అన్వేషించండి

KTR FIR News: ఉట్నూర్ పోలీస్ స్టేషన్ లో కేటీఆర్ పై కేసు నమోదు

FIR registered against KTR : మూసీ నది ప్రాజెక్టులో రూ.1.5 లక్షల కోట్ల కుంభకోణం జరుగుతోందని, ఢిల్లీకి డబ్బుల కట్టలు పంపించడమే కాంగ్రెస్ ఉద్దేశమని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదు అయింది.

Case Filed Against KTR | ఉట్నూర్: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ పోలీస్ స్టేషన్ లో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కేసు నమోదయింది. మూసీ ప్రాజెక్ట్ లో రూ.1.5 లక్షల కోట్ల కుంభకోణం, ఇందులో ₹25000 కోట్లు ఢిల్లీకి పంపారు అని ఇటీవల కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలపై ఆదిలాబాద్‌ జిల్లాలోని ఉట్నూర్ పోలీస్ స్టేషన్‌లో కేటీఆర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. సెక్షన్ 352, 353(2), 356(2) BNS కింద కేసులు నమోదయ్యాయి. 

కేటీఆర్ పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన ఆత్రం సుగుణక్క

కాంగ్రెస్ పార్టీపై ప్రతికార ప్రచారం చేస్తున్న బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పై చర్యలు తీసుకోవాలని ఉట్నూర్ పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ ఆత్రం సుగుణక్క అక్టోబర్ 3న ఫిర్యాదు చేశారు. ఎట్టకేలకు అక్టోబర్ 14వ తేదీన కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ నమోదు అయింది.

రాబోయే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు నేరపూరిత కుట్ర,నిరాధారమైన,నిర్లక్ష్య పూరిత ఆరోపణలు కేటీఆర్ చేస్తున్నారని, నవంబర్ 2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో భారత రాష్ట్ర సమితిని ఓడించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో ప్రజా పాలన కొనసాగటాన్ని బిఆర్ఎస్ నాయకులు ఓర్వలేక పోతున్నారని, మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయటం, హైడ్రా విషయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఆరోపణలు చేయటాన్ని ఖండిస్తూ... రాష్ట్ర పాలనలో రాహుల్ గాంధీ ప్రస్తావన తేవడం కేటీఆర్ అవివేకానికి నిదర్శనం అని సుగుణక్కఅన్నారు.

మూసీ ప్రక్షాళన విషయంలో బిఆర్ఎస్ నేతలు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, మూసినది ప్రక్షాళన కోసం ఇంకా డిపిఆర్ రూపొందించలేదని, అవినీతి ఎలా జరుగుతుందని ఆమె ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీపై అనవసర ఆరోపణలు చేసి మహారాష్ట్రలో జరిగే ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని, కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను తగ్గించే ఉద్దేశంతో స్వార్థ రాజకీయ ప్రయోజనాలకోసం బిఆర్ఎస్ పార్టీ కుట్ర పన్నుతుందని, వారు చేస్తున్న కుట్రను మహారాష్ట్ర ప్రజలు తిప్పికొడతారని స్పష్టం చేశారు.

Also Read: Telangana News: సీఎం రేవంత్ రెడ్డిపై ప్రధాని మోదీకి ఫిర్యాదు, అసలేం జరిగింది?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Ind Vs Aus Test Series: నేటి నుంచే భారత్ - ఆసీస్ మూడో టెస్టు - టీమిండియాలో మార్పులు!
నేటి నుంచే భారత్ - ఆసీస్ మూడో టెస్టు - టీమిండియాలో మార్పులు!
Jagan For Arjun: అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపుఆ ఒక్క నిర్ణయమే అల్లు అర్జున్ అరెస్ట్ వరకూ వచ్చిందా..?అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో కన్నీళ్లు పెట్టున్న స్నేహపాతిక లక్షల పరిహారం ఇచ్చినా అరెస్ట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Ind Vs Aus Test Series: నేటి నుంచే భారత్ - ఆసీస్ మూడో టెస్టు - టీమిండియాలో మార్పులు!
నేటి నుంచే భారత్ - ఆసీస్ మూడో టెస్టు - టీమిండియాలో మార్పులు!
Jagan For Arjun: అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
2024 Flashback: గ్రేట్ ఇయర్ - ఈ ఏడాది తండ్రులుగా మారిన క్రికెటర్లు వీరే!
గ్రేట్ ఇయర్ - ఈ ఏడాది తండ్రులుగా మారిన క్రికెటర్లు వీరే!
Google Pay Transaction Delete: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!
గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!
Allu Arjun Bail: చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
Skoda Kylaq: 10 రోజుల్లో 10 వేల బుకింగ్స్ - మార్కెట్లో దూసుకుపోతున్న స్కోడా కైలాక్!
10 రోజుల్లో 10 వేల బుకింగ్స్ - మార్కెట్లో దూసుకుపోతున్న స్కోడా కైలాక్!
Embed widget