అన్వేషించండి

Katrina Kaif Deep Fake Picture: నిన్న రష్మిక, నేడు కత్రినా- డీప్ ఫేక్ మార్ఫింగ్ తో సెలబ్రిటీల తిప్పలు

రష్మిక ఫేక్ వీడియో దుమారం మర్చిపోకముందే మరో హీరోయిన్ డీప్ ఫేక్ బారిన పడింది. బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ మార్ఫింగ్ ఫోటోను ఆకతాయిలు నెట్టింట్లోకి వదిలారు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ అవుతోంది.

Katrina Kaif: డీప్ ఫేక్ వ్యహారం సెలబ్రిటీలకు తలనొప్పిగా మారింది. కొంత మంది కేటుగాళ్లు హీరోయిన్ల ఫోటోలు, వీడియోలను మార్ఫింగ్ చేస్తూ నెట్టింట్లోకి వదులుతున్నారు. రీసెంట్ గా సౌత్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. జారా పటేల్ అనే ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌కి సంబంధించిన వీడియోకు ఏఐ టెక్నాలజీతో  రష్మిక ముఖాన్ని మార్ఫింగ్‌ చేశారు. ఈ వీడియో నెట్టింట్లో ట్రెండింగ్ లో నిలిచింది. ఈ వ్యవహారం ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపింది. పలువురు అగ్ర సినీ నటులు ఈ వ్యవహారంపై  తీవ్రంగా స్పందించారు.

డీప్ ఫేక్ బారిన పడిన మరో స్టార్ హీరోయిన్

రష్మిక ఫేక్ వీడియో వ్యవహారాన్ని మర్చిపోక ముందే మరో స్టార్ హీరోయిన్ డీప్ ఫేక్ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈసారి డీప్ ఫేక్ బారిన పడింది మరెవరో కాదు బాలీవుడ్ నటి కత్రినా కైఫ్. ప్రస్తుతం ఆమె ‘టైగర్ 3’ అనే సినిమాలో నటిస్తోంది. రీసెంట్ గా ఆమె టవల్ ఫైట్ తో బాగా పాపులర్ అయ్యింది. అదే ఫోటోను బేస్ చేసుకుని కొంత మంది ఆగంతకులు డీప్‌ ఫేక్‌ టెక్నాలజీతో మార్ఫింగ్ చేశారు. టవల్ లో ఉండే కత్రీనా, లోదుస్తుల్లో కనిపించేలా ఎడిట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోల సోషల్  మీడియాలో వైరల్ గా మారింది.

డీప్ ఫేక్ తీవ్ర ఆగ్రహం

రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు స్టార్ హీరోయిన్లు డీప్ ఫేక్ బారిన పడటం సినీ ఇండస్ట్రీలో తీవ్ర చర్యనీయాంశంగా మారింది.  ఇప్పటికే ఈ వ్యహారంపై బాలీవుడ్ అగ్ర హీరో అమితాబ్ స్పందించారు. మున్ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అటు సినీ తారలతో పాటు సినీ అభిమానులు సైతం డీప్ ఫేక్ వ్యవహారంపై  ఉదాసీనంగా వ్యవహరించకూడదంటున్నారు.         

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, దర్శకుడు మనీశ్ శర్మ కాంబోలో ‘టైగర్ 3’ సినిమా తెరకెక్కుతోంది.  హై బడ్జెట్ యాక్షన్‌ డ్రామాగా రూపొందుతోంది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌, ట్రైలర్‌ సినిమాపై భారీ అంచ‌నాల‌ను పెంచుతున్నాయి. ఈ సినిమాలో క‌త్రీనా కైఫ్  సల్మాన్ ఖాన్ స‌ర‌స‌న నటిస్తోంది.  ఇందులో క‌త్రీనా చేసినా టవల్ ఫైట్ సీన్లు ప్రేక్షకులను ఎంత‌గానో ఆకట్టుకున్నాయి.  హాలీవుడ్‌ స్టంట్‌ ఉమన్‌తో కలిసి ఆమె చేసే యాక్షన్ సీన్లు అందరినీ అలరించాయి. ఇప్పుడు పోరాట దృశ్యాల ఫోటోలను గుర్తు తెలియని వ్యక్తులు మార్ఫింగ్ చేశారు. ఈ వ్యవహారంపై  ఇప్పుడు నెట్టింట తెగ చర్చ నడుస్తోంది.

Read Also: రష్మిక మార్ఫింగ్ వీడియో - భయమేస్తుందన్న చైతూ, మద్దతుగా మృణాల్, సాయి తేజ్!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Rains Alert: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
Hathras Stampede: హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
Revanth Reddy: చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
KCR News: కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP DesamSurya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Rains Alert: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
Hathras Stampede: హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
Revanth Reddy: చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
KCR News: కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
Modi Speech: రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
Salman Khan: సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
CM Revanth Reddy: 'అలా చేస్తేనే టికెట్ రేట్ల పెంపునకు అనుమతి' - చిత్ర పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన
'అలా చేస్తేనే టికెట్ రేట్ల పెంపునకు అనుమతి' - చిత్ర పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన
Janasena MLA Chirri Balaraju : జనసేన ఎమ్మెల్యేకు కారు కొనిచ్చిన కార్యకర్తలు - కానీ ఈఎంఐ ఆయన కట్టుకోవాల్సిందే !
జనసేన ఎమ్మెల్యేకు కారు కొనిచ్చిన కార్యకర్తలు - కానీ ఈఎంఐ ఆయన కట్టుకోవాల్సిందే !
Embed widget