అన్వేషించండి

TGSRTC: నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాల భర్తీపై మంత్రి పొన్నం కీలక ప్రకటన

Telangana News: త్వరలో ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఉద్యోగులకు పీఆర్సీ, కారుణ్య నియామకాలపై దృష్టి సారిస్తామని చెప్పారు.

Minister Ponnam Prabakar Comments On RTC Jobs: నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్టీసీలో త్వరలోనే 3 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) తెలిపారు. కరీంనగర్ (Karimnagar) నుంచి 33 ఎలక్ట్రిక్ బస్సులను ఆయన కరీంనగర్ నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ ప్రభుత్వానిది ప్రజాపాలన అని.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో సంతోషంగా ఉన్నారని అన్నారు. ఇప్పటివరకూ ఎంతోమంది మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకున్నారని చెప్పారు. మహిళా శక్తి, మెప్మా ద్వారా ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేస్తామని.. ఉద్యోగులకు పీఆర్సీ, కారుణ్య నియామకాలపై దృష్టి సారిస్తామని వెల్లడించారు. 

విద్యుత్ బస్సుల కొనుగోలుకు జేబీఎం సంస్థతో ఆర్టీసీ ఒప్పందం కుదుర్చుకుందని పొన్నం తెలిపారు. 'హైదరాబాద్ సహా ఇతర జిల్లాల్లోనూ  విద్యుత్ బస్సు సర్వీసులను నడపాలన్నదే ప్రభుత్వ ఆలోచన. కాలుష్యాన్ని తగ్గించేందుకు హైదరాబాద్ రింగ్ రోడ్డు లోపల డీజిల్‌తో నడిచే బస్సు ఒక్కటి కూడా లేకుండా ప్రణాళిక రూపొందిస్తున్నాం. అధికారంలోకి వచ్చిన తర్వాత విప్లవాత్మక మార్పులతో ఆర్టీసీని అభివృద్ధి చేస్తున్నాం.' అని పేర్కొన్నారు.

ప్రయాణికులకు గుడ్ న్యూస్

అటు, విజయవాడ (Vijayawada) వెళ్లే ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. బీహెచ్ఎల్ డిపో నుంచి ఓఆర్ఆర్ మీదుగా విజయవాడకు కొత్తగా 2 ఈ - గరుడ బస్సులను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు రంగారెడ్డి రీజనల్ మేనేజర్ శ్రీలత తెలిపారు. సోమవారం నుంచి ఈ సర్వీసులు ప్రారంభమవుతాయని.. రామచంద్రపురం, బీరంగూడ, చందానగర్, మియాపూర్, నిజాంపేట్ క్రాస్ రోడ్స్, హౌసింగ్ బోర్డ్ మీదుగా జేఎన్టీయూ రైతు బజార్, మలేషియా టౌన్ షిప్, శిల్పారామం, సైబర్ టవర్స్, మై హోమ్ భుజా, సైబరాబాద్ కమిషనరేట్, టెలికాంనగర్ మీదుగా ఓఆర్ఆర్ నుంచి విజయవాడకు ప్రయాణిస్తాయని చెప్పారు. ప్రతి రోజూ రాత్రి 9:30, 10:30 గంటలకు రామచంద్రాపురం నుంచి ఈ బస్సులు బయలుదేరుతాయని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Also Read: Airport Metro Alignment: ఎయిర్ పోర్ట్ మెట్రో అలైన్‌మెంట్ మార్పు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TGSRTC: నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాల భర్తీపై మంత్రి పొన్నం కీలక ప్రకటన
నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాల భర్తీపై మంత్రి పొన్నం కీలక ప్రకటన
First Selfie: భారత్‌లో ఫస్ట్‌ సెల్ఫీకి 145 ఏళ్లు? - ఆ రోజుల్లోనే ఆ సెల్ఫీ ఎవరు దిగారు?, వాళ్ల ప్రత్యేకతలు ఏంటి?
భారత్‌లో ఫస్ట్‌ సెల్ఫీకి 145 ఏళ్లు? - ఆ రోజుల్లోనే ఆ సెల్ఫీ ఎవరు దిగారు?, వాళ్ల ప్రత్యేకతలు ఏంటి?
Leopard In Tirumala: తిరుమలలో మరోసారి చిరుత కలకలం, మెట్టు మార్గంలో చూసినట్లు చెబుతున్న భక్తులు
తిరుమలలో మరోసారి చిరుత కలకలం, మెట్టు మార్గంలో చూసినట్లు చెబుతున్న భక్తులు
MLA Raja Singh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హత్యకు కుట్ర! - ఇంటి వద్ద రెక్కీ నిర్వహించిన ఇద్దరు నిందితుల అరెస్ట్
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హత్యకు కుట్ర! - ఇంటి వద్ద రెక్కీ నిర్వహించిన ఇద్దరు నిందితుల అరెస్ట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తమిళనాడు డిప్యుటీ సీఎంగా ఉదయ నిధి స్టాలిన్, ప్రకటించిన డీఎమ్‌కేకేరళలో చోరీ, తమిళనాడులో ఎన్‌కౌంటర్ - భారీ యాక్షన్ డ్రామాSecond Moon: భూమికి చిన్న చందమామ వస్తున్నాడు - రెండో చంద్రుడు ఎలా సాధ్యం?Ponguleti Srinivas: పొంగులేటి శ్రీనివాస్ ఇంట్లో ఈడీ సోదాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TGSRTC: నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాల భర్తీపై మంత్రి పొన్నం కీలక ప్రకటన
నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాల భర్తీపై మంత్రి పొన్నం కీలక ప్రకటన
First Selfie: భారత్‌లో ఫస్ట్‌ సెల్ఫీకి 145 ఏళ్లు? - ఆ రోజుల్లోనే ఆ సెల్ఫీ ఎవరు దిగారు?, వాళ్ల ప్రత్యేకతలు ఏంటి?
భారత్‌లో ఫస్ట్‌ సెల్ఫీకి 145 ఏళ్లు? - ఆ రోజుల్లోనే ఆ సెల్ఫీ ఎవరు దిగారు?, వాళ్ల ప్రత్యేకతలు ఏంటి?
Leopard In Tirumala: తిరుమలలో మరోసారి చిరుత కలకలం, మెట్టు మార్గంలో చూసినట్లు చెబుతున్న భక్తులు
తిరుమలలో మరోసారి చిరుత కలకలం, మెట్టు మార్గంలో చూసినట్లు చెబుతున్న భక్తులు
MLA Raja Singh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హత్యకు కుట్ర! - ఇంటి వద్ద రెక్కీ నిర్వహించిన ఇద్దరు నిందితుల అరెస్ట్
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హత్యకు కుట్ర! - ఇంటి వద్ద రెక్కీ నిర్వహించిన ఇద్దరు నిందితుల అరెస్ట్
Vijayawada News: విజయవాడలో తీవ్ర విషాదం - ఇద్దరు పిల్లలతో కలిసి కాల్వలోకి దూకిన తల్లి
విజయవాడలో తీవ్ర విషాదం - ఇద్దరు పిల్లలతో కలిసి కాల్వలోకి దూకిన తల్లి
Arshad Warsi: ‘జోకర్’ వివాదానికి అర్షద్ వార్సీ ఫుల్‌స్టాప్ - నేను ప్రభాస్‌ని అనలేదంటూ!
‘జోకర్’ వివాదానికి అర్షద్ వార్సీ ఫుల్‌స్టాప్ - నేను ప్రభాస్‌ని అనలేదంటూ!
Aditi Shankar: 'గేమ్ ఛేంజర్' దర్శకుడు శంకర్ కుమార్తె తెలుగు డెబ్యూ - తమిళ్ రీమేక్‌తోనే, హీరోలు ఎవరో తెలుసా?
'గేమ్ ఛేంజర్' దర్శకుడు శంకర్ కుమార్తె తెలుగు డెబ్యూ - తమిళ్ రీమేక్‌తోనే, హీరోలు ఎవరో తెలుసా?
Cyber Crime: తెలుగు రాష్ట్రాల్లో సైబర్ నేరాలు - విశాఖలో సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేసిన సీబీఐ, తెలంగాణలో ఒకే ఖాతాలోకి రూ.124 కోట్లు
తెలుగు రాష్ట్రాల్లో సైబర్ నేరాలు - విశాఖలో సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేసిన సీబీఐ, తెలంగాణలో ఒకే ఖాతాలోకి రూ.124 కోట్లు
Embed widget