Top Headlines Today: బీసీ సీఎం, పవన్ పొత్తు గేమ్ ఛేంజర్ అవుతాయా? ఏపీలో టార్గెట్ పురందేశ్వరి అయ్యారా? మార్నింగ్ న్యూస్
Top 10 Headlines Today: నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం
Top 10 Headlines Today:
పవర్ వచ్చినట్టేనా!
ప్రధానమంత్రి నరేంద్రమోదీ బీసీ ఆత్మగౌరవ సభలో బీజేపీ గెలుస్తుంది.. బీసీని సీఎంను చేస్తుందని ప్రకటించారు. అయితే తెలంగాణలో రాజకీయ పరిస్థితులు మోదీ వ్యక్తం చేసినంత కాన్ఫిడెంట్ గా బీజేపీకి లేవని చెప్పుకోవచ్చు. ప్రధాన పోటీ దారుల్లో బీజేపీ లేదని అనేక సర్వేలు వెల్లడించాయి. అయితే బీజేపీ మాత్రం ప్లాన్ బీతో ఎవరూ ఊహించని విధంగా గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఆ ప్లాన్ బీ ఏమిటన్నదాని సంగతి పక్కన పెడితే.. బీసీ సీఎం విషయంలో బీజేపీ అంత నమ్మకంగా ఉండటానికి కారణం ఏమిటి ? పవన్ కల్యాణ్‌తో పొత్తు కోసం గట్టిగా ప్రయత్నించాల్సిన అవసరం ఏముంది ? బీసీ సీఎం, పవన్ పొత్తు గేమ్ ఛేంజర్ అని ప్రధాని మోదీ గట్టిగా నమ్ముతున్నారని ఆయన ప్రసంగాన్ని చూస్తే అర్థం అవుతుంది. మరి బీజేపీ బీసీ ఆత్మగౌరవ సభ తర్వాత తెలంగాణ బీసీల్లో బీజేపీ కోరుకున్నంత కదలిక వస్తుందా ?పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
హంగ్‌లో ఏ పార్టీ ఎటువైపు
తెలంగాణ రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. పోలింగ్ కు పట్టుమని మూడు వారాలు కూడా లేవు. పార్టీలన్నీ పూర్తి స్థాయిలో బరిలోకి దిగాయి. హోరాహోరీ ప్రచారం చేస్తున్నాయి. కానీ ఫలితాలు ఎలా వస్తే ఎలా స్పందించాలన్న దానిపై ముందుగానే అన్ని రాజకీయ పార్టీలు ప్లాన్ బీ రెడీ చేసుకుంటాయి. అదీ తేడా కొడితే ఏం చేయాలన్నదానిపై ప్లాన్ సీ కూడా రెడీ చేసుకుంటాయి. ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఉన్న పరిస్థితుల్లో హంగ్ ను తోసిపుచ్చలేమని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. అందుకే ఎన్నికల ఫలితాల తర్వాత నిజంగా హంగ్ వస్తే.. ప్రతిష్టంభన ఏర్పడే అవకాశం లేదు. ఓ రెండు పార్టీలు కలిసి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి. ఆ రెండు పార్టీలు ఏమిటన్నది ఇప్పుడు కీలకం. బీఆర్ఎస్ పార్టీ ఏ జాతీయ పార్టీతో కలుస్తుందన్నదే చర్చనీయాంశం. ఎందుకంటే రెండు జాతీయ పార్టీలు కలవవు. బీఆర్ఎస్‌తో ఓ జాతీయ పార్టీ మాత్రమే కలవాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
టార్గెట్ పురందేశ్వరి
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరిపై మంత్రి ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో రైతు భరోసా 5వ విడత కార్యక్రమంలో రోజా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పురందేశ్వరి తీరుపై విమర్శలు చేశారు. బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నారని రోజా ఆరోపించారు. జగన్ మోహన్ రెడ్డిపై మళ్లీ కేసులను రీఓపెన్ చేయాలని సుప్రీం కోర్టు న్యాయమూర్తికి లేఖలు రాయడం శోచనీయమని అన్నారు. సీఎం జగన్ తనపై ఉన్న అక్రమ కేసులను త్వరితగతిన విచారణ జరపాలని స్వయంగా ఆయనే కోరారనీ రోజా గుర్తు చేశారు. అది దమ్మున్న నాయకుడి లక్షణమని రోజా కొనియాడారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
డ్రైవర్‌దే తప్పు
విజయవాడ ఆర్టీసీ బస్టాండ్‌లో సోమవారం జరిగిన ప్రమాదంపై ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ప్రమాదానికి కారణాలపై కమిటీ విచారణ జరిపి మంగళవారం నివేదిక సమర్పించింది. బస్సు డ్రైవర్ ప్రకాశం బస్టాండ్ నుంచి బస్సును బయటకు నడిపే క్రమంలో గేర్ తప్పుగా వేయడంతో ప్రమాదం జరిగినట్లు నిర్ధారించారు. ప్రమాదంలో ముగ్గురు చనిపోవడానికి కారణమైన డ్రైవర్ ప్రకాశంపై సస్పెన్షన్‌కు ప్రతిపాదించారు. అలాగే శాఖా కఠినమైన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని సూచించించారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
బీ ఫామ్‌లో మార్పు
అధికార పార్టీ బీఆర్ఎస్ ఇదివరకే 110 మంది అభ్యర్థులకు బీ ఫారాలు ఇచ్చింది. మంగళవారం నాడు 9 మంది అభ్యర్థులకు బీ ఫారాలు ఇచ్చారు. పార్టీ అభ్యర్థులకు పార్టీ అధినేత సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు, మంత్రి కె.తారక రామారావు (KTR) బి ఫారాలు అందచేశారు. దాంతో బీఆర్ఎస్ 119 మంది అభ్యర్థులకు బీ ఫారాలు అందిచ్చినట్లయింది. మజ్లిస్ పోటీ చేసే పాతబస్తీ స్థానాలతో పాటు అలంపూర్ సీటుకు సంబంధి బీ ఫారాల ప్రక్రియ పూర్తి చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
జనసేన లిస్ట్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం జనసేన పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. తెలంగాణలో బీజేపీతో పొత్తులో భాగంగా మొత్తం 9 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లుగా జనసేన ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా 8 మందితో కూడిన జాబితాను విడుదల చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
చంద్రబాబు కేసులో వాయిదాలు
ఐఆర్‌ఆర్(IRR) అలైన్‌మెంట్ మార్పు కేసులో టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు నాయుడు (Chandra Babu Naidu) దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను హైకోర్టు (High Court)ఈనెల 22కు వాయిదా వేసింది. అడ్వకేట్ జనరల్(Advacate General) విజ్ఞప్తితో విచారణ వాయిదా పడింది. చంద్రబాబు మధ్యంతర బెయిల్(Interim Bail)పై ఉన్నారని కోర్టు దృష్టికి ఏజీ తీసుకొచ్చారు. ఈ కేసులో తాము పీటీ వారెంట్‌పై ఒత్తిడి చేయబోమని ఏజీ చెప్పారు. గతంలో ఉన్న ఉత్తర్వులు కొనసాగుతాయని అన్నారు. వాదనలు విన్న హైకోర్టు ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను ఈ నెల 22కు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. ఆరోగ్య కారణాలతో హైకోర్టు చంద్రబాబుకు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఈ క్రమంలో ప్రభుత్వం దాఖలు చేసిన వరుస కేసుల్లో బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదాలు కోరుతోంది ప్రభుత్వం. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
మ్యాక్స్ వెల్‌డన్
అఫ్గానిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో ఆసీస్ ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ (201 నాటౌట్; 128 బంతుల్లో 21 ఫోర్లు, 10 సిక్సర్లు) డబుల్ సెంచరీ చేశాడు. ఓడిపోతుందనుకున్న ఆస్ట్రేలియాను మ్యాక్స్‌వెల్ (Glenn Maxwell) గెలిపించడంతో పాటు ప్రపంచ కప్ లో సెమీస్ చేర్చాడు. కండరాలు పట్టేసి కాలు ఇబ్బంది పెడుతున్న బాధను పంటి బిగువన భరిస్తూ ఒంటరి పోరాటం చేసి డబుల్ సెంచరీతో ఎన్నో రికార్డులు తిరగరాశాడు. అఫ్గానిస్థాన్ నిర్దేశించిన 292 పరుగుల లక్ష్యాన్ని మరో 19 బంతులు మిగిలుండగానే ఆసీస్ ఛేదించింది. కమిన్స్ (12 నాటౌట్) సహకారంతో మ్యాక్సీ అద్భుతం చేశాడు. 8 మ్యాచ్ ల్లో 6 విజయాలతో సెమీస్ బెర్త్ కన్ఫామ్ చేసుకున్నారు కంగారూలు. కొన్ని కొత్త రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు మ్యాక్సీ. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
నామమాత్రపు మ్యాచ్
ప్రపంచకప్‌లో మరో నామమాత్రపు మ్యాచ్ జరగనుంది. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌తో నెదర్లాండ్స్ తలపడనుంది. ఇప్పటికే ఇరు జట్లు సెమీస్ అవకాశాలు కోల్పోవడంతో ఈ మ్యాచ్ నామమాత్రంగా మారింది. కానీ ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ విజయం సాధిస్తే 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో బెర్త్‌ను ఖాయం చేసుకుంటుంది. .పాయింట్ల పట్టికలో టాప్ ఏడు జట్లు, ఆతిథ్య పాకిస్థాన్ మాత్రమే 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధిస్తుందని ఇప్పటికే ప్రకటించింది. ఇప్పటికే ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీ అవకాశాలను కూడా కోల్పోయిన ఇంగ్లండ్ జట్టు... నెదర్లాండ్స్, పాకిస్తాన్‌లపై మిగిలిన రెండు మ్యాచ్‌లను గెలవాలని భావిస్తోంది. కాగితంపై చాలా ప్రమాదకరంగా ఉన్న ఇంగ్లండ్ జట్టు, విశ్వాసం, ఫామ్ కోల్పోయి కష్టాలు పడుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
తలనొప్పిగా డీప్ ఫేక్
డీప్ ఫేక్ వ్యహారం సెలబ్రిటీలకు తలనొప్పిగా మారింది. కొంత మంది కేటుగాళ్లు హీరోయిన్ల ఫోటోలు, వీడియోలను మార్ఫింగ్ చేస్తూ నెట్టింట్లోకి వదులుతున్నారు. రీసెంట్ గా సౌత్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. జారా పటేల్ అనే ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌కి సంబంధించిన వీడియోకు ఏఐ టెక్నాలజీతో రష్మిక ముఖాన్ని మార్ఫింగ్ చేశారు. ఈ వీడియో నెట్టింట్లో ట్రెండింగ్ లో నిలిచింది. ఈ వ్యవహారం ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపింది. పలువురు అగ్ర సినీ నటులు ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి