Top Headlines Today: పవన్ అభిమానులకు షాక్ - కుర్చీలోనే గర్భిణీ ప్రసవం - నేటి టాప్ న్యూస్
AP Telangana Latest News: నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం
పవన్ అభిమానులకు షాకింగ్ న్యూస్
ఏపీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇకపై సినిమాలకు పుల్ స్టాప్ పెట్టేయబోతున్నారా? పూర్తిగా రాజకీయాలకే పరిమితం కాబోతున్నారా? అనే అనుమానం కలిగేలా అభిమానులకు హింట్ ఇచ్చేశారు పవన్. దీంతో ఆయన కామెంట్స్ ఒక్కసారిగా సంచలనంగా మారాయి. ఇంకా చదవండి
అచ్యుతాపురం ప్రమాదం - డీజీపీ, సీఎస్‌కు ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు
అచ్యుతాపురం సెజ్ ప్రమాదంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది. సుమోటోగా స్వీకరించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఏపీ సీఎస్, డీజీపీలకు నోటీసులు జారీ చేసింది. ప్రమాదంపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని తెలిపింది. ఇంకా చదవండి
అనకాపల్లిలో మాజీ సీఎం వైఎస్ జగన్
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) శుక్రవారం అనకాపల్లిలో పర్యటించారు. అచ్యుతాపురం ఎసెన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో గాయపడి.. అనకాపల్లిలోని (Anakapalli) ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న బాధితులను ఆయన పరామర్శించారు. ఆస్పత్రిలో వారికి అందుతున్న వైద్య సేవలపై జగన్ ఆరా తీశారు. ప్రమాదం జరిగిన తీరును బాధితులను అడిగి తెలుసుకున్నారు. పార్టీ తరఫున అండగా ఉంటామని.. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. మరోవైపు, మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.కోటి పరిహారం అందించింది. తీవ్రంగా గాయపడ్డ వారికి రూ.50 లక్షలు, స్వల్పంగా గాయపడ్డ వారికి రూ.25 లక్షల చొప్పున అందిస్తున్నామని జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. ఇంకా చదవండి
కుర్చీలోనే గర్భిణీ ప్రసవం
నల్గొండ జిల్లాలో (Nalgonda District) అమానవీయ ఘటన చోటు చేసుకుంది. సిబ్బంది నిర్లక్ష్యంతో ఓ గర్భిణీ కుర్చీలోనే ప్రసవించిన ఘటన నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో గురువారం రాత్రి జరిగింది. బాధితురాలి కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. నేరేడుగొమ్మ మండల కేంద్రానికి చెందిన నల్లవెల్లి అశ్విని అనే గర్భిణీకి గురువారం రాత్రి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే, అక్కడి వైద్యులు మూడో కాన్పు చేయడం కుదరదంటూ.. నల్గొండ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాలని పంపించారు. దీంతో ఆమెను అర్ధరాత్రి దాటిన తర్వాత నల్గొండ ఎంసీహెచ్‌లో చేర్చారు. ఇంకా చదవండి
మోడరన్ ముఖ్యమంత్రి రేవంత్
యువ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అందరూ పిలుస్తూంటారు. నిజానికి ఆయన తాత అయి కూడా చాలా కాలం అయింది. కానీ ఆయన వయసులో రాహుల్ గాంధీతో సమానం. ఇద్దరికీ 54 ఏళ్లే. తాను తాత అయ్యానని రేవంత్ అనుకుంటారు కానీ వయసయిపోయిందని అనుకోరు. అందుకే యువతతో కలిసి ఫుట్ బాల్ మ్యాచులూ ఆడతారు. అదే యూత్ మైండ్ సెట్‌ని తన డ్రెస్సింగ్ స్టైల్‌లోనూ చూపిస్తారు. రాజకీయ నాయకుడు అంటే వైట్ అండ్ వైట్‌లో ఉండాలని ఓ అప్రటిత రూల్ మన దేశంలో ఉంది. ఖద్దరు వస్త్రాలు ధరించి పైన అరకోటు వేసుకుంటేనే పొలిటికల్ లీడర్ లుక్ వస్తుందని.. ఆ హుందానం వస్తుందని అనుకుంటారు. ఎక్కువ మంది డిజైనర్లు కూడా ఇదే ప్రిఫర్ చేస్తూంటారు. కానీ.. రేవంత్ రెడ్డి మాత్రం.. ఈ నమ్మకాన్ని వమ్ము చేయాలని నిర్ణయించుకున్నారు. రాజకీయ నాయకుడైనా మామూలు డ్రెస్‌లలో ఉండొచ్చని.. ముఖ్యంగా ముఖ్యమంత్రి అయినా సరే మార్పేమీ ఉండదని నిరూపిస్తున్నారు. ఇంకా చదవండి