అన్వేషించండి

Top 10 Headlines Today: అఖిల పక్షం భేటీకి కేసీఆర్‌ ఎందుకు దూరమైనట్టు? పవన్‌ను వైసీపీ ఎందుకంతలా టార్గెట్‌ చేసింది?

Top 10 Headlines Today: నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం

Top 10 Headlines Today: 

వారాహి వెనుక అధికార పార్టీ

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్ర ప్రారంభించి పది రోజులు అవుతోంది. పవన్ కల్యాణ్ యాత్ర ఎక్కడ పెట్టినా ఎవరూ జన సమీకరణ చేయాల్సిన పని లేదు. ఆయన పవర్ స్టార్. అదీ గోదావరి జిల్లాల్లో అయితే ఇక చెప్పాల్సిన పనిలేదు. వచ్చిన వారందరూ ఓట్లేస్తారా లేదా అన్నదానిపై పవన్ కల్యాణ్ తనకు తానే సెటైర్లు వేసుకున్నా.. ఆయన జనాకర్షణ మాత్రం మాస్. అయితే గతంలోలా కాదు .. ఈ సారి ఆయన  వారాహి యాత్ర రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ముఖ్యంగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్ర స్థాయిలో ఎదురుదాడి వస్తోంది. ఆయనను  ఓ సామాజికవర్గానికి పరిమితం చేయాలని.. ఆయనకు మద్దతు ఉంటుందని భావిస్తున్న వర్గంలో చీలిక కోసం ఇలాంటి ఎదురుదాడి వైసీపీ చేస్తోందన్న భావన బలంగా ఏర్పడుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

అఖిల పక్ష భేటీకి కేసీఆర్ ఎందుకు దూరంగా ఉన్నారు?

బీజేపీని ఓడించడానికి కలవాల్సింది పార్టీలు కాదని.. ప్రజలని  విపక్షాల సమావేశానికి హాజరవడంపై ఢిల్లీలో మీడియా ప్రతినిధులు ప్రశ్నించనప్పుడు కేటీఆర్ ప్రకటించారు.  గెలవాల్సింది పార్టీలు కాదు.. ప్రజలు అని కేసీఆర్ బహిరంగసభల్లో  చెప్పినట్లే కేటీఆర్ చెప్పారు.  దేశంలో మూడో  ప్రత్యామ్నాయం అవసరం ఉందని.. ఫెడరల్ ఫ్రంట్ పెడతానని దేశవ్యాప్తంగా తిరిగిన నేత కేసీఆర్. పార్టీలన్నీ కలిసి రాకపోవడంతో బీజేపీకు ప్రత్యామ్నాయంగా మరో వేదిక ఉండాలని తన పార్టీ పేరుతో భారత రాష్ట్ర సమితిగా మార్చేశారు.  కానీ ఇప్పుడు  బీజేపీపై యుద్ధానికి ఇతర పార్టీలతో కలిసేందుకు బీఆర్ఎస్ సిద్ధంగా లేదు. పార్టీలు కాదు ప్రజలు కలవాలని అంటున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

తెలంగాణయే నా అడ్డా!

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఏపీలో షర్మిల రాజకీయాలు చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈ అంశంపై  వైఎస్ షర్మిల సోషల్ మీడియాలో పరోక్షంగా స్పందించారు. ఏపీకి వెళ్లే ప్రశ్నే లేదని తన స్పందన ద్వారా తేల్చి చెప్పారు.  వైఎస్ షర్మిల రెడ్డి తన చివరి శ్వాస వరకు తెలంగాణ బిడ్డగా, తెలంగాణ కొరకు పోరాడుతూనే ఉంటుందన్నారు.  ఊహాజనిత కథలు కల్పిస్తూ, నాకు, తెలంగాణ ప్రజలమధ్య అగాధాన్ని సృష్టించే విఫల యత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. పనిలేని,పసలేని దార్శనికులకు నేను చెప్పేది ఒకటనని.. తన రాజకీయ భవిత మీద పెట్టె దృష్టిని, సమయాన్ని కేసీఅర్ పాలనపై పెట్టాలని సూచించారు.  అన్నివిధాలుగా కేసీఆర్ సర్కారు పాలనలో సర్వనాశనమైపోతున్న తెలంగాణ భవితమీద పెట్టండి. కేసీఆర్ కుటుంబం అవినీతిని ఎండగట్టండి. నా భవిష్యత్తు తెలంగాణతోనే, తెలంగాణలోనే, నా ఆరాటం, నా పోరాటం తెలంగాణ కోసమేనని స్పష్టం చేశారు.  పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

ఏపీ బీజేపీ ఆపసోపాలు

ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల నాటికి భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసి  నాయకత్వాన్ని పటిష్టం చేసేందుకు చర్యలు వేగవంతం చేస్తోంది. త్వరలోనే ప్రత్యేక కార్యక్రమాలను ప్లాన్ చేయాలని భావిస్తోంది. ఎట్టి పరిస్దితుల్లో ఎన్నికల నాటికి భారతీయ జనతా పార్టీ మిగిలి పార్టీలతో పోటీగా రణక్షేత్రంలో నిలబడాలనే ఆలోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు. పరిస్థితులు ఎలా ఉన్నా, ప్రత్యర్థులు ఎలాంటి ఎత్తుగడలు వేసినా డోంట్ కేర్ అనేలా ఉండాలని స్కెచ్ వేస్తోంది. ముందుగానే క్లారిటితో పోటీలో భాగం కావాలనే ఆలోచనతో పార్టీని నడిపేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు టాక్. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

మోదీ కీలక ప్రసంగం

అమెరికాలో స్థిరపడిన భారతీయ సంతతిని ఉద్దేశించి ప్రధానమంత్రి మోదీ ప్రసంగించారు. అమెరికా పర్యటన సందర్భంగా వాషింగ్టన్ డీసీలోని రోనాల్డ్ రీగన్ సెంటర్లో ఈ కార్యక్రమం జరిగింది. తన మూడు రోజుల పర్యటనలో లభించిన ప్రేమాభిమానాలకు మీరే కారణం అంటూ కితాబు ఇచ్చారు. ఈ సందర్భంగా అమెరికాతో చేసుకున్న ఒప్పందాలను మోదీ వివరించారు. భారత్‌ అమెరికా మధ్య స్నేహ బంధంలో కొత్త ప్రయాణం మొదలైందన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

 

మెగా మెడికల్ క్యాంపులు

అభిమానులను, సినీ కార్మికులను రక్షించేందుకు మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఓ ముందడుగు వేశారు. స్టార్ క్యాన్సర్ సెంటర్ తో కలిసి చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో అందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ ప్రెస్ మీట్ లో చిరంజీవి మాట్లాడుతూ.. "సుమారు 80% క్యాన్సర్లను ముందుగా గుర్తిస్తే, ట్రీట్మెంట్ చేయడం ఈజీ అవుతుందని ఈ సందర్భంగా చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

ఏం'టీ' అంత కాాస్టా?

భారతదేశంలో తేయాకు పెద్ద ఎత్తున పండిస్తారు. అందుకే, మన దగ్గర టీ పొడి తక్కువ ధరకు, మార్కెట్‌లో సులభంగా దొరుకుతుంది. మన దేశంలో, సగటున ఒక కిలో టీ పొడి రూ. 500 పలుకుతోంది. బాగా డబ్బున్న వాళ్లు వేలు, లక్షలు పోసి ప్రీమియం టీ పౌడర్ కొంటుంటారు. కోట్లాది రూపాయల ఖరీదైన టీ పొడులు కూడా ప్రపంచంలో ఉన్నాయి. అయితే, అన్నింటి కంటే అత్యంత ఖరీదైన టీ మాత్రం ఒక్కటే. ఆ తేయాకును మన పొరుగు దేశం చైనాలో పండిస్తారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

ఇంటి వద్దే అప్‌డేట్

వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేలా రైతుల కోసం కేంద్ర సర్కారు 2019 లో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం - కిసాన్) పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో భాగంగా ఏడాదికి రూ.6 వేల చొప్పున, మూడు వాయిదాల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. అయితే తాజాగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పీఎం కిసాన్ కు రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేసింది. దీని కోసం కిసాన్ మొబైల్ యాప్ ని అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇప్పుడు రైతులు ఇంటి వద్ద కూర్చొని సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఫేస్-రికగ్నిషన్ టెక్నాలజీతో ఈ ప్రక్రియ సాగుతుంది. ఇందులో పేపర్ వర్క్, మాన్యువల్ అప్లికేషన్లు లేకుండా చాలా సులభతరంగా ఉంటుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర తోమర్ తెలిపారు. ఈ యాప్ తో ఉన్న ప్రయోజనాలను కూడా కేంద్ర మంత్రి వివరించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

నిజంగా అది పెరుగు గిన్నె

పెరుగు తయారీకి సాధార‌ణంగా మ‌నం పాల‌లో పెరుగు చూక్క వేసి తోడు పెడ‌తాం. కానీ ఈ గిన్నెలో పాల‌ను పోసి ఉంచితే చాలు.. పెరుగుగా మారుతుంది. ఇందులో ఎటువంటి పెరుగు చుక్కా వేయాల్సిన అవ‌స‌రం లేదు. అలాంటి గిన్నె ఒక‌టి ఉందా అని ఆశ్చ‌ర్య‌పోతున్నారా? అయితే ఆ గిన్నె ఏమిటో, ఎక్క‌డ దొరుకుతుందో తెలుసుకుందామా?పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

విండీస్‌ టూర్‌ జట్టు

వెస్టిండీస్‌లో పర్యటించే భారత జట్లను బీసీసీఐ ప్రకటించింది. టెస్టు, వన్డే ఆటగాళ్లను ఎంపిక చేసింది. కొందరు సీనియర్లను పక్కన పెట్టి జూనియర్లకు అవకాశం కల్పించింది. యశస్వీ జైశ్వాల్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, ముకేశ్ కుమార్‌కు సుదీర్ఘ ఫార్మాట్లో చోటు దక్కింది. నయావాల్‌ ఛెతేశ్వర్‌ పుజారాను పక్కన పెట్టారు. మహ్మద్‌ షమీకి విశ్రాంతినిచ్చారు. ఉమేశ్‌ యాదవ్‌ను తప్పించారు. నవదీప్‌ సైనీకి చోటిచ్చారు. వన్డే టీమ్‌లో పెద్దగా మార్పులేమీ కనిపించలేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
BRS News: రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
Embed widget