CRED Scam : లక్కీ భాస్కర్ అవ్వాలనుకున్నాడు - కానీ బ్యాడ్ లక్ భాస్కర్ అయ్యాడు - క్రెడ్ ఖాతాల్ని కొల్లగొంటిన బ్యాంక్ ఆఫీసర్ అరెస్ట్ !
Bank Scam: క్రెడిట్ కార్డు చెల్లింపులు చేయడానికి ఉపయోగించే క్రెడ్ యాప్ కంపెనీ ఖాతా నుంచి యాక్సిస్ బ్యాంక్ ఉద్యోగులు డబ్బులు కొట్టేశారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు.
How 4 bank employees made Rs 12 crore fraud from CRED: యాక్సిస్ బ్యాంక్‌లో కీలక పొజిషన్లలో ఉన్న వారు క్రెడ్ సంస్థ బ్యాంక్ అకౌంట్ల నుంచి నగదుకొట్టేసిన వైనం కార్పొరేట్ వర్గాల్లో సంచలనంగా మారుతోంది. క్రెడిట్ కార్డ్ చెల్లింపుల సంస్థ CRED నుండి రూ. 12.5 కోట్ల మోసం చేసిన నలుగురు వ్యక్తుల ముఠాను బెంగళూరు నగర పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా గుజరాత్‌కు చెందిన వారు.
గుజరాత్‌లో యాక్సిస్ బ్యాంక్‌లో రిలేషన్షిప్ మేనేజర్‌గా పనిచేస్తున్న 33 ఏళ్ల వైభవ్ పితాదియా అనే వ్యక్తి ఈ స్కాంకు సూత్రధారి. కార్పొరేట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఫారమ్‌లు , ముద్రలను ఫోర్జరీ చేసి నకిలీ పత్రాలను ఉపయోగించి పన్నెండున్నర కోట్లు కాజేశాడు. క్రెడిట్ కార్డు యూజర్లు తమ బిల్లులను క్రెడ్ ద్వారా చెల్లించవచ్చు. అంచే ముందుగా క్రెడ్ ఖాతాలో డబ్బులు జమ అవుతాయి. అందు కోసం క్రెడ్ యాక్సిస్ బ్యాంకులో ఖాతాల్ని ఏర్పాటు చేసిది. ఓ సారి ఖాతాలను పరిశీలిస్తున్న సమయంోల CRED నోడల్ ఖాతా గురించి పిటాడియా కొన్ని రహస్యాలు తెలుసుకున్నాడు. ఓ ఖాతాలో రోజువారీ లావాదేవీలలో రూ. 2 కోట్లను ప్రాసెస్ చేస్తోంద ికానీ.. రెండు లింక్డ్ కార్పొరేట్ ఖాతాల్లో లావాదేవీలు లేవని గుర్తించాడు. వాటిలో డబ్బులు ఉన్నాయి. వాటి ఆధారంగా స్కామ్‌కు ప్రణాళిక రెడీ చేశాడు.
Also Read: 2025 భోగి నుంచి మహాశివరాత్రి వరకూ మహా కుంభమేళా - అది పెద్ద ఆధ్యాత్మిక ఉత్సవంలో రాజ స్నానం తేదీలివే!
ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన నేహా బెన్‌ను క్రెడ్ అనుబంధ బినామీ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌గా పాత్రను సృష్టించాడు. బోర్డు తీర్మానాలు , లెటర్‌హెడ్‌లతో సహా కీలకమైన పత్రాలను నకిలీవి తయారు చేశాడు. నేహా నకిలీ CIB ఫారమ్ , నకిలీ డాక్యుమెంట్లను యాక్సిస్ బ్యాంక్ అంక్లేశ్వర్ బ్రాంచ్‌కి సమర్పించింది. క్రెడ్‌కు సంబంధించి వాడని ఖాతాలకు కొత్త యూజర్ IDని అభ్యర్థించింది. వైభవ్ సహకారంతో అన్నీ వచ్చాయి.
తర్వాత శుభం, శైలేష్ అనే వ్యక్తులతో నకిలీ పత్రాలు సృష్టించి షెల్ ఖాతాలు తెరిపించారు. అక్టోబర్ 29 నుంచి నవంబర్ 11 మధ్య జరిగిన రూ. 12.5 కోట్ల విలువైన 17 లావాదేవీల ద్వారా నగదు బదిలీ చేసుకున్నారు. నవంబర్ 13న CRED మోసాన్ని గుర్తించి యాక్సిస్ బ్యాంక్‌కు ఫిర్యాదు చేసింది. వెంటనే తమ ప్రధాన కార్యాలయం ఉన్న బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Also Read: రూ.5కే మహా కుంభమేళా చరిత్ర..ప్రయాగ్ రాజ్ లో ఏర్పాట్లు మొత్తం టెక్నాలజీ మయం!
పోలీసులు విచారణ జరిపి యాక్సిస్ బ్యాంక్ అంక్లేశ్వర్ బ్రాంచ్‌లో నకిలీ పత్రాలను సమర్పించిన నేహాను విచారణ అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణలో పితాదియా తదితరుల ప్రమేయం బయటపడింది. నిందితులు సున్నితమైన డేటాను యాక్సెస్ చేసి, నకిలీ పత్రాలను సృష్టించి డబ్బులు కొట్టేసినట్లు అంగీకరించారు. వారి ఇళ్లలో సోదాలు చేసిన పోలీసులు దర్యాప్తులో రూ.1.28 కోట్ల నగదు, రెండు మొబైల్ ఫోన్లు, నకిలీ సిఐబి ఫారాలు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన మొత్తాన్ని రికవరీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఎవరికీ దొరకకపోతే లక్కీ భాస్కర్ లాగా.. ఓ వంద కోట్లు పోగేసుకుని వెళ్లి వ్యాపారం పెట్టుకోవాలనుకున్నారేమో కానీ.. ఇది సినిమా కాదని తెలియడానికి ఎన్నో రోజులు పట్టలేదు.