Top Headlines Today: వైసీపీకి మరో దళిత నేత రాజీనామా; గన్‌పార్క్‌కు రుణమాఫీ రాజకీయం - నేటి టాప్ న్యూస్
నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం
వైసీపీకి మరో దళిత నేత రాజీనామా
ఏపీ అధికార పార్టీ వైఎస్ఆర్‌సీపీకి దళిత నేతలు వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. తాజాగా గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి పంపారు. గుంటూరు వైసీపీ అధ్యక్షుడిగా వ్యవహిస్తున్న మాజీ మంత్రి డొక్కా మానిక్యవరప్రసాద్‌కు ఆ పార్టీలో గుర్తింపు లేదు. కనీసం ఎవరూ ప్రచారానికి కూడా పిలవడం లేదు. కొద్ది రోజుల కిందట జరిగిన సామాజిక బస్సు యాత్రలో పార్టీలో తన పరిస్థితిపై తానే బాధపడ్డారు. తనకు న్యాయం జరగడం లేదని.. ఒక్క సారి జగన్‌ను కలిపించాలని ఆయన వేదికపై ఉన్న నేతల్ని వేడుకున్నారు. ఆ తర్వాత నుంచి ఆయనను మరింతగా దూరం పెట్టారు. జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నా కనీసం పార్టీ కార్యక్రమాలపైనా సమాచారం ఇవ్వడం లేదు. ఇంకా చదవండి
గన్‌పార్క్‌కు చేరిన రుణమాఫీ రాజకీయం
తెలంగాణలో ఓ వైపు లోక్‌సభ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. మరోవైపు ప్రభుత్వాన్ని ప్రజల ముందు దోషిగా నిలబెట్టేందుకు ప్రతిపక్షాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అస్త్రంగా మలుచుకొని లోక్‌సభ ఎన్నికల్లో దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నాయి. ఆరు హామీలతోపాటు రైతు రుణమాఫీ, రైతు బంధు పథకాల అమలు తీరుపై విమర్శలు చేస్తున్నాయి. ఇంకా చదవండి
వైసీపీని వెంటాడనున్న మేనిపెస్టో
అధికార పార్టీ విడుదల చేసే మేనిఫెస్టోలపై ప్రజల్లో పెద్దగా ఆసక్తి ఉండదు. దానికి కారణం అప్పటికే వారు ప్రకటించిన మేనిఫెస్టోను అమలు చేయకుండా విశ్వాసం కోల్పోయి ఉంటారు. రాజకీయ పార్టీలు వందల హామీలు ఇస్తూ ఉంటాయి. అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఎవరు ఏమి అడిగినా అది సాధ్యమా కాదా అని ఆలోచించకుండా అధికారంలోకి రాగానే చేస్తామంటాయి. చాలా వరకూ మేనిఫెస్టోల్లో పెడతాయి. అందుకే తదుపరి ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి అనేక పార్టీలు కొత్త హామీల విషయంలో అంత చురుకుగా ఉండలేవు. ప్రస్తుతం వైఎస్ఆర్‌సీపీ పరిస్థితి కూడా అంతే. నామినేషన్ల గడువు ముగిసినా ఇంకా మేనిఫెస్టో ప్రకటించలేదు. ఇప్పుడు మేనిపెస్టో ప్రకటిస్తే.. అమలులో ఉన్న మేనిఫెస్టోలో అమలు చేయని వాటి సంగతి చెప్పాలన్నడిమాండ్లు వస్తాయి. ప్రజాబాహుళ్యంలో జగన్ హామీలు ఇచ్చి.. మేనిపెస్టోలో పెట్టిన అనేక అంశాలు అమలు కాలేదు. వాటిపై ఇప్పుడు చర్చ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇంకా చదవండి
భువనేశ్వరి పేరుతో సోషల్ మీడియాలో బూతుల ఆడియో వైరల్
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు భార్య భువనేశ్వరి వాయిస్‌గా చెబుతూ ఓ ఆడియో వైరల్ అవుతోంది. అందులో ఎవరినో ఆమె బూతులు తిడుతున్నట్టు అందులో వాయిస్ ఉంది. ఇది దళితులనే ఆమె తిట్టాలని వైసీపీ వర్గీయులు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. తన అక్క చెప్పినా తాను పట్టించుకోలేదని... వీళ్లంతా బతకనివ్వరని అసహనంతో అన్న మాటలు అందులో ఉన్నాయి. ఇంకా చదవండి
హరీష్ రావు సవాల్ స్వీకరిస్తున్నాం- రాజీనామా లేఖ రెడీ చేసుకో: రేవంత్ రెడ్డి
ఆగష్టు15న రైతులకు రుణమాఫీ చేసి తీరుతామన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాజీనామా అంటున్న హరీష్‌రావు స్పీకర్ ఫార్మాట్‌లో రిజైన్ లెటర్ రెడీ చేసుకోమని సవాల్ చేశారు. ప్రజలను మోసం చేయాలనుకునే ప్రతిసారీ హరీష్‌రావుకు అమరవీరు స్థూపం గుర్తుకు వస్తుందని ఎద్దేవా చేశారు రేవంత్. ఇంకా చదవండి