అన్వేషించండి

Manchu Politics: మంచు కుటుంబ వివాదంలో రాజకీయ కోణం - టీడీపీ, వైసీపీ నేతల ప్రమేయం ఉందా ?

Mohanbabu: మంచు కుటుంబ వివాదంలో రాజకీయం ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. మంచు విష్ణు వైసీపీ నేత జగన్ కు సమీప బంధువు కాగా.. మంచు మనోజ్ టీడీపీ ఎమ్మెల్యే సోదరిని పెళ్లిచేసుకున్నారు.

Politics in the Manchu family dispute: మంచు మోహన్ బాబు తన కుమారుడు మనోజ్ , ఆయన భార్య మౌనికల నుంచి ప్రాణహాని ఉందని పోలీసులుక ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో కొంత మంది బయట వ్యక్తులు తన ఇంటిని ఆక్రమించుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. వారిని తన కుమారుడు మనోజ్, ఆయన భార్య మౌనికనే తీసుకు వచ్చారని కూడా అన్నారు. ఆయన ఉద్దేశం ప్రకారం మనోజ్ భార్య మౌనిక సోదరి అఖిలప్రియ అనుచరులు వచ్చి ఉంటారని అనుకోవచ్చు. మంచు కుటుంబ వ్యవహారంలో రాజకీయాలు ఉన్నాయని ఎవరూ అనుకోలేదు. కానీ మోహన్ బాబు లేఖ తర్వాత  ఈ కుటుంబ ఆస్తుల వివాదంలో రాజకీయాలు కూడా ఉన్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

మనోజ్ దంపతులకు టీడీపీ బ్యాక్ గ్రౌండ్ 

మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకున్నారు. ఆళ్లగడ్డకు చెందిన ఫ్యాక్షన్ ఫ్యామిలీగా పేరున్న భూమా కుటుంబ అమ్మాయి మౌనికను పెళ్లి చేసుకున్నారు. వారిద్దరికి ఓ బిడ్డ కూడా పుట్టింది. భూమా దంపతుల మరణం తర్వాత భూమా అఖిలప్రియ రాజకీయాల్లోకి వచ్చారు. తన తండ్రికి తగ్గట్లుగా దూకుడు రాజకీయాలు చేస్తున్నారు. గతంలో ఓ ఆస్తి వ్యవహారంలో కొంత మందిని కిడ్నాప్ చేశారన్న ఆరోపణలపై జైలుకు కూడా వెళ్లారు. ఇప్పుడు ఆమె ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా ఉన్నారు. మంచు కుటుంబంలో ఆస్తి గొడవలు ఉండటంతో  ఆళ్ల గడ్డ నుంచి వారి అనుచరులు వచ్చి ఉంటారని భావిస్తున్నారు. ఫ్యాక్షన్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వారు కావడంతోనే మోహన్ బాబు భయపడి పోలీసులకు ఫిర్యాదు చేశారన్న అభిప్రాయం వినిపిస్తోంది. అందులో నేరుగా తెలుగుదేశం పార్టీ నేతల ప్రమేయం ఉండకపోయినా కుటుంబసభ్యులు టీడీపీకి చెందిన వారు కావడంతో వారు..మనోజ్, మౌనికకు సపోర్టు చేస్తున్నారని అనుకోవచ్చు. 

Also Read: ఆస్తుల్లో తన వాటా తీసుకుని ముంబైలో ఎంజాయ్ చేస్తున్న మంచు లక్ష్మి - అన్నదమ్ముల గొడవను అక్క తీర్చే చాన్స్ లేదా ?

జగన్‌కు సమీప బంధువు మంచు విష్ణు

మరో వైపు మంచు విష్ణుకు వైసీపీ నేతలు చాలా దగ్గర. స్వయంగా జగన్, భరతిరెడ్డి దంపతులకు ఆయన ఆత్మీయుడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు సుధీకర్ రెడ్డి కుమార్తెను మంచు విష్ణు పెళ్లి చేసుకున్నారు. వారి మధ్య బంధుత్వం బలపడింది. మోహన్ బాబు కూడా వైసీపీలో చేరారు. అయితే ఇప్పుడు వైసీపీలో లేరు. రాజకీయాలు పట్టించుకోవడం లేదు. ఈ వివాదంలో ఆయనకు వైసీపీ నేతల నుంచి మద్దతు ఉంటుందని బావిస్తున్నారు.  మంచు విష్ణు ప్రస్తుతం అమెరికాలో ఉండటంతో  ఆయన కొంత మందిని ఇంటి వద్దకు సెక్యూరిటీకి పంపారని.. సీసీ ఫుటేజీలను డిలీట్ చేయించారన్న ప్రచారం జరుగుతోంది. 

Also Readపవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన అల్లు అర్జున్... ఇక మెగా వర్సెస్ అల్లు వివాదానికి ఎండ్ కార్డ్!?

ఆస్తుల వ్యవహారం కావడంతో రాజకీయ జోక్యం ఉంటుందని అంచనా !

మోహన్ బాబు కుటుంబం గతంలో రాజకీయాలు చేసింది. అయితే ఇప్పుడు కుటుంబంలో ఆస్తుల వివాదాలు రావడంతో రాజకీయ జోక్యం అంతర్గతంగా ఉంటుందని అంటున్నారు. మీ వెనుక మేముంటాం.. మీ ఆస్తుల కోసం పోరాడండి అని కొంతమంది అన్నదమ్ముల్ని ఎగదోయవచ్చని చెబుతున్నారు. మొత్తంగా మంచు కుటుంబం క్రమశిక్షణకు మారు పేరు అని చెబుతారు. కానీ ఇప్పుడు పూర్తిగా రోడ్డు మీద పడిపోయారు. మోహన్ బాబుపై మనోజ్ ఫిర్యాదు చేయలేదు కానీ.. మోహన్ బాబు మాత్రం మనోజ్ తో పాటు ఆయన భార్యపై నేరుగా ఫిర్యాదు చేశారు. దీంతో మంచు కుటుంబ వివాదం మరింత రాజుకునే అవకాశం ఉంది. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mohan Babu Complaint Against Manoj: మంచు మనోజ్ నుంచి నాకు ప్రాణహాని ఉంది - పోలీసులకు మోహన్ బాబు ఫిర్యాదు
మంచు మనోజ్ నుంచి నాకు ప్రాణహాని ఉంది - పోలీసులకు మోహన్ బాబు ఫిర్యాదు
Nagababu:వీడిన సస్పెన్స్ - ఏపీ కేబినెట్ లో మెగా బ్రదర్ నాగబాబుకు కీలక పదవి
వీడిన సస్పెన్స్ - ఏపీ కేబినెట్ లో మెగా బ్రదర్ నాగబాబుకు కీలక పదవి
Revanth Reddy Key Decisions: తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన - 9 మంది ప్రముఖులకు రూ.1 కోటి నగదు, ఇంటి స్థలం
తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన - 9 మంది ప్రముఖులకు రూ.1 కోటి నగదు, ఇంటి స్థలం
Best Selling SUV: ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీ ఇదే - నెక్సాన్, పంచ్, బ్రెజాలను వెనక్కి తోసేసిన కారు ఇదే!
ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీ ఇదే - నెక్సాన్, పంచ్, బ్రెజాలను వెనక్కి తోసేసిన కారు ఇదే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Manchu Manoj vs Mohan babu | కరిగిన మంచు...ముదిరిన వివాదం | ABP DesamPushpa Day 4 Collections | రోజు రోజుకూ కలెక్షన్లు పెంచుకుంటున్న పుష్ప 2 | ABP DesamPushpa 2 Breaking all Bollywood Records | హిందీ సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న పుష్ప కలెక్షన్లు | ABP Desamఆటో డ్రైవర్ ఫ్యామిలీతో కేటీఆర్, ఆత్మీయ ముచ్చట - వైరల్ వీడియో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Babu Complaint Against Manoj: మంచు మనోజ్ నుంచి నాకు ప్రాణహాని ఉంది - పోలీసులకు మోహన్ బాబు ఫిర్యాదు
మంచు మనోజ్ నుంచి నాకు ప్రాణహాని ఉంది - పోలీసులకు మోహన్ బాబు ఫిర్యాదు
Nagababu:వీడిన సస్పెన్స్ - ఏపీ కేబినెట్ లో మెగా బ్రదర్ నాగబాబుకు కీలక పదవి
వీడిన సస్పెన్స్ - ఏపీ కేబినెట్ లో మెగా బ్రదర్ నాగబాబుకు కీలక పదవి
Revanth Reddy Key Decisions: తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన - 9 మంది ప్రముఖులకు రూ.1 కోటి నగదు, ఇంటి స్థలం
తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన - 9 మంది ప్రముఖులకు రూ.1 కోటి నగదు, ఇంటి స్థలం
Best Selling SUV: ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీ ఇదే - నెక్సాన్, పంచ్, బ్రెజాలను వెనక్కి తోసేసిన కారు ఇదే!
ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీ ఇదే - నెక్సాన్, పంచ్, బ్రెజాలను వెనక్కి తోసేసిన కారు ఇదే!
Telangana Group 2 Exam Date: 'గ్రూపు-2' పరీక్షలకు లైన్ క్లియర్, వాయిదాకు హైకోర్టు నిరాకరణ, షెడ్యూలు ప్రకారమే పరీక్షలు
'గ్రూపు-2' పరీక్షలకు లైన్ క్లియర్, వాయిదాకు హైకోర్టు నిరాకరణ, షెడ్యూలు ప్రకారమే పరీక్షలు
Syria Civil War: సిరియాలో అంతర్యుద్ధానికి ఐదు ప్రధాన కారణాలు ఇవే
సిరియాలో అంతర్యుద్ధానికి ఐదు ప్రధాన కారణాలు ఇవే
Satyabhama Serial Today December 10th: సత్యభామ సీరియల్: మహదేవయ్య హైడ్రామా.. రోడ్డున పడ్డ సత్య కన్నవారు.. నెత్తి, గుండె బాదుకొని ఏడుస్తున్న ఫ్యామిలీ!
సత్యభామ సీరియల్: మహదేవయ్య హైడ్రామా.. రోడ్డున పడ్డ సత్య కన్నవారు.. నెత్తి, గుండె బాదుకొని ఏడుస్తున్న ఫ్యామిలీ!
Manchu Family Issue: కుటుంబసభ్యులపై మనోజ్ ఫిర్యాదు చేయలేదు - దాడి చేసింది గుర్తు తెలియని వ్యక్తులు - పోలీసుల కీలక ప్రకటన
కుటుంబసభ్యులపై మనోజ్ ఫిర్యాదు చేయలేదు - దాడి చేసింది గుర్తు తెలియని వ్యక్తులు - పోలీసుల కీలక ప్రకటన
Embed widget