అన్వేషించండి

Morning News: దూసుకొస్తున్న వాయుగుండం- చంద్రబాబుకు బిగ్ రిలీఫ్‌ ఇచ్చిన ఈడీ- మార్నింగ్ టాప్ న్యూస్

Top 10 Headlines Today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయవ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తల సమాహారం ఇక్కడ చూడొచ్చు.

Today's Top 10 News: 

వాన గండం 

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం నెల్లూరు, చెన్నైకు సమీపంలో కేంద్రీకృతమై ఉంది. ఇది గురువారం ఉదయం తీరం దాటే అవకాశం ఉంది. వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తాతోపాటు సీమలోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన ఉంది, వాతావరణ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

మ్యాచ్‌పై వాన ఎఫెక్ట్

వాయుగుండం ప్రభావం తమిళనాడుపై గట్టిగానే ఉంది. దాదాపు 12 జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. చెన్నైతోపాటు చుట్టుపక్కల జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. చెన్నైలో రాత్రి నుంచి కురుస్తున్న కండపోత వానకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మరోవైపు బెంగళూరులో కూడా వాన జల్లులు కురుస్తున్నాయి. దీంతో భారత్, న్యూజిలాండ్ ధ్య జరగాల్సిన మ్యాచ్‌పై ప్రభావం పడింది.  మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

రెండు లక్ష్యాలతో ఇందిరిమ్మ గ్రామ కమిటీలు

స్థానిక సంస్థల ఎన్నికల నాటికి రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఇందిరమ్మ కమిటీల ద్వారా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య గ్యాప్‌ ఫిల్ చేయడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కూడా ప్లాన్ చేస్తున్నారు. మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

చంద్రబాబుకు బిగ్ రిలీఫ్

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రికి బిగ్‌ రిలీఫ్ లభించినట్టే కనిపిస్తోంది. స్కిల్ స్కామ్‌లో విచారణ చేసిన ఈడీ కీలక అప్‌డేట్ ఇచ్చింది. నిధుల డైవర్షన్ విషయంలో బాబు ప్రమేయం లేదని తేల్చింది. మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

కేటీఆర్‌పై ఎఫ్‌ఐఆర్

మూసీ ప్రాజెక్టు విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై కేసు నమోదు అయింది. కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ ఆత్రం సుగుణక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అక్టోబర్ 3న ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

నంబాళ్ల కేశవరావు క్షేమమేనా!

ఇంతకీ నంబాళ్ల కేశవరావు ఉన్నట్టే మృతి చెందినట్టా.. మొన్నఛత్తీస్‌గఢ్‌లో జరిగిన కాల్పుల్లో మృతి చెందారని పుకార్లు చెలరేగాయి. అయిత మావోయిస్టులు ప్రకటించిన మృతుల జాబితాలో ఆయన పేరు లేకపోవడంతో ఎక్కడ ఉన్నారనే చర్చ మొదలైంది. ఆయన సొంతూరులో కూడా అలజడి రేగింది. మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

పవన్ స్పీడ్‌తో స్లో అయిన బీజేపీ 

సనాతన ధర్మ పరిరక్షణ పేరుతో సంచలనం సృష్టించిన పవన్ కల్యాణ్ బీజేపీకి అజెండా లేకుండా చేశారు. వాళ్ల హిందుత్వ అజెండాను లాక్కోవడంతో వాళ్లకు మాట్లాడే స్కోప్ లేకుండా పోయింది. ఏం మాట్లాడినా పవన్‌కు అనుకూలంగానో లేకుంటే ఆయన్ని ఫాలో అవుతూ మాట్లాడినట్టో ఉంటుందని సైలెంట్‌ అయిపోయారు. మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రియాంక

కాంగ్రెస్ సీనియర్ ప్రియాంక వాద్రా తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నారు కేరళలోని వయనాడ్‌ నుంచి ఆమె పోటీ చేయబోతోందని కాంగ్రెస్ ప్రకటించింది. మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

సైబర్ నేరాలపై రష్మిక ఫైట్

సైబర్ నేరాలపై యుద్ధం ప్రకటించింది నటి రష్మిక మందన్న. సైబర్ నేరగాళ్ల వలకు చిక్కకుండా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సిద్ధమైంది. ఒకప్పుడు ఒకప్పుడు డీప్ ఫేక్ బారిన పడి రష్మిక ఇబ్బంది పడింది. మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అఖండ తాండవం

బాలయ్య, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో నాల్గో సినిమా స్టార్ట్ అయింది. 2021లో వచ్చి సంచలన హిట్ కొట్టిన అఖండ సినిమాకు సీక్వెల్‌గా బీబీ4 షూటింగ్ ఇవాళ్టి నుంచి ప్రారంభమైంది. మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: 'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
KCR News: తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు హాజరు కావాలని కేసీఆర్ కు ఆహ్వానం, బీఆర్ఎస్ బాస్ వస్తారా?
తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు హాజరు కావాలని కేసీఆర్ కు ఆహ్వానం, బీఆర్ఎస్ బాస్ వస్తారా?
Earthquake: తెలంగాణలో మరోసారి భూ ప్రకంపనలు - మహబూబ్‌నగర్ జిల్లాలో భూకంప కేంద్రం
తెలంగాణలో మరోసారి భూ ప్రకంపనలు - మహబూబ్‌నగర్ జిల్లాలో భూకంప కేంద్రం
Best Gaming Laptops: అమెజాన్‌లో మంచి డిస్కౌంట్ ఉన్న బెస్ట్ గేమింగ్ ల్యాప్‌టాప్స్ ఇవే - లిస్ట్‌లో హెచ్‌పీ, లెనోవో కూడా!
అమెజాన్‌లో మంచి డిస్కౌంట్ ఉన్న బెస్ట్ గేమింగ్ ల్యాప్‌టాప్స్ ఇవే - లిస్ట్‌లో హెచ్‌పీ, లెనోవో కూడా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఏపీలో వాట్సప్ గవర్నెన్స్, ఏందుకో చెప్పిన చంద్రబాబుమళ్లీ కెలుక్కున్న వేణుస్వామి, అల్లు అర్జున్ జాతకం కూడాSiraj Throw ball to Marnus Labuschagne | లబుషేన్ పై బాల్ గిరాటేసిన సిరాజ్ | ABP DesamAus vs Ind 2nd Test Day 1 Highlights | రెండో టెస్టులో టీమిండియాను ఆడేసుకుంటున్న ఆస్ట్రేలియా | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: 'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
KCR News: తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు హాజరు కావాలని కేసీఆర్ కు ఆహ్వానం, బీఆర్ఎస్ బాస్ వస్తారా?
తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు హాజరు కావాలని కేసీఆర్ కు ఆహ్వానం, బీఆర్ఎస్ బాస్ వస్తారా?
Earthquake: తెలంగాణలో మరోసారి భూ ప్రకంపనలు - మహబూబ్‌నగర్ జిల్లాలో భూకంప కేంద్రం
తెలంగాణలో మరోసారి భూ ప్రకంపనలు - మహబూబ్‌నగర్ జిల్లాలో భూకంప కేంద్రం
Best Gaming Laptops: అమెజాన్‌లో మంచి డిస్కౌంట్ ఉన్న బెస్ట్ గేమింగ్ ల్యాప్‌టాప్స్ ఇవే - లిస్ట్‌లో హెచ్‌పీ, లెనోవో కూడా!
అమెజాన్‌లో మంచి డిస్కౌంట్ ఉన్న బెస్ట్ గేమింగ్ ల్యాప్‌టాప్స్ ఇవే - లిస్ట్‌లో హెచ్‌పీ, లెనోవో కూడా!
Ambulance Theft: రోగిని తరలిస్తూనే అంబులెన్స్ చోరీ - హైవేపై ఛేజ్ చేసి మరీ పట్టుకున్న పోలీసులు, వైరల్ వీడియో
రోగిని తరలిస్తూనే అంబులెన్స్ చోరీ - హైవేపై ఛేజ్ చేసి మరీ పట్టుకున్న పోలీసులు, వైరల్ వీడియో
Hyderabad:  హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో  మల్టీలెవల్ ఫ్లైఓవర్స్ - షాంఘై లుక్ వచ్చేస్తుందా ?
హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో మల్టీలెవల్ ఫ్లైఓవర్స్ - షాంఘై లుక్ వచ్చేస్తుందా ?
RGV Review On Pushpa 2: ఇన్నోసెంట్, కన్నింగ్, సూపర్ ఈగో... 'పుష్ప 2', పుష్ప రాజ్ పాత్రపై ఆర్జీవి రివ్యూ
ఇన్నోసెంట్, కన్నింగ్, సూపర్ ఈగో... 'పుష్ప 2', పుష్ప రాజ్ పాత్రపై ఆర్జీవి రివ్యూ
Borugadda Anil: సీతయ్య సినిమాలో విలన్లను తిప్పినట్లు తిప్పుతున్నారుగా - బోరుగడ్డ అనిల్ ఈ సారి అనంతపురం షిప్ట్ !
సీతయ్య సినిమాలో విలన్లను తిప్పినట్లు తిప్పుతున్నారుగా - బోరుగడ్డ అనిల్ ఈ సారి అనంతపురం షిప్ట్ !
Embed widget