Drinker Sai: కొత్త ఏడాదిలో డ్రింకింగ్ చాంపియన్ ఇతనే - ఎంత తాగాడో తెలిసి పోలీసులకే మైండ్ బ్లాంక్ అయింది.
Hyderabad: హైదరాబాద్‌లో కొత్త ఏడాది సందర్భంగా డ్రింకర్లకు పోటీ పెడితే ఇతనికే చాంపియన్ షిప్ వచ్చేస్తుంది. అతని బ్లడ్ లో మద్యం శాతం చూసి పోలీసులకే మైండ్ బ్లాంక్ అయిపోయింది.
Hyderabad police stunned mans breath test results during drink and drive check: కొత్త ఏడాది సందర్భంగా హైదరాబాద్ వ్యాప్తంగా పోలీసులు డ్రింక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేశారు. ఇలా అమీర్ పేట సమీపంలోని వెంగళరావు పార్క్ వద్ద బ్రీత్ టెస్టులు చేస్తున్న సమయంలో ఓ ముఫ్పై ఏళ్ల లోపు యువకుడు బైక్ పై దూసుకొచ్చాడు. అందర్నీ చెక్ చేయలేక అనుమానం ఉన్న వాళ్లను మాత్రమే చెక్ చేస్తున్న పోలీసులు.. ఆ యువకుడు కాస్త తేడాగా ఉండటంతో ఆపారు. బ్రీత్ మిషన్ పెట్టి ఊదమన్నారు. ఒకటి కాకపోతే పది సార్లు ఊదుతా.. అన్నంత కాన్ఫిడెంట్ ఊదాడు. అందులో వచ్చిన రిజల్ట్ చేసి పోలీసులుక మైండ్ బ్లాంక్ అయింది. ఎందుకంటే అతని బ్లడ్ లో 550 mg/100ml లిక్కర్ లెవల్స్ చూపించింది.
ఇప్పటి వరకూ కొన్ని వేల మందిని పోలీసులు పట్టుకుని ఉంటారు కానీ ఈ స్థాయిలో ఎవరూ తాగలేదు. తాగి రోడ్డెక్కుతారని కూడా ఊహించలేరు. సాధారణంగా 60 mg/100ml చూపిస్తేనే బండి స్వాధీనం చేసుకుని కేసు పెడతారు.
Also Read: భార్య దెప్పిపొడుస్తోందని రాయితో కొట్టి చంపేశాడు- హైదరాబాద్‌లోని మేడిపల్లిలో దారుణం
రక్తంలో 550 మిల్లిగ్రామ్ల (mg) లిక్కర్ శాతం అంటే 0.55% బ్లడ్ అల్కహాల్ కంటెంట్ (BAC) అని చెప్పవచ్చు. ఈ శాతం చాలా ఎక్కువ. ఇది చాలా ప్రమాదకరమైన స్థాయి. రక్తంలో అల్కహాల్ శాతం (BAC) గుర్తించడానికి, వ్యక్తి తీసుకునే మద్యం పరిమాణం, రక్తం లోపలి నీటి శాతం, శరీర బరువు, తదితర అంశాలు ముఖ్యమైనవి. వివిధ రకాల మద్యం వలన ఈ BAC స్థాయిలు వేరువేరుగా ఉండవచ్చు.
సాధారణంగా
1 బీర్ (330 మి.లీ.లో) = సుమారు 0.02% BAC
1 గ్లాస్ వైన్ (150 మి.లీ.) = సుమారు 0.03% BAC
1 షాట్ మద్యం (45 మి.లీ.) = సుమారు 0.02-0.03% BAC ఉంటుంది.
అంటే దొరికిన వ్యక్తి కనీసం పాతిక బీర్లు తాగి ఉండాలి. లేదా అంత పెద్ద పవర్ మద్యాన్ని తాగి ఉండవచ్చు. అయితే అంత తాగి స్టడీగా బండి నడుపుకుంటూ రావడం.. పోలీసుల ఎదుట ధైర్యంగా ఊదటమే అసలు మ్యాటర్.అతనికి తాగుబోతు చాంపియన్ షిప్ ఇవ్వొచ్చని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
Yesterday a guy in #hyderabad punjagutta
— The Biryani Dev (@thebiryanidev) January 1, 2025
Got caught in a drunk and drive case with 550 points
This is the time when i was coming out from the movie 🍿 at same place.
Drunk drivers should get a slap 👋 in public pic.twitter.com/xUvUaVXuvT
తనిఖీల సందర్భంగా చాలా మంది మందుబాబులు విచిత్ర వాదనలతో పోలీసుల సహనాన్ని పరీక్షించారు.
Drunk Antics on Hyderabad Roads on 31st Night
— Sudhakar Udumula (@sudhakarudumula) January 1, 2025
“𝘈𝘫 31𝘴𝘵 𝘯𝘪𝘨𝘩𝘵 𝘩𝘪… 𝘵𝘰𝘥𝘢 𝘣𝘢𝘴 𝘱𝘪𝘭𝘦𝘵𝘩𝘦, 𝘴𝘢𝘣𝘬𝘶 𝘱𝘦𝘳𝘮𝘪𝘴𝘴𝘪𝘰𝘯 𝘩𝘪!”
Hyderabad roads saw chaos on New Year’s Eve as drunk revelers openly flouted rules and pleaded with police for leniency. One man,… pic.twitter.com/IsOL35k2tL
Also Read: ఢిల్లీలో మరో అతుల్ సుభాష్ - భార్య వేధింపులతో వ్యాపారవేత్త ఆత్మహత్య - ఇంకెందరు బలి కావాలి?