అన్వేషించండి

Top 10 Headlines Today: లేటెస్ట్ అప్‌డేట్స్‌తో మే 17 నాటి మార్నింగ్ టాప్‌ టెన్స్‌ న్యూస్

Top 10 Headlines Today: తెలుగు రాష్ట్రాలు సహా జాతీయ వ్యాప్తంగా చోటు చేసుకున్న తాజా టాప్ 10 న్యూస్ మీకోసం..

Top 10 Headlines Today:

నిప్పుల కుంపటి

తెలంగాణలో నేడు దిగువ స్థాయిలో గాలులు వాయువ్య దిశ నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావం వల్ల రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణమే కొనసాగుతుందని అధికారులు చెప్పారు. రాగల మూడు రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు కొన్ని ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సుమారుగా 42 డిగ్రీల నుండి 44 డిగ్రీల వరకు నమోదు అయ్యే అవకాశం ఉంది. ఏపీలో అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు. మంగళవారం (మే 16) తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో 46.8 డిగ్రీలు, ప్రకాశం జిల్లా  మద్దిపాడు మండలంలో 46.7 డిగ్రీలు, శ్రీకాకుళం జిల్లా  కొత్తూరులో 46.5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు చెప్పారు. పలు జిల్లాల్లో మొత్తంగా 13 మండలాల్లో 46 డిగ్రీలకు, 39 మండలాల్లో 45 డిగ్రీలకు పైగా, 255 మండలాల్లో 42 డిగ్రీల నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వెల్లడించారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఏపీలో బీజేపీ ఒంటరిగా ఎదగలేదా ?

దేశంలో అన్ని రాష్ట్రాల్లో బీజేపీ బలాన్ని ఓట్లశాతం ప్రకారం చూస్తే.. అత్యంత లీస్ట్ లో ఉండేది ఆంధ్రప్రదేశ్. బీజేపీకి ఒకటి కన్నా తక్కువ శాతం ఓటింగ్ నమోదయింది.   గుజరాత్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లలో ఒకప్పుడు బీజేపీకి ఒక్క సీటే ఉండేది.  ఇప్పుడు గుజరాత్  లో తిరుగులేని స్థానంలో ఉంది.  కర్ణాటకలో నిన్నటి వరకూ అధికారంలో ఉంది. కానీ ఏపీలో ఒక్క శాతం ఓట్లు కూడా తెచ్చుకోలేకపోతోంది.  బీజేపీ ఒకప్పుడు దేశవ్యాప్తంగా రెండే లోక్‌సభ సీట్లతో ప్రయాణం ప్రారంభించింది. ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లోనూ బలపడుతోంది. కానీ ఏపీలో మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుగా పరిస్థితి మారింది. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కీలక నిర్ణయం

సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ నెల 18న తెలంగాణ కేబినెట్ (Telangana Cabinet Meet) స‌మావేశం జ‌ర‌గ‌నుంది. కొత్తగా నిర్మించిన తెలంగాణ స‌చివాల‌యంలో తొలిసారి కేబినెట్ సమావేశం జరగనుంది. 18న మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు మంత్రివ‌ర్గ స‌మావేశం ప్రారంభం కానుంది. మంత్రుల‌తో పాటు ప‌లువురు ఉన్నతాధికారులు ఈ స‌మావేశానికి హాజ‌రు కానున్నారు. ఈ కేబినెట్ స‌మావేశంలో కీల‌క నిర్ణయాలు తీసుకునే అవ‌కాశం ఉంది. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గడువు పెంపు

తెలంగాణలో ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్, సెకండియ‌ర్ ఫ‌లితాలు మే 9న విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఈ ప‌రీక్ష‌ల్లో ఫెయిలైన విద్యార్థుల కోసం జూన్ 4 నుంచి అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని ఇంట‌ర్ బోర్డు నిర్ణ‌యించిన విష‌యం విదిత‌మే. ఫెయిలైన విద్యార్థులు మే 16 వ‌ర‌కు సంబంధిత కాలేజీల్లో ప‌రీక్ష ఫీజు చెల్లించాల‌ని అధికారులు ఆదేశించారు. అయితే ఆయా కాలేజీల యాజ‌మాన్యాలు, విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రుల విజ్ఞ‌ప్తుల మేర‌కు ప‌రీక్ష ఫీజు చెల్లింపు గ‌డువును మే 19 వ‌ర‌కు పొడిగిస్తున్న‌ట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిత్తల్ ఒక ప్రకటనలో తెలిపారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పల్నాడు జిల్లాలో రోడ్డు ప్రమాదం-ఐదుగురు మృతి

పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు కూలీలు మృతి చెందారు. నల్గొండ జిల్లా దామచర్ల మండలం నరసాపురం గ్రామానికి చెందిన కూలీలు పల్నాడు జిల్లా గురజాల మండలం పులిపాడు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ఆటోను లారీ ఢీ కొట్టడంతో ఐదుగురు స్పాట్‌లోనే చనిపోయారు. ప్రమాద సమయంలో ఆటోలో 23 మంది ప్రయాణిస్తున్నారు. ఈ దుర్ఘటనలో ఐదుగురు చనిపోగా... మరో ఏడుగురు గాయపడ్డారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ రాశివారిని అనుకోని సమస్యలు చుట్టుముడతాయి!

ఈ రోజు మేషరాశివారికి ఆర్థిక పరిస్థితి మొదట్లో బలహీనంగా ఉన్నా, కానీ తరువాత ధనాభివృద్ధి ఉంటుంది. ఈరోజు మీరు పిల్లల నుంచి కొన్ని శుభవార్తలు వింటారు. ప్రభుత్వ ఉద్యోగాలలో పని చేస్తున్న వారికి ఈరోజు ప్రమోషన్ లభించే అవకాశం మెండుగా ఉంది. కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది. వ్యాపారం బాగాస సాగుతుంది. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

హౌస్‌ లోన్‌ తీసుకున్నా తిరిగి కట్టాల్సిన పని లేదు

హౌస్‌ లోన్‌ తీసుకుంటే మీరు బ్యాంక్‌కు EMI కట్టాలి. అదే, రివర్స్‌ మార్టిగేజ్‌ లోన్‌ తీసుకుంటే, బ్యాంక్‌లే మీకు EMI చెల్లిస్తాయి. అందుకే దీనిని రివర్స్‌ మార్ట్‌గేజ్‌ లోన్‌ అన్నారు. పైగా, దీనిని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. నివశించడానికి వీలున్న సొంత ఇల్లు ఉన్నవారికే ఈ అవకాశం, అద్దె ఇంట్లో ఉన్నవాళ్లు ఈ స్కీమ్‌లో చేరడానికి అనర్హులు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

ఇలా తినండి బరువు తగ్గండి

ప్రతి ఇద్దరిలో ఒకరు స్థూలకాయానికి గురవుతున్నారు. అందుకు కారణం అనారోగ్యకరపు ఆహారపు అలవాట్లు, జీవనశైలి సరిగా లేకపోవడం. ఊబకాయం నుంచి బయట పడేందుకు చాలా మంది డైటింగ్ తో పాటు వ్యాయామశాలలో గంటల తరబడి గడుపుతున్నారు. అల్పాహారం స్కిప్ చేయడం చేస్తున్నారు. అది చాలా పెద్ద తప్పు. బ్రేక్ ఫాస్ట్ మానేయడం వల్ల బరువు తగ్గడానికి బదులు పెరుగుతారని ఎక్కువ మందికి తెలియదు. అల్పాహారం రోజులోని ముఖ్యమైన భోజనాలలో ఒకటి. దానిని నివారించడానికి బదులుగా తినాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. రోజంతా యాక్టివ్ గా ఉండేందుకు శక్తిని ఇస్తుంది. ఇది చేయకపోవడం వల్ల అతిగా తినాలనే కోరికలు పెరుగుతాయి. ఫలితంగా బరువు పెరుగుతారు. మీరు బరువు తగ్గేందుకు చూస్తున్న వాళ్లయితే మీ అల్పాహారంలో వీటిని చేర్చుకోండి. సులభంగా తగ్గిపోతారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

భారతీయ వంటకాలపై ఎలాన్‌ మస్క్‌ కామెంట్‌

ప్రపంచ స్థాయి కంపెనీలు నడుపుతూ ఎంత ఒత్తిడిలో ఉన్నా, తన హాస్య చతురతను మాత్రం ఎలాన్‌ మస్క్‌ వదిలి పెట్టరు. చిత్రమైన హావాభావాలు, విచిత్రమైన కామెంట్లతో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. ఇటీవల, భారతీయ వంటకాలపై తన మనసులో మాటను మస్క్‌ మామ బయటపెట్టారు. ఇండియన్‌ ఫుడ్‌ గురించి ట్విట్టర్‌ వేదికగా ఒక్క ముక్కలో స్పందించారు. ఆ ఒక్క మాట ప్రబంజనంలా ప్రపంచాన్ని చుట్టేసింది. ఆ తర్వాత చూడాలి సందడి. కొన్ని గంటల్లోనే లక్షలాది మంది లైన్‌లోకి వచ్చారు, తమ అభిప్రాయాలతో కామెంట్‌ బాక్స్‌ను నింపేశారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

మొహిసిన్‌ మాయ

కఠిన పిచ్‌పై లక్నో సూపర్‌ జెయింట్స్‌ అదరగొట్టింది! ప్లేఆఫ్ రేసులో మరింత ముందుకెళ్లింది. భీకరమైన ముంబయి ఇండియన్స్‌ను వెనక్కి నెట్టింది. చావోరేవోగా మారిన మ్యాచులో 177 స్కోర్‌ను డిఫెండ్‌ చేసుకుంది. హిట్‌మ్యాన్‌ సేనను 172/5కి పరిమితం చేసింది. ఇషాన్‌ కిషన్‌ (59; 39 బంతుల్లో 8x4, 1x6), రోహిత్‌ శర్మ (37; 25 బంతుల్లో 1x4, 3x6) అదరగొట్టారు. ఆఖర్లో టిమ్‌ డేవిడ్‌ (32*; 19 బంతుల్లో 1x4, 3x6) భయపెట్టాడు. అంతకు ముందు ఎల్‌ఎస్‌జీలో మార్కస్‌ స్టాయినిస్‌ (89*; 47 బంతుల్లో 4x7, 8x6) విశ్వరూపం ప్రదర్శించాడు. కృనాల్‌ పాండ్య (49; 42 బంతుల్లో 1x4, 1x6) అతడికి అండగా నిలిచాడు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Dilawarpur Latest News: ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
Dilawarpur Latest News: ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి, 14 మందికి అస్వస్థత 
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి, 14 మందికి అస్వస్థత 
TG High Court: మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని ఆక్షేపణ 
మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని ఆక్షేపణ 
Revanth Reddy: తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dilawarpur Latest News: ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
Dilawarpur Latest News: ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి, 14 మందికి అస్వస్థత 
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి, 14 మందికి అస్వస్థత 
TG High Court: మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని ఆక్షేపణ 
మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని ఆక్షేపణ 
Revanth Reddy: తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
Andhra Adani Issue: జగన్‌తో పాటు షర్మిలదీ అదే సవాల్ - చంద్రబాబు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు ?
జగన్‌తో పాటు షర్మిలదీ అదే సవాల్ - చంద్రబాబు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు ?
Pawan Kalyan Met With Modi:  ప్రధానమంత్రి మోదీతో పవన్ కల్యాణ్ సమావేశం- చర్చించిన అంశాలు ఇవే
ప్రధానమంత్రి మోదీతో పవన్ కల్యాణ్ సమావేశం- చర్చించిన అంశాలు ఇవే
Brahmamudi Maanas Nagulapalli: కొడుక్కి రామ్ చరణ్ మూవీ పేరు పెట్టిన 'బ్రహ్మముడి' మానస్.. ఫొటోస్ చూశారా!
కొడుక్కి రామ్ చరణ్ మూవీ పేరు పెట్టిన 'బ్రహ్మముడి' మానస్.. ఫొటోస్ చూశారా!
Narayanpet News Today: నారాయణపేట జిల్లా మాగనూర్‌లో 144 సెక్షన్- ప్రతిపక్ష నేతలు, విద్యార్థి సంఘాల ముందస్తు అరెస్టు
నారాయణపేట జిల్లా మాగనూర్‌లో 144 సెక్షన్- ప్రతిపక్ష నేతలు, విద్యార్థి సంఘాల ముందస్తు అరెస్టు
Embed widget