News
News
వీడియోలు ఆటలు
X

Elon Musk: భారతీయ వంటకాల గురించి ఒక్క ముక్కలో చెప్పాడు - అంతే, కామెంట్ల వరద పారింది

కొన్ని గంటల్లోనే లక్షలాది మంది లైన్‌లోకి వచ్చారు, తమ అభిప్రాయాలతో కామెంట్‌ బాక్స్‌ను నింపేశారు.

FOLLOW US: 
Share:

Elon Musk on Indian Food: ప్రపంచ స్థాయి కంపెనీలు నడుపుతూ ఎంత ఒత్తిడిలో ఉన్నా, తన హాస్య చతురతను మాత్రం ఎలాన్‌ మస్క్‌ వదిలి పెట్టరు. చిత్రమైన హావాభావాలు, విచిత్రమైన కామెంట్లతో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. ఇటీవల, భారతీయ వంటకాలపై తన మనసులో మాటను మస్క్‌ మామ బయటపెట్టారు. ఇండియన్‌ ఫుడ్‌ గురించి ట్విట్టర్‌ వేదికగా ఒక్క ముక్కలో స్పందించారు. ఆ ఒక్క మాట ప్రబంజనంలా ప్రపంచాన్ని చుట్టేసింది. ఆ తర్వాత చూడాలి సందడి. కొన్ని గంటల్లోనే లక్షలాది మంది లైన్‌లోకి వచ్చారు, తమ అభిప్రాయాలతో కామెంట్‌ బాక్స్‌ను నింపేశారు.

కేవలం ఒక్క పదంతో రిప్లై
ట్విట్టర్‌లో ఎలాన్‌ మస్క్‌ను ఫాలో అయ్యే ఒక వ్యక్తి, ఇండియన్‌ ఫుడ్‌ ఫొటోను షేర్‌ చేశాడు. తనకు భారతీయ వంటకాలంటే చాలా ఇష్టమని, అవి చాలా చాలా బాగుంటాయని ట్వీట్‌ చేశాడు. బటర్‌ చికెన్‌, నాన్‌, అన్నం ఉన్న ఒక ఫొటోను ఆ ట్వీట్‌కు జత చేశాడు. ఆ ఫోటో ఎలాన్‌ మస్క్‌ కంట్లో పడింది. మీరు చెప్పింది "వాస్తవం" ("True") అంటూ మస్క్‌ మామ ఆ ట్వీట్‌కు రిప్లై ఇచ్చారు. కేవలం ఒక్క పదంతో రిప్లై ఇచ్చినా, ఎలాన్‌ మస్క్‌ ప్రశంసలు అందుకోవడంతో ఆ ఫోటో వైరల్‌గా మారింది.

బటర్ చికెన్, నాన్, రైస్, షాంపైన్, బీర్, వాటర్ గ్లాసులతో నోరూరించే స్ప్రెడ్‌ ఉన్న ఆ పోస్ట్‌ వేలాది లైక్‌లు, రీట్వీట్‌లను సంపాదించింది. 35 లక్షలకు మందికి పైగా దానిని చూశారు. మస్క్ ప్రతిస్పందనను కూడా 30 లక్షల మందికి పైగా ప్రజలు వీక్షించారు. ఇండియన్‌ ఫుడ్‌ను తాము కూడా రుచి చూశామని, అవి చాలా బాగుంటాయని రిప్లై ఇచ్చారు. మస్క్‌ మామకు మంచి టేస్ట్‌ ఉందంటూ ప్రశంసల జల్లు కురిపించారు. ఇలాంటి కామెంట్లతో వేలాది మంది మస్క్‌ ట్వీట్‌ను రీట్వీట్ చేశారు, రిప్లైలు ఇచ్చారు.

భారత్‌ రావాలంటూ మస్క్‌కు ఆహ్వానాలు
మస్క్‌ రిప్లై తర్వాత చాలామంది భారతీయులు కూడా స్పందించారు. జమ్మూకి చెందిన ఒక ట్విట్టర్‌ యూజర్‌, రాజ్మా చావల్‌ బాగుంటుందని సూచించారు. ఆ ఫోటోలో ఆల్కహాల్ లేకపోవడం పట్ల మరొకరు నిరాశ వ్యక్తం చేశారు. సాధారణంగా, భారతీయులు తమ ఆహారంతో నీరు, మజ్జిగ లేదా లస్సీని తీసుకుంటారని ఇంకొకరు కామెంట్‌ చేశారు. భారతీయ వంటకాల పేర్లు, రుచి గురించి చాలామంది తమ ట్వీట్లలో వివరించారు. భారత్‌కు వచ్చి తమ వంటకాలు రుచి చూడాలంటా చాలామంది మస్క్‌ను ఆహ్వానించారు, త్వరలో ఇండియా టూర్‌ ప్లాన్‌ చేసుకోవాలని సూచించారు.

నటుడు రణవీర్ షోరే కూడా ఈ పోస్ట్‌పై ఒక కామెంట్‌ చేశారు. "గొప్పలు చెప్పడం కాదు, కానీ భారతీయ వంటకాలు ప్రపంచంలోనే అత్యంత వైవిధ్యమైనవి, అభివృద్ధి చెందినవి" అని ట్వీట్‌లో పేర్కొన్నాడు. చాలామంది నటీనటులు కూడా ఈ పోస్ట్‌పై స్పందించారు.

మస్క్‌ ట్వీట్‌ పట్ల మరికొందరు విచిత్రంగా స్పందించారు. ట్విట్టర్‌ CEO బాధ్యతలను లిండా యాకారినోకు బదిలీ చేయడం వల్ల మస్క్‌ ఇప్పుడు ఖాళీగా ఉన్నారని, ఇతరుల పోస్ట్‌లు చూసి రిప్లై ఇచ్చేంత సమయం దొరికిందంటూ సరదా కామెంట్లు చేశారు. 

భారతీయ వంటకాలకు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు, వీళ్లలో ప్రపంచ ప్రసిద్ధ ప్రముఖులు కూడా ఉన్నారు. వాళ్లందరి పేర్లు చెప్పాలంటే చాంతాడంత లిస్ట్‌ తయారవుతుంది కాబట్టి ఇక్కడ చెప్పడం లేదు.

ఇది కూడా చదవండి: హౌస్‌ లోన్‌ తీసుకోవచ్చు, తిరిగి కట్టాల్సిన పని లేదు - నిజంగా ఇలాంటి స్కీమ్‌ ఉంది 

Published at : 16 May 2023 09:16 PM (IST) Tags: Indian food Viral Photo Elon Musk Tweet

సంబంధిత కథనాలు

Upcoming Cars: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!

Upcoming Cars: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!

TDS: ఏ పోస్టాఫీసు పథకాల్లో TDS కట్‌ అవుతుంది, వేటికి మినహాయింపు ఉంది?

TDS: ఏ పోస్టాఫీసు పథకాల్లో TDS కట్‌ అవుతుంది, వేటికి మినహాయింపు ఉంది?

Form 16: ఇంకా ఫామ్‌-16 అందలేదా?, ఆన్‌లైన్‌లో చూసే ఆప్షన్‌ కూడా ఉంది

Form 16: ఇంకా ఫామ్‌-16 అందలేదా?, ఆన్‌లైన్‌లో చూసే ఆప్షన్‌ కూడా ఉంది

EPFO: 6 కోట్ల మంది సబ్‌స్క్రైబర్‌లకు EPFO మెసేజ్‌లు, అందులో ఏం ఉంది?

EPFO: 6 కోట్ల మంది సబ్‌స్క్రైబర్‌లకు EPFO మెసేజ్‌లు, అందులో ఏం ఉంది?

Youngest Billionaire: లైఫ్‌లో రిస్క్‌ చేయకపోతే మిగిలేది రస్కే - యంగెస్ట్‌ బిలియనీర్ సలహా

Youngest Billionaire: లైఫ్‌లో రిస్క్‌ చేయకపోతే మిగిలేది రస్కే - యంగెస్ట్‌ బిలియనీర్ సలహా

టాప్ స్టోరీస్

Telugu Indian Idol 2 Winner : అమ్మకు 'ఆహా' తెలుగు ఇండియన్ ఐడల్ 2 కిరీటం - విజేతను ప్రకటించిన అల్లు అర్జున్

Telugu Indian Idol 2 Winner : అమ్మకు 'ఆహా' తెలుగు ఇండియన్ ఐడల్ 2 కిరీటం - విజేతను ప్రకటించిన అల్లు అర్జున్

KCR In Nirmal: నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వ‌రాలు- ఒక్కో మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షలు

KCR In Nirmal: నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వ‌రాలు- ఒక్కో మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షలు

Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్

Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్

Tom Holland on RRR: స్పైడర్ మ్యాన్ కూడా 'ఆర్ఆర్ఆర్' అభిమానే, సినిమా అద్భుతం అంటూ ప్రశంసలు!

Tom Holland  on RRR: స్పైడర్ మ్యాన్ కూడా 'ఆర్ఆర్ఆర్' అభిమానే, సినిమా అద్భుతం అంటూ ప్రశంసలు!