అన్వేషించండి

Balineni Srinivasa Reddy: జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు

Balineni Srinivasa Reddy: వైసీపీకి రాజీనామా చేసిన బాలినేని శ్రీనివాస్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్‌ నిర్ణయాలు సరిగా లేవని... పార్టీ నుంచి తనను బయటకు పంపే కుట్రలు జరిగాయని అన్నారు.

Balineni Srinivasa Reddy Comments On YS Jagan: బాలినేని శ్రీనివాస్‌రెడ్డి(Balineni Srinivasa Reddy )... ప్రకాశం జిల్లా(Prakasam)లో వైఎస్‌ఆర్‌సీపీ(YSRCP)కి గట్టి నాయకుడు. ఆయన పార్టీకి రాజీనామా చేయడం... వైసీపీ కి షాక్‌ అనే చెప్పాలి. అయితే.. పార్టీని వీడిన బాలినేని... వైఎస్‌ జగన్‌ (YS Jagan) నిర్ణయాలు.. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై భగ్గుమంటున్నారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచీ ఏదీ సక్రమంగా జరగలేదన్నారు. సీఎంగా ఉన్నప్పుడు.. వైఎస్‌ జగన్‌ తీసుకున్న నిర్ణయాలను కూడా ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.

పార్టీలో కొంత మంది కోటరీగా ఏర్పడ్డారని...వాళ్లకు తాను పార్టీలో ఉండటమే ఇష్టం లేదని అన్నారు బాలినేని. వాళ్లే తనపై కొన్ని క్రియేట్‌ చేసి ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని పదేపదే చెప్పినా పట్టించుకోలేదన్నారు. పైగా తనను నెగెటివ్‌గా తీసుకున్నారన్నారు బాలినేని. పార్టీ బాగుండాలని చెప్తే... నెగెటివ్‌గా తీసుకున్నారని వాపోయారు. ఒంగోలు ఎంపీగా మాగుంటల శ్రీనివాసులురెడ్డికి టికెట్‌ ఇప్పించేందుకు చాలా ఫైట్‌ చేశానని అన్నారు బాలినేని. అయితే... అప్పుడు తన మాటను ఎవరూ వినిపించుకోలేదని చెప్పారు. చిత్తూరు నుంచి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని తీసుకొచ్చి... ఒంగోలు ఎంపీగా నిలబెట్టారన్నారు. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పెద్దనాయుకుడు అని వాళ్లకు ఫీలింగ్‌ ఉంటే  మనం ఏం చేయగలమని అన్నారు బాలినేని. చెవిరెడ్డిని ఒంగోలు ఎంపీగా గెలిపించాలన్నది ఎంత వరకు కరెక్టో వారికే తెలియాలన్నారు. ఇదే కాదు.. పార్టీ తాను ఎన్నో ఇబ్బందులు ఎదుక్కొన్నానని... అవన్నీ చూసి అసహ్యం కలిగిందన్నారు బాలినేని. అందుకే పార్టీ రాజీనామా చేశానని చెప్పుకొచ్చారు.

Also Read: పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?

ముఖ్యంగా వైఎస్‌ జగన్‌ నిర్ణయాలను చాలాసార్లు విభేదించారన్నారు బాలినేని శ్రీనివాస్‌రెడ్డి. మద్యం, ఇసుక విషయాల్లో.. జగన్‌ తీరు నచ్చలేదన్నారు. వాటి గురించి ప్రశ్నించినందుకు.. తనను దూరం పెట్టారన్నారు. తాను చేసేదే కరెక్ట్‌ అన్నట్టు  జగన్‌ మాట్లాడేవారని అన్నారు. జగన్‌ తీరు నచ్చక...చాలాకాలంగా తాను వైసీపీకి దూరంగా ఉంటున్నానన్నారు. వైఎస్‌ఆర్‌సీపీలో కోటరీ ఉందని... అప్పుడూ ఉంది.. ఎప్పుడూ ఉంది... ఇంకా కూడా ఉంటుందని అన్నారు బాలినేని. ఆ కోటరీ వల్లే  వైఎస్‌ఆర్‌సీపీకి నష్టం కలుగుతోందన్నారు. తాను కాంగ్రెస్‌లోకి వెళ్తున్నట్టు... ఢిల్లీ వెళ్లి మాట్లాడినట్టు కూడా ఆ కోటరీనే తప్పుడు ప్రచారం చేయించిందన్నారు. తనకు కాంగ్రెస్‌లో పిల్ల కాంగ్రెస్‌లో విలీనం అవుతుందనే ప్రచారం కూడా అక్కడి నుంచి తీసుకొచ్చిందేనన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు చిల్లరగా విహేవ్‌ చేస్తున్నారని మండిపడ్డారు. ఆ పరిణామాలతో విసుగుచెంది.. ఒక పార్టీలో ఉండలేక రాజీనామా చేశానన్నారు బాలినేని.

Also Read: బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?

జనసేనలోకి బాలినేని...!
జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌(Pawan Kalyan)ను కలుస్తానన్నారు బాలినేని శ్రీనివాస్‌రెడ్డి. పవన్‌ను కలిసిన తర్వాత... భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. జనసేన(Janasena) పార్టీలో ఎప్పుడు చేరుతానో తేదీ ప్రకటిస్తానన్నారు. మరోవైపు... వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి రాజీనామా చేయడంతో.. ఒంగోలు (Ongole)లో జనసేన కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. బాణాసంచా కాల్చి... పార్టీలోకి బాలినేనిని గ్రాండ్‌గా ఆహ్వానిస్తామంటున్నారు. ఇక.. పవన్‌ కళ్యాణ్‌ - బాలినేని శ్రీనివాస్‌రెడ్డి భేటీ.. ఆ తర్వాత రాబోయే ప్రకటనపై..  అందరిలో ఆసక్తి నెలకొంది.

Also Read: జగన్‌కు కోలుకోలేని షాక్ ఇచ్చిన బాలినేని - వైసీపీకి రాజీనామా - రేపో మాపో జనసేనలో చేరిక !

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
KCR News: ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
Game Changer Teaser: ‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
AP Cabinet: ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నడి సంద్రంలో ఇద్దరే మహిళలు, భూగోళాన్ని చుట్టే్సే అద్భుత యాత్రట్రంప్ ఎన్నికతో మస్క్ ఫుల్ హ్యాపీ! మరి కూతురికి భయమెందుకు?ఉడ్‌బీ సీఎం అని  లోకేశ్ ప్రచారం - అంబటి రాంబాబుఅధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
KCR News: ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
Game Changer Teaser: ‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
AP Cabinet: ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
Hyderabad News: భాగ్యనగర వాసులకు అలర్ట్ - ఈ నెల 11న ఈ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా బంద్
భాగ్యనగర వాసులకు అలర్ట్ - ఈ నెల 11న ఈ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా బంద్
Royal Enfield Flying Flea C6: మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను పరిచయం చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ - లాంచ్ ఎప్పుడంటే?
మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను పరిచయం చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ - లాంచ్ ఎప్పుడంటే?
Pawan Kalyan: ఆ కుటుంబాలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ, సొంత ట్రస్ట్ నుంచి రూ. 2 లక్షల సాయం
ఆ కుటుంబాలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ, సొంత ట్రస్ట్ నుంచి రూ. 2 లక్షల సాయం
Lucky Car: 1500 మంది అతిథులు, రూ.4 లక్షల ఖర్చు - అదృష్టం తెచ్చిన కారుకు అంత్యక్రియలు
1500 మంది అతిథులు, రూ.4 లక్షల ఖర్చు - అదృష్టం తెచ్చిన కారుకు అంత్యక్రియలు
Embed widget