Morning Top News:
అధికారులతో చంద్రబాబు మాటామంతీ
ఏపీ ప్రభుత్వంలోని ఆయా శాఖల్లోని కీలక అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు కొత్త సంవత్సరం సందర్భంగా ముచ్చటించారు. తన ఆలోచనలు, ప్రాధాన్యతలు, లక్ష్యాలు వివరించిన చంద్రబాబు... అధికారుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. సిఎస్, డీజీపీ, సిఎంవో అధికారులుసహా వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు ఈ భేటీకి హాజరయ్యారు. కొత్త ఉత్సాహంతో పని చేద్దామని చంద్రబాబు సూచించారు.
పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
తెలంగాణ ఖజానాకు న్యూ ఇయర్ కిక్
తెలంగాణ ఎక్సైజ్‌శాఖలో న్యూ ఇయర్ జోష్ కనిపించింది. ఈసారి కూడా భారీగా ఆదాయం సమకూరింది. పాత సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ కొత్త ఏడాదికి స్వాగతం పలికిన ప్రజలు భారీగా మద్యాన్ని విక్రయించారు. డిసెంబర్ ఆఖరిలో మద్యం ప్రియులు భారీగానే ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చారు. దాదాపు వందల కోట్ల రూపాయల మద్యాన్ని అమాంతం తాగేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
దావోస్ పర్యటనకు చంద్రబాబు
ముఖ్యమంత్రి
చంద్రబాబు నాయుడు, ఐటీ మినిస్టర్ లోకేష్, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ దావోస్‌లో పర్యటించనున్నారు. జనవరి 20 నుంచి నాలుగు రోజుల పాటు వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2025లో పాల్గొననున్నారు. వీళ్ల ముగ్గురితోపాటు అధికారుల బృందం కూడా టూర్‌లో ఉంటుంది. ఈ పర్యటనకు సంబంధించిన అనుమతులకు ఏపీ ప్రభుత్వం ఓకే చెప్పింది.
పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
హాస్టళ్లపై తెలంగాణ ప్రభుత్వ సంచలన నిర్ణయం
సంక్షేమ హాస్టళ్లపై విమర్శలు వస్తున్న వేళ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంత నిధులు వెచ్చిస్తున్న పరిస్థితిలో మార్పు రాకపోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. అన్ని రకాల ప్రభుత్వ హాస్టళ్ల పర్యవేక్షణ బాధ్యతను అడిషనల్ కలెక్టర్లకు ఇచ్చింది ప్రభుత్వం. గర్ల్స్ హాస్టల్స్‌లో మహిళా ఐఏఎస్ అధికారులు బస చేయాలని ఆదేశించింది. హాస్టల్ నిర్వహణ అధ్వాన్నంగా మారడానికి కారణమేంటి... అక్కడ ఉన్న సమస్యలు ఏంటీ... వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
బాబోయ్... అంత తాగేశాడా.. ?
కొత్త ఏడాది సందర్భంగా హైదరాబాద్ వ్యాప్తంగా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేశారు. ఇలా అమీర్ పేట సమీపంలోని వెంగళరావు పార్క్ వద్ద బ్రీత్ టెస్టులు చేస్తున్న సమయంలో ఓ ముఫ్పై ఏళ్ల లోపు యువకుడు బైక్ పై దూసుకొచ్చాడు. అతడిని టెస్ట్ చేయగా వచ్చిన రిజల్ట్ చేసి పోలీసులుక మైండ్ బ్లాంక్ అయింది. ఎందుకంటే అతని బ్లడ్ లో 550 mg/100ml లిక్కర్ లెవల్స్ చూపించింది.
పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
భయపెట్టిన పులిని బంధించిన అధికారులు
కుమ్రంభీమ్ జిల్లాలో ప్రజలకు పెద్ద ఉపశమనం లభించింది. కొంతకాలంగా పరుగులు పెట్టిస్తున్న పులిని అధికారులు బంధించారు. సిర్పూర్ మండలం మకాడి సమీపంలో అధికారులకు పులి చిక్కింది. మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లా రాజురా తాలుక అంతర్గాం – అత్మారాం గూడలో పులి అధికారులు పట్టుకున్నారు. నాటకీయ పరిణామాల మధ్య పులిని అధికారులు బంధించారు. పశువుపై దాడి చేసి తింటున్న పులిని మాటు వేసి మత్తు ఇంజెక్షన్ షూట్ చేసి స్పృహ తప్పేలా చేసి పట్టుకున్నారు.
పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
మావోయిస్టు తారక్క లొంగుబాటు
మహారాష్ట్రల్లో మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. 11 మంది కీలక నక్సల్స్ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ముందు లొంగిపోయారు. లొంగిపోయిన నక్సల్స్‌లో తారక్క ఉండడం విశేషం. తారక్క భర్త మల్లోజుల వేణుగోపాల్.. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు. కాగా ఇప్పటికే తారక్కపై రూ.2 కోట్ల రివార్డు ఉంది. కీలకమైన నక్సల్స్ లొంగిపోవడంతో మవోయిస్టు కార్యకలాపాలు తగ్గే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.
పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
పేర్ని జయసుధ విచారణ
మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధ రేషన్ బియ్యం మాయం కేసులో విచారణ ముగిసింది. RI సీఐ ఏసుబాబు.. 2 గంటలకుపైగా ఆమెను ప్రశ్నించారు. ఈ కేసులో పేర్ని జయసుధ ఏ1గా ఉన్నవిషయం తెలిసిందే. జయసుధకు ఇప్పటికే ముందస్తు బెయిల్ మంజూరు చేసిన కోర్టు.. పోలీసుల విచారణకు సహకరించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే బుధవారం ఆమె బందరు తాలూకా PSలో విచారణకు హాజరయ్యారు.
పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
సంచలనం రేపుతున్న లక్నో నిందితుడి వీడియో
లక్నోలోని ఓ హోటల్ లో ఒకే కుటుంబానికి చెందిన ఐదురుగు హత్యకు గురయ్యారు. మృతులంతా మహిళలే కావడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో నిందితులను అసద్ (కొడుకు), బాదర్ (తండ్రి)గా గుర్తించారు. అయితే వాళ్లను ఎందుకు చంపారన్న ప్రశ్నపై సమాధానమిచ్చిన నిందితుడు అసద్.. తన అక్కాచెల్లెళ్లను అమ్ముకోవడం ఇష్టం లేదని, అందుకే వారిని చంపేశానని నేరం ఒప్పుకున్నాడు.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
అమెరికాలో ఉగ్ర దాడి..?
అమెరికాలో ఘోర ప్రమాదం సంభవించింది. సెంట్రల్ న్యూ ఓర్లీన్స్‌లో గుంపుపైకి భారీ ట్రక్కు దూసుకుపోవడంతో 12 మంది మరణించారు. 35 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించేందుకు పోలీసులు చాలా కష్టపడాల్సిన వచ్చిందని. ఈ కేసులో ఉగ్ర కుట్ర ఉందన్న అనుమానంతో ఎఫ్‌బిఐ దర్యాప్తును ప్రారంభించింది. అనుమానితుడిపై పోలీసులు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.
పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..