అన్వేషించండి

Morning Headlines: రేవంత్ సర్కార్ కు కొత్త చిక్కులు, కన్సల్టేటివ్‌ ఫోరం ఛైర్మన్ గా లోకేశ్ వంటి మార్నింగ్ టాప్ న్యూస్

Top 10 Headlines Today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయవ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తల సమాహారం ఇక్కడ చూడొచ్చు.

Todays Top 10 News: 

1. రేవంత్ సర్కార్ కు కొత్త చిక్కులు

మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను వేరే చోటుకు తరలించాలని సంకల్పించిన రేవంత్ సర్కార్... వారిలో అర్హులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇవ్వాలని నిర్ణయించింది. అయితే డబుల్ బెడ్ రూంల కంటే నిర్వాసితుల సంఖ్య రెట్టింపు ఉండడం ప్రభుత్వానికి చిక్కులు తెచ్చిపెడుతోంది. అయితే గతంలో దరఖాస్తు చేసుకున్న తమకు కాకుండా.. మూసీ బాధితులకు ఇళ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపైనా లబ్ధిదారులు ప్రశ్నలు సంధిస్తున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

2. నేడు మూసీ పరీవాహక ప్రాంతాల్లో కేటీఆర్ పర్యటన

నేడు  రేపు హైదరాబాద్ నగరంలో మూసీ పరివాహక ప్రాంతాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నారు. రాజేంద్రనగర్, అంబర్‌పేట నియోజకవర్గ పరిధిలో పర్యటిస్తానని తెలిపారు. బుల్డోజర్ బెదిరింపులను సాధ్యమైనంత వరకు అరికట్టాలని, దాని కోసం తాము చేయగలిగినంత వరకు చేస్తామని కేటీఆర్‌ పేర్కొన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

3. తెలంగాణలో బుల్డోజర్ రాజకీయాలా.. ? : హరీశ్

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం బుల్డోజర్ రాజకీయాలకు తెర తీసిందని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. ఇందిరమ్మ రాజ్యం అంటే గరీబీ హటావో అంటారని.. కానీ రేవంత్ ప్రభుత్వం మాత్రం గరీబోంకో హటావో అంటుందని మండిపడ్డారు.  కొడంగల్ లో రేవంత్ రెడ్డి ఇల్లే ఎఫ్ టీఎల్ పరిధిలో ఉందని.. ముందు దానిని కూలగొట్టాలని హరీష్ అన్నారు. పేదవాళ్లకు ఒక న్యాయం.. ముఖ్యమంత్రికి ఒక న్యాయమా అని ప్రశ్నించారు. తెలంగాణలో బుల్డోజర్ రాజ్యం నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

4. లులు మాల్ పెట్టుబడులు పెట్టేది ఎక్కడంటే..?

సీఎం చంద్రబాబు, లులు గ్రూప్‌ ఇంటర్నేషనల్‌ చైర్మన్ యూసఫ్ అలీ మధ్య శనివారం జరిగిన భేటీలో పెట్టుబడులపై కీలక చర్చ జరిగింది. విశాఖలో మాల్, మల్టీప్లెక్స్, విజయవాడ, తిరుపతిలో హైపర్‌ మార్కెట్, మల్టీప్లెక్స్‌ల నిర్మాణంతోపాటు ఆహారశుద్ధి రంగంలో పెట్టుబడులకు యూసుఫ్‌ అలీ ఆసక్తి చూపారని తెలుస్తోంది. సులభతర, వేగవంతమైన వ్యాపారానికి ప్రాధాన్యం ఇస్తున్నట్టు చంద్రబాబు పేర్కొన్నారని సమాచారం. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

5. ఎమ్మెల్యే రాజాసింగ్ హత్యకు కుట్ర..!

హైదరబాద్‌లో మరోసారి కలకలం రేగింది. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటి దగ్గర ఇద్దరు వ్యక్తులు రెక్కీ నిర్వహించడంతో వాతావరణం వేడెక్కింది. స్థానికులకు అనుమానం రావడంతో వారిని మంగళ్​హట్ పోలీసులకు అప్పగించారు. వీరిని ఇస్మాయిల్, మహ్మద్ ఖాజాగా గుర్తించారు. ఇద్దరి ఫోన్లలో తుపాకులు, బుల్లెట్లు, రాజాసింగ్ ఫొటో ఉన్నాయి. దీంతో రాజాసింగ్ హత్యకు ఏమైనా కుట్ర పన్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

6. కన్సల్టేటివ్‌ ఫోరం ఛైర్మన్ గా నారా లోకేశ్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం, సీఐఐ భాగస్వామ్యంతో కన్సల్టేటివ్‌ ఫోరం ఏర్పాటు చేసినట్లు పరిశ్రమల శాఖ జీవో విడుదల చేసింది. ఫోరం చైర్మన్‌గా మంత్రి నారా లోకేశ్‌ వ్యవహరించనున్నారు. రెండేళ్ల కాలపరిమితితో ఇది పనిచేయనుంది. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ప్రభుత్వం, పారిశ్రామికవేత్తల మధ్య అనుసంధానకర్తగా ఈ ఫోరం పనిచేయనుంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

7. త్వరలో ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాల భర్తీ

త్వరలోనే ఆర్టీసీలో మూడు వేల పోస్టులను భర్తీ చేస్తామని తెలంగాణ రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఆర్టీసీ ఉద్యోగులకు పీఅర్సీ, కారుణ్య నియామకాలపై దృష్టిసారించినట్లు వెల్లడించారు. కరీనంగర్ లో 33 ఈవీ బస్సులను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తో కలిసి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. తెలంగాణలో ఇప్పటివరకూ 92 కోట్ల ఉచిత టికెట్లు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. ఆర్టీసీకి ప్రయాణికులే దేవుళ్లని అన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

8. లడ్డూ కల్తీపై నటుడు సుమన్ సంచలన వ్యాఖ్యలు

తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీపై నటుడు సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల శ్రీవారి ప్రసాదంలో జంతువుల కొవ్వు కలవడం దారుణమైన చర్యని అన్నారు. ఏ మతమైనా  ప్రసాదాల్లో కల్తీ జరగడం మంచిది కాదన్నారు. తిరుమలకు కల్తీ నెయ్యి ఎలా వచ్చిందని.. టీటీడీ బోర్డు మెంబర్లు, అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. మతాలలో ఇలాంటివి తప్పు జరగకుండా పార్లమెంట్ లో బిల్లు పెట్టాలని.. తప్పు చేసినట్లు తేలితే 2 ఏళ్ల జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

9. ప్రకాశ్ రాజ్ పై మంచు విష్ణు కీలక వ్యాఖ్యలు
శ్రీవారీ లడ్డూ ప్రసాదంపై కల్తీపై టాలీవుడ్ లో వార్ నడుస్తోంది. తాజాగా మరోసారి నటుడు ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలపై మా అధ్యక్షుడు మంచు విష్ణు స్పందించారు. ప్రకాష్ రాజ్ తన వ్యక్తిగత అభిప్రాయాన్ని వెల్లడించారో తాను కూడా అలాగే నా అభిప్రాయాన్ని చెప్పానని విష్ణు అన్నారు. లడ్డూ గొడవకు మతం రంగు లేదని తాను చెప్పగలనని, తాను మాట్లాడింది కరెక్టేనని విష్ణు అన్నారు. తాను ప్రకాష్ రాజ్ ను అంకుల్ అని పిలుస్తానని, ఆయన అంటే నాకు గౌరవ, మర్యాదలు ఉన్నాయన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

10. 2025 ఐపీఎల్‌లో అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌గా ధోని

2025 ఐపీఎల్‌లో సీఎస్‌కే తరపున ఎమ్ఎస్‌ ధోనీ ఆడేందుకు అడ్డంకులు తొలిగాయి. ట్రోఫీతో లీగ్‌ కేరీర్‌ను ముగించేందుకు మిస్టర్‌ కూల్‌కు మారిన ఐపీఎల్‌ రూల్స్ అవకాశం కల్పించాయి. అయితే ధోనీని అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా ప్రకటించడంతో సీఎస్‌కే అతి తక్కువగా  4 కోట్ల రూపాయలకే ధోనీని 2025సీజన్‌లో అంటి పెట్టుకునే అవకాశం వచ్చింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

Also Read: ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు గుడ్ న్యూస్‌- దసరా నుంచి మరో పథకం అమలు !

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR About Hydra: దమ్ముంటే నాలాల మీదున్న జీహెచ్ఎంసీ బిల్డింగ్, హైడ్రా ఆఫీసులు కూల్చండి: కేటీఆర్ డిమాండ్
దమ్ముంటే నాలాల మీదున్న జీహెచ్ఎంసీ బిల్డింగ్, హైడ్రా ఆఫీసులు కూల్చండి: కేటీఆర్ డిమాండ్
HYDRA: రూల్స్ తెలుసా రంగనాథ్‌. అత్యుత్సాహం ప్రదర్శిస్తే ఇంటికెళ్తారు -  హైడ్రా చీఫ్‌పై హైకోర్టు ఆగ్రహం
రూల్స్ తెలుసా రంగనాథ్‌. అత్యుత్సాహం ప్రదర్శిస్తే ఇంటికెళ్తారు - హైడ్రా చీఫ్‌పై హైకోర్టు ఆగ్రహం
Tamilnadu Politics :  విజయ్ వర్సెస్ ఉదయనిధి - తమిళనాడు రాజకీయం మారిపోతోందా ?
విజయ్ వర్సెస్ ఉదయనిధి - తమిళనాడు రాజకీయం మారిపోతోందా ?
Autopay Cancellation: నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్ నెలనెలా డబ్బులు కట్ చేస్తున్నాయా? - అయితే ఆపేయండిలా!
నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్ నెలనెలా డబ్బులు కట్ చేస్తున్నాయా? - అయితే ఆపేయండిలా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

KTR on Revanth Reddy: దొరికినవ్ రేవంత్! ఇక నీ రాజీనామానే, బావమరిదికి లీగల్ నోటీసు పంపుతావా?Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేస్‌, ఈ రూట్స్‌లోనేసీఎస్‌కేలోకి అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌గా ఎమ్‌ఎస్ ధోని, రిటెన్షన్ కొత్త రూల్స్‌తో సస్పెన్స్తిరుమలలో మరోసారి చిరుత కలకలం, సీసీటీవీ ఫుటేజ్‌తో సంచలనం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR About Hydra: దమ్ముంటే నాలాల మీదున్న జీహెచ్ఎంసీ బిల్డింగ్, హైడ్రా ఆఫీసులు కూల్చండి: కేటీఆర్ డిమాండ్
దమ్ముంటే నాలాల మీదున్న జీహెచ్ఎంసీ బిల్డింగ్, హైడ్రా ఆఫీసులు కూల్చండి: కేటీఆర్ డిమాండ్
HYDRA: రూల్స్ తెలుసా రంగనాథ్‌. అత్యుత్సాహం ప్రదర్శిస్తే ఇంటికెళ్తారు -  హైడ్రా చీఫ్‌పై హైకోర్టు ఆగ్రహం
రూల్స్ తెలుసా రంగనాథ్‌. అత్యుత్సాహం ప్రదర్శిస్తే ఇంటికెళ్తారు - హైడ్రా చీఫ్‌పై హైకోర్టు ఆగ్రహం
Tamilnadu Politics :  విజయ్ వర్సెస్ ఉదయనిధి - తమిళనాడు రాజకీయం మారిపోతోందా ?
విజయ్ వర్సెస్ ఉదయనిధి - తమిళనాడు రాజకీయం మారిపోతోందా ?
Autopay Cancellation: నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్ నెలనెలా డబ్బులు కట్ చేస్తున్నాయా? - అయితే ఆపేయండిలా!
నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్ నెలనెలా డబ్బులు కట్ చేస్తున్నాయా? - అయితే ఆపేయండిలా!
New DSC In Telangana: కొత్త డీఎస్సీపై గుడ్ న్యూస్! వంద ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు- రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
కొత్త డీఎస్సీపై గుడ్ న్యూస్! వంద ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు- రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Virus Attack: ఏపీలో మళ్లీ హ్యాండ్ ఫుట్ మౌత్ వ్యాధి కలకలం- విజయవాడ, గుంటూరు, విశాఖలో కేసులు
ఏపీలో మళ్లీ హ్యాండ్ ఫుట్ మౌత్ వ్యాధి కలకలం- విజయవాడ, గుంటూరు, విశాఖలో కేసులు
Mithun Chakraborty: బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తికి ప్రతిష్టాత్మక 'దాదా సాహెబ్ ఫాల్కే' అవార్డు... అఫిషియల్‌గా అనౌన్స్ చేసిన కేంద్ర ప్రభుత్వం
బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తికి ప్రతిష్టాత్మక 'దాదా సాహెబ్ ఫాల్కే' అవార్డు... అఫిషియల్‌గా అనౌన్స్ చేసిన కేంద్ర ప్రభుత్వం
KTR News: కేసీఆర్ ఫ్యామిలీ కూడా బాధితులే, ఆ బాధలు మాకంటే ఎవరికి బాగా తెలుసు: కేటీఆర్
కేసీఆర్ ఫ్యామిలీ కూడా బాధితులే, నిర్వాసితుల బాధలు మాకంటే ఎవరికి బాగా తెలుసు: కేటీఆర్
Embed widget