రిజ్‌ భూషణ్‌పై స్టేట్‌మెంట్‌ వెనక్కి తీసుకున్న మైనర్ రెజ్లర్, ఇంతలోనే ఏం జరిగింది?

Wrestlers Protest: బ్రిజ్‌ భూషణ్‌పై స్టేట్‌మెంట్‌ వెనక్కి తీసుకున్న మైనర్ రెజ్లర్, ఇంతలోనే ఏం జరిగింది?

Rahul Gandhi: వెనుక అద్దం చూస్తూ ఇండియా కారును ప్రధాని నడుపుతున్నారు, మోదీపై రాహుల్ గాంధీ సెటైర్లు

Rahul Gandhi: వెనుక అద్దం చూస్తూ ఇండియా కారును ప్రధాని నడుపుతున్నారు, మోదీపై రాహుల్ గాంధీ సెటైర్లు

TTD News: శ్రీవారి సన్నిధిలో కొనసాగుతున్న భక్తుల రద్దీ - నిన్న హుండీ ఆదాయం ఎంతంటే?

TTD News: శ్రీవారి సన్నిధిలో కొనసాగుతున్న భక్తుల రద్దీ - నిన్న హుండీ ఆదాయం ఎంతంటే?

టాప్ స్టోరీస్

Bandi Sanjay on TDP: "టీడీపీ, బీజేపీ పొత్తు ఊహాగానాలే, బాబు అమిత్ షా, నడ్డాలను కలిస్తే తప్పేంటి"

Bandi Sanjay on TDP:

Khammam Medico Suicide: మరో వైద్య విద్యార్థిని ఆత్మహత్య, ఒంటికి నిప్పంటించుకుని బలవన్మరణం!

Khammam Medico Suicide: మరో వైద్య విద్యార్థిని ఆత్మహత్య, ఒంటికి నిప్పంటించుకుని బలవన్మరణం!

Congress: నేను ఎటు పార్టీ మారితే అటు సీఎం అవుతారు! కాంగ్రెస్ నేత ఆసక్తికర వ్యాఖ్యలు

Congress: నేను ఎటు పార్టీ మారితే అటు సీఎం అవుతారు! కాంగ్రెస్ నేత ఆసక్తికర వ్యాఖ్యలు

Amit Shah meets wrestlers: కేంద్ర హోంమంత్రితో రెజ్లర్ల భేటీ, చట్టం పని చట్టాన్ని చేసుకోనివ్వండన్న అమిత్‌షా

Amit Shah meets wrestlers: కేంద్ర హోంమంత్రితో రెజ్లర్ల భేటీ, చట్టం పని చట్టాన్ని చేసుకోనివ్వండన్న అమిత్‌షా