Warangal NIT Student: వరంగల్ నిట్ విద్యార్థి ఘనత - రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీతో కొలువు
Warangal News: వరంగల్ నిట్ విద్యార్థి రవిషా రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీతో క్యాంపస్ సెలక్షన్స్‌లో కొలువు సాధించినట్లు నిట్ డైరెక్టర్ తెలిపారు. మరో 12 మంది విద్యార్థులు రూ.68 లక్షల ప్యాకేజీ పొందారన్నారు.
Warangal NIT Student Got 88 Lakhs Yearly Package Offer: వరంగల్ నిట్ విద్యార్థి క్యాంపస్ ఎంపికల్లో సత్తా చాటారు. జాతీయ సాంకేతిక సంస్థ (NIT)లో నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో బీటెక్ ఈసీఈ విద్యార్థి రవిషాకు రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీ దక్కినట్లు నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుధి తెలిపారు. రవిషా పంజాబ్‌లోని లుథియానాకు చెందినవారు. ఆయన తండ్రి వ్యాపారవేత్త, తల్లి గృహిణి. కోడింగ్‌లో మెలకువలు, ప్రొఫెసర్ల మార్గదర్శకత్వం తనకు ఈ ఘనత సాధించడానికి తోడ్పడ్డాయని రవిషా తెలిపారు. మరో 12 మంది విద్యార్థులు రూ.68 లక్షల ప్యాకేజీతో ఉద్యోగాలు సాధించారని నిట్ అధికారులు తెలిపారు. 82 శాతం మంది బీటెక్ విద్యార్థులు ఐటీ సంస్థల్లో ఉద్యోగాలు సాధించారని చెప్పారు. ఈ ఏడాది సగటు ప్యాకేజీ రూ.15.6 లక్షలుగా ఉందని పేర్కొన్నారు.
విద్యార్థులకు అభినందన
2023 - 24 ఏడాది క్యాంపస్ సెలక్షన్స్‌లో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను నిట్ డెరక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుధి అభినందించారు. బీటెక్ విద్యార్థులు 82 శాతం, ఎంటెక్, ఎంసీఏ, ఎమ్మెస్సీ, ఎంబీఏతో సహా మొత్తం 76 శాతం ప్లేస్‌మెంట్స్ సాధించారని తెలిపారు. ఈ ఏడాది 250కి పైగా ప్రైవేట్ కంపెనీలు, 10 ప్రభుత్వ రంగ సంస్థలు క్యాంపస్ ఎంపికలు చేపట్టాయని వివరించారు. 1,483 మంది విద్యార్థుల్లో 1,128 మంది విద్యార్థులు ఉద్యోగ ఆఫర్లు పొందారని చెప్పారు.
Also Read: Telangana Cabinet: మంత్రి పదవి కోసం వరంగల్ జిల్లా నేతల మధ్య పోటీ, అసలు ఛాన్స్ ఉందా?