అన్వేషించండి

Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ

Telangana News: మాజీ సీఎం కేసీఆర్‌పై.. సీఎం రేవంత్ రెడ్డి అసభ్యకరమైన భాష వాడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ముఖ్యమంత్రిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలంటూ ఏఐసీసీ చీఫ్ ఖర్గేకు లేఖ రాశారు.

Harishrao Open Letter To AICC Chief Kharge: సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి హరీష్ రావు (HarishRao) ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge), కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాశారు. మాజీ సీఎం కేసీఆర్‌పై సీఎం అసభ్యకరమైన భాష వాడుతున్నారని, నేరపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. వీటిని అరికట్టడంలో కాంగ్రెస్ ద్వంద్వ వైఖరిని లేఖలో ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీ తనే ప్రవచించిన ప్రమాణాలను పాటించకపోవడం ద్వంద్వ ప్రమాణాలను సూచిస్తున్నాయని.. కేసీఆర్‌పై రేవంత్ వ్యాఖ్యలు ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని అన్నారు. 'రాహుల్ గాంధీపై బీజేపీ తీవ్రవాది అని వ్యాఖ్యలు చేసినప్పుడు  కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. రాజకీయాల్లో దిగజారుడు విమర్శలను తీవ్రంగా ఖండించింది. రాజ్యాంగ విలువలను దిగజారుస్తున్నారని మొసలి కన్నీరు కార్చింది. అలాంటి దూషణలే కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తే హై కమాండ్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఇది కాంగ్రెస్ పార్టీ డబల్ స్టాండర్డ్స్ కాదా?.' అని లేఖలో ప్రశ్నించారు.

ఢిల్లీలో ఓ రూల్.. గల్లీలో ఓ రూల్

ఢిల్లీలో ఒక రూల్.. గల్లీలో ఒక రూల్ పాటించడం కాంగ్రెస్ పార్టీకే చెల్లుతుందని హరీష్ రావు లేఖలో పేర్కొన్నారు. 'సీఎం రేవంత్ వ్యాఖ్యలు రాజ్యాంగ విలువలకు విరుద్ధం. కాంగ్రెస్ హై కమాండ్ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. సీఎం ప్రవర్తన మహాభారతంలో దుర్యోధనుడి క్రూరత్వంలా ఉంది. కాంగ్రెస్ పార్టీ తన నైతిక ప్రమాణాలు పాటించకుండా ఇతరులకు నీతులు చెప్పడం శోచనీయం. కేసీఆర్, ఆయన కుటుంబంపై ముఖ్యమంత్రి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం ఆ పదవి స్థాయిని దిగజార్చడం కాదా?. 'కేసీఆర్‌ను రాళ్లతో కొట్టి చంపాలి' అనే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను కాంగ్రెస్ హై కమాండ్ సమర్ధిస్తుందా?. హింసాత్మక వ్యాఖ్యలు, జర్నలిస్టులపై దాడులు చేయడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని ప్రకటించిన రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదు. పోలీసులను అడ్డుపెట్టుకొని బీఆర్‌ఎస్ నాయకులపై నిరాధార కేసులు పెట్టి రాజకీయ కక్ష సాధింపుకు పాల్పడడం దుర్మార్గం. తెలంగాణలో సీఎం రేవంత్ నాయకత్వంలో నియంతృత్వ పాలన కొనసాగుతుందని చెప్పేందుకు ఇదే నిదర్శనం. పార్టీ ద్వంద్వ వైఖరి మహాభారతంలో ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడి దుర్మార్గాలను ఉపేక్షించడం లాంటిదే. రేవంత్ రెడ్డి చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. ప్రజాస్వామ్యాన్ని పాతరేస్తున్న సీఎంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.' అని హరీష్ లేఖలో పేర్కొన్నారు.

Also Read: KTR: 'బాబూ చిట్టి, ఇక వాటిపై దృష్టి పెట్టు' - సీఎం రేవంత్‌పై కేటీఆర్ సంచలన ట్వీట్, రైతులను అరెస్ట్ చేయడంపై తీవ్ర ఆగ్రహం

 
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu:  పన్ను ఎగవేతలకు ఏఐతో చెక్ పెట్టండి - ఆదాయార్జన శాఖలకు చంద్రబాబు సూచనలు
పన్ను ఎగవేతలకు ఏఐతో చెక్ పెట్టండి - ఆదాయార్జన శాఖలకు చంద్రబాబు సూచనలు
Revanth Reddy : తెలంగాణలో బీజేపీని అడుగు పెట్టనివ్వబోం - గుజరాత్ ఏఐసీసీ ప్లీనరీలో రేవంత్ కీలక ప్రసంగం
తెలంగాణలో బీజేపీని అడుగు పెట్టనివ్వబోం - గుజరాత్ ఏఐసీసీ ప్లీనరీలో రేవంత్ కీలక ప్రసంగం
Kakani Govardhan Reddy:  కాకాణి గోవర్ధన్ రెడ్డికి హైకోర్టులో దొరకని రిలీఫ్ - దొరికితే అరెస్టు చేసేందుకు పోలీసుల గాలింపు
కాకాణి గోవర్ధన్ రెడ్డికి హైకోర్టులో దొరకని రిలీఫ్ - దొరికితే అరెస్టు చేసేందుకు పోలీసుల గాలింపు
Tahawwur rana: కసబ్ బాబు లాంటి టెర్రరిస్టును అమెరికా నుంచి లాక్కొస్తున్నారు -తహవూర్ రాణాకు ఉరి శిక్ష విధిస్తారా ?
కసబ్ బాబు లాంటి టెర్రరిస్టును అమెరికా నుంచి లాక్కొస్తున్నారు -తహవూర్ రాణాకు ఉరి శిక్ష విధిస్తారా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

KKR Batting Strategy IPL 2025 | లక్నో మీద గెలవాల్సిన మ్యాచ్ ను కేకేఆర్ చేజార్చుకుంది | ABP DesamNicholas Pooran 87 vs KKR | లక్నోకు వరంలా మారుతున్న పూరన్ బ్యాటింగ్Priyansh Arya Biography IPL 2025 | PBKS vs CSK మ్యాచ్ లో సెంచరీ బాదిన ప్రియాంశ్ ఆర్య ఎంత తోపంటేDevon Conway Retired Out Controversy | కాన్వే రిటైర్డ్ అవుట్ అవ్వటం సీఎస్కే కొంప ముంచిందా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu:  పన్ను ఎగవేతలకు ఏఐతో చెక్ పెట్టండి - ఆదాయార్జన శాఖలకు చంద్రబాబు సూచనలు
పన్ను ఎగవేతలకు ఏఐతో చెక్ పెట్టండి - ఆదాయార్జన శాఖలకు చంద్రబాబు సూచనలు
Revanth Reddy : తెలంగాణలో బీజేపీని అడుగు పెట్టనివ్వబోం - గుజరాత్ ఏఐసీసీ ప్లీనరీలో రేవంత్ కీలక ప్రసంగం
తెలంగాణలో బీజేపీని అడుగు పెట్టనివ్వబోం - గుజరాత్ ఏఐసీసీ ప్లీనరీలో రేవంత్ కీలక ప్రసంగం
Kakani Govardhan Reddy:  కాకాణి గోవర్ధన్ రెడ్డికి హైకోర్టులో దొరకని రిలీఫ్ - దొరికితే అరెస్టు చేసేందుకు పోలీసుల గాలింపు
కాకాణి గోవర్ధన్ రెడ్డికి హైకోర్టులో దొరకని రిలీఫ్ - దొరికితే అరెస్టు చేసేందుకు పోలీసుల గాలింపు
Tahawwur rana: కసబ్ బాబు లాంటి టెర్రరిస్టును అమెరికా నుంచి లాక్కొస్తున్నారు -తహవూర్ రాణాకు ఉరి శిక్ష విధిస్తారా ?
కసబ్ బాబు లాంటి టెర్రరిస్టును అమెరికా నుంచి లాక్కొస్తున్నారు -తహవూర్ రాణాకు ఉరి శిక్ష విధిస్తారా ?
Mark Shankar:  మార్క్ శంకర్ లెటెస్ట్ హెల్త్ అప్ డేట్ ఇదే - పవన్ ఎంత టెన్షన్ పడి ఉంటారో కదా !
మార్క్ శంకర్ లెటెస్ట్ హెల్త్ అప్ డేట్ ఇదే - పవన్ ఎంత టెన్షన్ పడి ఉంటారో కదా !
Police On Jagan: జగన్ క్షమాపణ చెప్పకపోతే న్యాయపోరాటం - ఏపీ పోలీసు అధికారుల సంఘం హెచ్చరిక
జగన్ క్షమాపణ చెప్పకపోతే న్యాయపోరాటం - ఏపీ పోలీసు అధికారుల సంఘం హెచ్చరిక
Viral Video: ఓటు వేస్తే ఒంటరి మహిళల్ని తల్లుల్ని చేస్తాడట - ఓ లీడర్ హామీ - మహిళా లోకం ఊరుకుంటుందా?
ఓటు వేస్తే ఒంటరి మహిళల్ని తల్లుల్ని చేస్తాడట - ఓ లీడర్ హామీ - మహిళా లోకం ఊరుకుంటుందా?
Amaravati Hyderabad Greenfield Expressway: అమరావతి- హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేకి కేంద్రం ఆమోదం
అమరావతి- హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేకి కేంద్రం ఆమోదం
Embed widget