Amaravati Works News: అమరావతికి కొత్త కళ- కీలక పనులకు టెండర్లు పిలిచిన ప్రభుత్వం- జనవరి 22 వరకు గడవు
Andhra Pradesh: కొత్త ఏడాది ప్రారంభంతోనే అమరావతిలో కొత్త జోష్ కనిపిస్తోంది. 2,323.25 రూపాయల విలువైన పనులకు తొలి రోజునే టెండర్లు పిలిచారు
Amaravati News: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కొత్త కళ వచ్చింది. సంక్రాంతి తర్వాత నిర్మాణ పనులను పునఃప్రారంభిస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ దిశగానే అడుగులు వేస్తోంది. కొత్త ఏడాది తొలి రోజునే చాలా పనులకు టెండర్లు పిలిచింది. ఇప్పటికే ప్రపంచ బ్యాంకు ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు నిధులు మంజూరు చేసింది. అందుకే పనులు వేగం పుంజుకోనున్నాయి.
రాజధానిలో చేపట్టే 2,323.25 కోట్ల రూపాయల విలువైన ఐదు కీలకమైన పనులకు సీఆర్డీఏ, అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ టెండర్లు పిలిచాయి. రెండు ఎల్పీఎస్ జోన్లలో మౌలిక వసతుల కల్పన, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, అఖిల భారత సర్వీసు అధికారుల నివాస సముదాయాల్లో పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు సీఆర్‌డీఏ టెండర్లు పిలించింది. వరద నియంత్రణ, ట్రంక్ ఇన్‌ఫ్రా పనుల టెండర్లను ఏడీసీ పిలించింది. జనవరి 22 గంటల వరకు టెండర్లు దాఖలు చేసుకోవచ్చు. అదే రోజు నాలుగు గంటలకు టెండర్లు ఖరారు చేయనున్నారు.
రాజధాని జోన్ 1ఏలో ఎల్పీఎస్ లేఔట్లలో మౌలిక సదుపాయాలైన రోడ్లు, తాగునీటి సరఫరా, డ్రెయిన్లు, విద్యుత్తు, ఇంటర్నెట్ కేబుల్ వేసేందుకు డక్ట్‌ల నిర్మాణం, అవెన్యూ ప్లాంటేషన్ పనులను రూ.448.32 కోట్లతో చేపట్టనున్నారు. దీనికి టెండర్ పిలిచారు. జోన్ 1బి ప్రాంతం రూ.588.04 కోట్లతో ఈ పనులు చేపట్టనున్నారు. వీటి కోసం కూడా టెండర్లు పిలిచారు. వీటితోపాటు ఎమ్మెలే, ఎమ్మెల్సీ, ఐఎస్‌లు, ఐపీఎస్‌ల నివాస సముదాయాలకు సంబంధించిన 18 టవర్లలో చాలా పనులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని రూ.434.32 కోట్లతో చేపట్టనున్నారు. అందు కోసం ఈ టెండర్లు పిలించారు. నీరుకొండ రిజర్వాయర్ వద్ద చేపట్టాల్సిన వరద నియంత్రణ పనులను రూ.470.75 కోట్లతో పూర్తి చేసేందుకు టెండర్లు పిలిచారు. రాజధానిలో వర్షపు నీటి మళ్లింపు డ్రెయిన్లు, పాదచారుల బాటలు, సైకిల్ ట్రాక్‌లు, పచ్చదనం అభివృద్ధి, వీధి దీపాలు లాంటి పనులను మరో రూ.381.82 కోట్లతో పూర్తి చేసేందుకు ప్రతిపాదించారు. దీని కోసం కూడా టెంబర్లు పిలించారు.