Top Headlines Today: వైసీపీ ఆఫీసుల కూల్చివేతపై హైకోర్టు కీలక ఆదేశాలు; కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరాటం? - నేటి టాప్ న్యూస్
AP Telangana Latest News: నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం
వైసీపీ ఆఫీసుల కూల్చివేతపై చట్ట ప్రకారమే వ్యవహరించండి - ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
వైఎస్ఆర్‌సీపీ ఆఫీసుల కూల్చివేత విషయంలో చట్ట నిబంధనలు పాటించాలని ఏపీ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. వైసీపీ కార్యాలయాలు కూల్చివేస్తున్నారంటూ ఆ పార్టీ నేతలు దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి దశలోనూ వైసీపీ తరపున వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని పేర్కొంది. 2 నెలల్లో భవనాల అనుమతులు, ఆధారాలు, రికార్డులు అధికారుల ముందు ఉంచాలని వైసీపీని న్యాయస్థానం ఆదేశించింది. తగినంత సమయం ఇచ్చి వివరణ తీసుకున్నాక కట్టడాల విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా, ప్రమాదకరంగా ఉన్న సమయంలోనే కూల్చివేత ఆలోచన చేయాలని సూచించింది. ఇంకా చదవండి
పిన్నెల్లిపై అన్యాయంగా కేసులు పెట్టారు - జగన్ ఆరోపణ - మాజీ ఎమ్మెల్యేతో ములాఖత్
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై అన్యాయంగా కేసులు పెట్టారని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఆయన పరామర్శించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. పిన్నెల్లి వరుసగా నాలుగు సార్లు గెలిచారంటే.. ఆయన మంచి వాడనే ప్రజలు గెలిపించారన్నారు. అలాంటి మనిషిని తీసుకు వచ్చి జైల్లో పెట్టారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో జరిగిన ఘటనల్లో పిన్నెల్లి ప్రమేయం లేదన్నారు. కారంపూడిలో ఎన్నికల రోజు.. టీడీపీ నేతలు ఓ దళిత కుటుంబంపై దాడి చేస్తే వారిని పరామర్శించడానికి వెళ్లారన్నారు. అక్కడ టీడీపీ నేతలు అడ్డుకునే ప్రయత్నం జరిగితే ఘర్షణలు జరిగాయన్నారు. ఇంకా చదవండి
వరంగల్ నిట్ విద్యార్థి ఘనత - రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీతో కొలువు
వరంగల్ నిట్ విద్యార్థి క్యాంపస్ ఎంపికల్లో సత్తా చాటారు. జాతీయ సాంకేతిక సంస్థ (NIT)లో నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో బీటెక్ ఈసీఈ విద్యార్థి రవిషాకు రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీ దక్కినట్లు నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుధి తెలిపారు. రవిషా పంజాబ్‌లోని లుథియానాకు చెందినవారు. ఆయన తండ్రి వ్యాపారవేత్త, తల్లి గృహిణి. కోడింగ్‌లో మెలకువలు, ప్రొఫెసర్ల మార్గదర్శకత్వం తనకు ఈ ఘనత సాధించడానికి తోడ్పడ్డాయని రవిషా తెలిపారు. మరో 12 మంది విద్యార్థులు రూ.68 లక్షల ప్యాకేజీతో ఉద్యోగాలు సాధించారని నిట్ అధికారులు తెలిపారు. ఇంకా చదవండి
పీసీసీ చీఫ్, కేబినెట్ విస్తరణపై వెనుకడుగు
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు ఢిల్లీకి, హైదరాబాద్ కు మధ్య పరుగులు పెడుతున్నారు. టీ పీసీసీ చీఫ్ పదవి కోసం కొందరు.. మంత్రి పదవుల కోసం మరికొందరు హడావుడి పడుతున్నారు. ఇంకా చదవండి
చట్టబద్ధంగా వైఎస్ఆర్‌సీపీ ముఖ్యనేతల్ని రౌండప్ చేస్తున్న టీడీపీ
తెలుగుదేశం పార్టీ గెలిచిన మరుక్షణం వైఎస్ఆర్‌సీపీ నేతలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుందని ఎన్నికలకు ముందు టీడీపీ నేతలు గర్జించేవారు. నారా లోకేష్ అయితే రెడ్ బుక్ చూపించి ఎవర్నీ వదిలే ప్రసక్తే లేదని చెప్పేవారు. ఇలా చెప్పినందుకు ఆయనపై సీఐడీ కేసు కూడా నమోదు చేసింది. ఆయనను అరెస్టు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును కూడా కోరింది. ఇక ఇతర నేతలు, ధ్వితీయ శ్రేణి నేతల ఆవేశం గురించి చెప్పాల్సిన పని లేదు. కూటమికి మెజార్టీ వచ్చిన మరుక్షణం విరుచుకుపడతారని అనుకున్నారు. కానీ ఎన్నికల ఫలితాలు వచ్చి నెల రోజులు గడుస్తున్నా పెద్దగా ఏమీ జరగలేదు. గ్రామ స్థాయిలో జరిగే చిన్న చిన్న గొడవలే బయటపడుతున్నాయి. ఇంకా చదవండి