అన్వేషించండి

MLA Raja Singh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హత్యకు కుట్ర! - ఇంటి వద్ద రెక్కీ నిర్వహించిన ఇద్దరు నిందితుల అరెస్ట్

Telangana News: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటి వద్ద ఇద్దరు అనుమానితులు రెక్కీ నిర్వహించడం సంచలనంగా మారింది. వీరిని పట్టుకున్న స్థానికులు పోలీసులకు అప్పగించారు.

Two Accused Rekky At MLA Raja Singh House: బీజేపీ ఫైర్ బ్రాండ్, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) ఇంటి వద్ద ఇద్దరు వ్యక్తులు ఆదివారం రెక్కీ నిర్వహించడం కలకలం రేపింది. ఇంటి పరిసరాల్లో సంచరిస్తుండగా తొలుత అంతగా పట్టించుకోని స్థానికులు.. తర్వాత అదే పనిగా అక్కడే ఉండడంతో అనుమానంతో చెక్ చేశారు. వారి వద్ద సెల్ ఫోన్లలో గన్, బుల్లెట్లు, రాజాసింగ్ ఫోటోలు కనిపించాయి. దీంతో షాకైన వారు ఇద్దరిని పట్టుకుని మంగళహాట్ పోలీసులకు అప్పగించారు. నిందితులను ఇస్మాయిల్, మహ్మద్ ఖాజాగా గుర్తించారు. ఎమ్మెల్యే ఇంటి వద్ద రెక్కీ నిర్వహించడానికి కారణాలేంటి.?. ఆయన హత్యకు ఏమైనా కుట్ర పన్నారా.? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. కాగా, రాజాసింగ్ హిందుత్వ అంశంలో తన బలమైన గళం వినిపిస్తున్నారు. గతంలోనూ ఆయనకు పలు బెదిరింపు కాల్స్ రాగా పోలీసులను ఆశ్రయించారు. అప్పట్లో రాజాసింగ్ హత్యకు పన్నిన పన్నాగాన్ని పోలీసులు భగ్నం చేశారు.

రెక్కీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

కాగా, తన ఇంటి వద్ద అనుమానితులు రెక్కీ నిర్వహించడంపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నా ఫోటోలు తీసి ముంబైకి పంపిస్తున్నారని అన్నారు. శనివారం రాత్రి నలుగురు అనుమానితులు వచ్చారని.. అందులో ఇద్దరు పారిపోగా మరో ఇద్దరిని స్థానికులు పట్టుకున్నారని చెప్పారు. అనుమానితుల సెల్‌ఫోన్‌లో మా ఇంటి ఫోటోస్, నా ఫోటోస్ ముంబైలో ఉన్న కొందరికి పంపినట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. గతంలో కూడా తమ ఇంటి వద్ద ఐఎస్ఐ తీవ్రవాదులు రెక్కీ నిర్వహించారని అన్నారు.

Also Read: Mallik Tej: యూట్యూబర్‌, ఫోక్ సింగర్ మల్లిక్ తేజ్‌పై అత్యాచార కేసు - పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని యువతి ఫిర్యాదు

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Kids Brushing Tips : పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Embed widget