Weather Today: చెన్నైకు రెడ్ అలర్ట్; బెంగుళూరులో చిరు జల్లులు; భారత్- న్యూజిలాండ్ మ్యాచ్‌పై అనుమానం
Today Weather Report: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండంతో చెన్నైలో కుండపోత వర్షాలు పడుతున్నాయి. బెంగళూరులో చిరు జల్లులు పడే అవకాశం ఉంది. దీంతో భారత్, కివీస్ టెస్టు మ్యాచ్‌కు ఆటంకం కలగనుంది.
Today Weather: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం బలపడి వాయుగుండంగా(Weather Today) మారింది. ఇది చెన్నైకి తూర్పు-ఆగ్నేయంగా 490 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది పశ్చిమ వాయువ్య దిశలో కదులుతూ దక్షిణ ఆంధ్రప్రదేశ్(AP Weather), ఉత్తర తమిళనాడు(Tamil Nadu Weather)పై ప్రభావం చూపుతోంది. ఇది గురువారం తెల్లవారుజామున పుదుచ్చేరి, నెల్లూరు(Nellore Weather) మధ్య చెన్నైకి సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
తీరం దాటే టైంలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఆ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. ఈ అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలతోపాటు కర్ణాటక, తమిళనాడులో జోరుగా వానలు పడుతున్నాయి. తుపాను కారణంగా చెన్నై(Chennai Weather) ఎడతెరిపిలేకుండా వానలు పడుతున్నాయి. బెంగళూరు(Bengaluru Weather)లో ప్రస్తుతానికి వర్షం లేకపోయినా ఆకాశం మేఘావృతమై ఉంది. చెన్నైతోపాటు తమిళనాడులోని దాదాపు 12 జిల్లాల్లో వానలు దంచికొడుతున్నాయి.
చెన్నైలో వాతావరణం(Chennai Weather Report)
రాత్రి నుంచి చెన్నైలో జోరుగా వాన పడుతోంది. చెన్నైతోపాటు పొరుగు జిల్లాల్లో ఉదయం 10 గంటల వరకు వర్షం భారీగా కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. చెన్నై, చెంగల్‌పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు, రాణిపేట్, వెల్లూరు, తిరుపత్తూరు, తిరువణ్ణామలై, విల్లుపురం, తేని జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉంటుందని తెలియజేశారు అధికారులు. ప్రస్తుతం చెనైలో కొన్ని ప్రాంతాల్లో కంటిన్యూగా వర్షాలు పడుతున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో చిరు జల్లులు కురుస్తున్నాయి. చుట్టుపక్కల జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉంది. ఉష్ణోగ్రత 24-27 సెల్సియస్ మధ్య ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. చెన్నైకు వచ్చే విమానాలను దారి మళ్లించారు. చెనై ఎయిర్ పోర్టులో ఉండే విమానాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గ్యాప్ ఇవ్వకుండా చెన్నైలో పడుతున్న వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. రాత్రి కొన్ని ప్రాంతాల్లో సీఎం స్టాలిన్ తిరిగారు. అక్కడ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు.
తమిళనాడులో ఈ జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు
కురుస్తున్న వర్షాలు కారణంగా తమిళనాడులోని 12 జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆయా ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుందని తెలిపింది. ఈదురుగాలులు కూడా వీస్తాయని తెలియజేసింది. వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలతో చెన్నై, బెంగళూరులోని విద్యాసంస్థలకు ఇవాళ, రేపు అధికారులు సెలవులు ప్రకటించారు. ఈ రెండు నగరాలతోపాటు వాయుగుండం ప్రభావం ఉన్న జిల్లాల్లో ఈ నిర్ణయం తీసుకున్నారు చెన్నై, కాంచీపురం, చెంగల్‌పట్టు, తిరువళ్లూరు, రాణిపేట, సేలం, విల్లుపురం, కృష్ణగిరి, ధర్మపురి, కళ్లకురిచ్చి, కడలూరు, తిరువణ్ణామలై జిల్లా, పుదుచ్చేరి, కారైకల్‌లోని పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు.
బెంగళూరులో వాతావరణం ఎలా ఉంది?(Bangalore Weather)
బెంగళూరులో ఇవాళ ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరిగే తొలి టెస్టు మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతానికి వర్షం లేకపోయినా వర్షాలు పడే అవకాశం మాత్రం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. 16, 17,18 మూడు రోజుల పాటు ఆకాశం మేఘావృతమై ఉంటుందని, చెదురుమదులు జల్లులు పడే ఛాన్స్ ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. 19, 20 తేదీల్లో మాత్రం వర్షాలు ఖాయమని స్పష్టం చేశారు. అందుకే మ్యాచ్ జరగడంపై అనుమానాలు నెలకొన్నాయి.