అన్వేషించండి

Top Headlines Today: తిరుపతి లడ్డూ ప్రసాదంలో అపచారం?; రేవంత్ రెడ్డిపై చర్యలకు డిమాండ్ - నేటి టాప్ 5 న్యూస్

AP Telangana Latest News: నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం..

ఏఐసీసీ చీఫ్‌కు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ

సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి హరీష్ రావు (HarishRao) ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge), కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాశారు. మాజీ సీఎం కేసీఆర్‌పై సీఎం అసభ్యకరమైన భాష వాడుతున్నారని, నేరపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. వీటిని అరికట్టడంలో కాంగ్రెస్ ద్వంద్వ వైఖరిని లేఖలో ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీ తనే ప్రవచించిన ప్రమాణాలను పాటించకపోవడం ద్వంద్వ ప్రమాణాలను సూచిస్తున్నాయని.. కేసీఆర్‌పై రేవంత్ వ్యాఖ్యలు ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని అన్నారు. 'రాహుల్ గాంధీపై బీజేపీ తీవ్రవాది అని వ్యాఖ్యలు చేసినప్పుడు  కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. రాజకీయాల్లో దిగజారుడు విమర్శలను తీవ్రంగా ఖండించింది. రాజ్యాంగ విలువలను దిగజారుస్తున్నారని మొసలి కన్నీరు కార్చింది. అలాంటి దూషణలే కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తే హై కమాండ్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఇది కాంగ్రెస్ పార్టీ డబల్ స్టాండర్డ్స్ కాదా?.' అని లేఖలో ప్రశ్నించారు. ఇంకా చదవండి

జగన్‌ తీరు నచ్చలేదు- బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని

బాలినేని శ్రీనివాస్‌రెడ్డి(Balineni Srinivasa Reddy )... ప్రకాశం జిల్లా(Prakasam)లో వైఎస్‌ఆర్‌సీపీ(YSRCP)కి గట్టి నాయకుడు. ఆయన పార్టీకి రాజీనామా చేయడం... వైసీపీ కి షాక్‌ అనే చెప్పాలి. అయితే.. పార్టీని వీడిన బాలినేని... వైఎస్‌ జగన్‌ (YS Jagan) నిర్ణయాలు.. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై భగ్గుమంటున్నారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచీ ఏదీ సక్రమంగా జరగలేదన్నారు. సీఎంగా ఉన్నప్పుడు.. వైఎస్‌ జగన్‌ తీసుకున్న నిర్ణయాలను కూడా ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఇంకా చదవండి

తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌

తెలంగాణలో 15ఏళ్లు దాటిన వాహనాలను తక్కు కింద మార్చేందుకు రంగం సిద్ధమవుతోంది. విపరీతమైన వాయు, శబ్ద కాలుష్యాన్ని నియత్రించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 2025,  జనవరి ఒకటవ తేదీ నుంచి ప్రమాదకరమైన మరియు కాలుష్యకారక వాహనాలను స్క్రాప్‌కు పంపాలని నిర్ణయించింది. 15 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వాహనాలు....అవసరమైన ఫిట్‌నెస్ పరీక్షల్లో ఫెయిల్‌ అయితే... ఆ వాహనాలకు ఇకపై రిజిస్ట్రేషన్ చేయరు. రోడ్లపై తిరిగేందుకు ఆ వాహనాలకు అనుమతి ఉండదు. వెహికల్‌ ఫిట్‌నెస్‌ పరీక్షలో పాసయితే... గ్రీన్‌ ట్యాక్స్‌ చెల్లించి... మూడు నుంచి ఐదేళ్లు అదనంగా నడుపుకోవచ్చు. ఫిట్‌నెస్‌ టెస్ట్‌లో ఫెయిల్‌ అయిన  వాహనాలు మాత్రం స్ర్కాప్‌కే. అలా కాదని... ఆ వాహనాలను రోడ్డెక్కిస్తే... అధికారులు తగిన చర్యలు తీసుకుంటారు. ఇంకా చదవండి

పోలీసుల అదుపులో జానీ మాస్టర్

పరారీలో ఉన్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌‍ను (Jani Master) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు ఆయన్ను బెంగుళూరు ఎయిర్ పోర్ట్ సమీపంలో అదుపులోకి తీసుకుని హైదరాబాద్  (Hyderabad) తరలిస్తున్నారు. నేరుగా హైదరాబాద్‌లోని ఉప్పర్‌పల్లి కోర్టులో ఆయన్ను హాజరుపరిచే అవకాశం ఉంది. కాగా, తనను జానీ మాస్టర్ పలుమార్లు లైంగికంగా వేధించాడని ఆయన దగ్గర పని చేసే మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ (21) పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఆదివారం కేసు నమోదు చేశారు. బాధితురాలు రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి నార్సింగ్ పీఎస్‌కు బదిలీ చేశారు. జానీపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేసి పరారీలో ఉన్న అతన్ని తాజాగా అరెస్ట్ చేశారు. ఇంకా చదవండి

తిరుపతి లడ్డూ ప్రసాదంలో అపచారం అక్కడే జరిగిందా ?

దేవదేవుడైన శ్రీ వేంకటేశ్వరుని లడ్డూ ప్రసాదాన్ని భక్తులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. అలాంటి లడ్డూ తయారీలో వైసీపీ హయాంలో జంతువుల కొవ్వు  వాడారాన్న సంచలన విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు బయట పెట్టారు. ఈ అంశం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఓ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఊరకనే ఆరోపణలు చేయరు. బలమైన ఆధారాలు ఉండబట్టే చేసి ఉంటారని భావిస్తున్నారు. దానికి తగ్గట్లుగానే అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇంకా చదవండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget