Morning Top News: రియల్ మార్కెట్‌కు హైడ్రా భరోసా, ఏపీలో పిపిపి మోడల్‌కు ప్లాన్ వంటి మార్నింగ్ న్యూస్
Top 10 Headlines Today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయవ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తల సమాహారం ఇక్కడ చూడొచ్చు.
Morning Top News:
రియల్ మార్కెట్‌కు హైడ్రా భరోసా
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం స్లంప్‌నకు కారణంగా హైడ్రా విమర్శలు ఎదుర్కొంటోంది. హైడ్రా భయంతో ఇళ్లు కొనాలనుకున్న వాళ్లు కూడా ఆగిపోయారని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దీనికి హైడ్రా దిద్దుబాటు చర్యలు చేపట్టింది. అనుమతులు ఉన్న నిర్మాణాలను కూల్చివేయబోమని, చట్టబద్ధంగా చేపట్టిన వెంచర్ల విషయంలో ఆందోళన అక్కర్లేదని రియల్ ఎస్టేట్‌కు భరోసా కల్పించేలా సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన ఆదేశాలకు కట్టుబడి ఉంటామని హైడ్రా కమిషనర్ ప్రకటించింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
ఏపీలో పబ్లిక్,ప్రైవేటు పార్టనర్ షిప్ మోడల్
చంద్రబాబునాయుడు ఏపీలో అభివృద్ధి పనులకు పబ్లిక్,ప్రైవేటు పార్టనర్ షిప్ మోడల్ అనుసరించాలనుకుంటున్నారు. అంటే రోడ్లను ప్రైవేటు కంపెనీలతో వేయిస్తారు. ప్రజల నుంచి టోల్ వసూలు చేస్తారు. ఇప్పటి వరకూ జాతీయ రహదారుల్లో ఈ విధానం ఉంది. ఇప్పుడు రాష్ట్ర రహదారులకూ తీసుకు వస్తారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
ఏపీ మంత్రివర్గం కీలక నిర్ణయాలు
ఏపీ టూరిజం పాలసీకి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. పర్యాటక ప్రాజెక్టులకు పరిశ్రమ హోదా కల్పించే ప్రతిపాదనలపై చర్చించి ఆమోదించారు. జ్యుడీషియల్ ప్రివ్యూ రద్దుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ ఇన్‌ఫ్రా ట్రాన్స్‌పరెన్సీ యాక్ట్ 2019 రిపీట్ చేయాలని ప్రతిపాదించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో స్థానిక సంస్థల్లో ఛైర్మన్లపై అవిశ్వాసం పెట్టే అంశంపై చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది అవిశ్వాసం పెట్టే గడువును నాలుగేళ్ల నుంచి రెండేళ్లకు కుదిస్తూ చట్ట సవరణ చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి
తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. చలి పంజా విసురుతోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉదయాన్నే మంచు సహా చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణలో రానున్న వారం రోజుల్లో 15 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పలు సూచనలు చేసింది. శీతల సమయాల్లోనే ఇన్‌ఫ్లూయెంజా పంజా విసిరే అవకాశం ఉందని వార్నింగ్ ఇచ్చింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
మహారాష్ట్రలో మళ్లీ కమల వికాసమే
మహారాష్ట్రలో మళ్లీ బీజేపీ నేతృత్వంలోని మహాయుతికే అధికారం దక్కనుందని మెజార్టీ సర్వేలు వెల్లడించాయి. మ్యాట్రిస్ నిర్వహించిన మహారాష్ట్ర ఎన్నికల ఎగ్జిట్ పోల్ ప్రకారం మహాయుతికి 150 నుంచి 170 సీట్లు వచ్చే అవకాశం ఉంది. మహావికాస్ అఘాడి కూటమికి కనిష్టంగా 110 సీట్లు, గరిష్టంగా 130 సీట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. ఇతరులు 8 నుంచి 10 స్థానాల్లో నెగ్గనున్నారని మాట్రిస్ సర్వేలో తేలింది. బీజేపీ కూటమి 48 శాతం ఓటు షేర్, కాంగ్రెస్ కూటమికి 42 శాతం ఓటు షేరు రానుంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై PMARQ నిర్వహించిన ఎగ్జిట్ పోల్‌లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమికి 137 నుంచి 157 సీట్లు రాగా, కాంగ్రెస్ నేతృత్వంలోని మహావికాస్ అఘాడికి 126- 146 సీట్లు వచ్చే అవకాశం ఉందని వచ్చింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
జార్ఖండ్ లోనూ ఎన్డీయేకే ఎడ్జ్
జార్ఖండ్ అసెంబ్లీకి మొత్తం రెండు దశలలో ఎన్నికలు జరిగాయి. జార్ఖండ్ అసెంబ్లీలో మొత్తం 81 స్థానాలుండగా, కనీస మెజార్టీ రావాలంటే 41 సీట్లు సాధించాలి. సర్వే సంస్థలు మాట్రిస్, టైమ్స్ నౌ - జేవీసీ, పీపుల్స్ పల్స్ జార్ఖండ్ ఎన్నికల ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడించాయి. టైమ్స్ నౌ-జేవీసీ ఎగ్జిట్ పోల్ రిజల్ట్: జార్ఖండ్ లో ఎన్డీయే కూటమికి ఎడ్జ్ ఇచ్చింది. టైమ్స్ నౌ- జేవీసీ సర్వేలో బీజేపీ కూటమికి 40 నుంచి 44 సీట్లు రానున్నాయి. కాంగ్రెస్ (I.N.D.I.A) కూటమి 20 నుంచి 40 సీట్లు కైవసం చేసుకోనుండగా, ఇతరులు ఒకట్రెండు స్థానాల్లో నెగ్గే అవకాశం ఉందని అంచనా వేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..