Top 10 Headlines Today: కర్ణాటక ఫలితంతో టీ కాంగ్రెస్‌లో ఫుల్ జోష్ - నేటి టాప్ 10 న్యూస్ చూడండి
తెలుగు రాష్ట్రాలు సహా జాతీయ వ్యాప్తంగా చోటు చేసుకున్న తాజా టాప్ 10 న్యూస్ మీకోసం..
బీజేపీని ఆదరించని తెలుగు ఓటర్లు
కర్ణాటక ఎన్నికల్లో తెలుగు వచ్చిన , తెలుగు మాట్లాడే ఓటర్లు కీలకం అయ్యారని మొదటి నుంచి విస్తృతంగా ప్రచారం జరుగుతూనే ఉంది. వారిని ఆకట్టుకోవడానికి విస్తృతంగా రాజకీయ పార్టీలు ప్రయత్నించాయి. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి నేతల్ని పంపి ప్రచారం చేయించారు. అయితే భారతీయ జనతా పార్టీపై అధికార వ్యతిరేకత బాగా కనిపించింది. మరోసారి ఆ ప్రభుత్వం వద్దని తెలుగు వాళ్లుకూడా అనుకున్నారు. అందుకే బీజేపీకి తెలుగు వాళ్లు ఎక్కువగా ఉన్న సరిహద్దు ప్రాంతాల్లో పెద్దగా సీట్లు రాలేదు. ఇంకా చదవండి
ఇక కాంగ్రెస్‌లో చేరికలు ఉంటాయా ?
కర్ణాటక ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం నింపుతున్నాయి. ఈ ఫలితాల తర్వాత తెలంగాణ బీజేపీకి జై కొడదామనుకున్న చాలా మంది నేతల అడుగులు కాంగ్రెస్ వైపు పడే అవకాశం కనిపిస్తోంది. అందరికంటే ముఖ్యంగా బీఆర్‌ఎస్ నుంచి సస్పెండైన జూపల్లి, పొంగులేటి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. కర్ణాటక ఎన్నికలఫలితాల తర్వాత జూపల్లి, పొంగులేటి బీజేపీలో చేరాలని డిసైడ్ అయ్యారు. వారం క్రితం ఖమ్మంలో బీజేపీ నేతలు పొంగులేటితో సుదీర్ఘ చర్చల తర్వాత కాంగ్రెస్ లో చేరాలనుకున్న ఆలోచన విరమించుకుని ఇద్దరూ బీజేపీలో చేరేందుకు చర్చలు జరిపారు. ఇంకా చదవండి
కర్ణాటక సీఎం పదవిపై కాంగ్రెస్ ఫార్ములా రెడీ - సిద్దూ, శివకుమార్‌లలో ఎవరికి చాన్స్ అంటే ?
కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ.. అధికారానికి కావాల్సిన పూర్తి మెజార్టీ సాధించింది. మ్యాజిక్ ఫిగర్ 113కు మించి.. అత్యధిక సీట్లలో గెలుపొందారు కాంగ్రెస్ అభ్యర్థులు. 130 సీట్లలో విజయం ఖాయంగా ఉంది. విక్టరీ వన్ సైడ్ కావటంతో.. కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం కొత్త సీఎం ఎవరు అనే అంెసంపై మేధోమథనం జరుపుతోంది. ప్రస్తుతం ఇద్దరు అగ్రనేతలు పోటీలో ఉన్నారు. ఒకరు మాజీ సీఎం సిద్దరామయ్య.. మరొకరు పీసీసీ చీఫ్ డీకే శివకుమార్. ఇద్దరూ కలిసి కాంగ్రెస్ పార్టీకి బంపర్ మెజార్టీ తీసుకురావటంలో తీవ్రంగా కృషి చేశారు. ఇంకా చదవండి
వాపును చూసి బలుపు అనుకోవద్దు, పగటి కలలు కంటున్నారు - కర్ణాటక రిజల్ట్‌పై మంత్రి వేముల
అభివృద్ధి మరిచి మతాలు, దేవుని పేరుతో రాజకీయాలు చేస్తున్న బీజేపీ పట్ల యావత్ దేశ ప్రజలు విసుగు చెందారనెందుకు కర్ణాటక ఎన్నికల ఫలితాలే నిదర్శనమని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ ను తిరస్కరించి కర్ణాటక ప్రజలు బీజేపీ కి చెంపదెబ్బలాంటి తీర్పు ఇచ్చారని అన్నారు. బీజేపీ 40 శాతం కమీషన్ అవినీతి పాలన ఓ వైపు అయితే, మరోవైపు ప్రభుత్వరంగ సంస్థలు అమ్ముతూ.. దేశ సంపద అంతా మోదీ దోస్త్ అదానీకి దారాదత్తం చేశాయని విమర్శించారు. అక్రమంగా వచ్చిన సొమ్ముతో ప్రభుత్వాలను కూలుస్తూ నీచాతినీచ రాజకీయాలకు ఒడిగట్టారని ధ్వజమెత్తారు. ఇంకా చదవండి
కర్ణాటక ఎన్నికల ఫలితాల నుంచి తెలుగు రాష్ట్రాల సీఎంలు నేర్చుకోవాల్సిన పాఠం ఇదే!
కర్ణాటక ఎన్నికలు అధికార పార్టీ నేతలకు ఒక ముఖ్యమైన పాఠాన్ని తెలిపాయి అనడం లో ఎలాంటి అనుమానం లేదు. ఎన్నికలకు ముందు పలు దఫాల్లో అభ్యర్థుల లిస్ట్ లను విడుదల చేసిన బీజేపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందంటూ చాలా మంది అభ్యర్థులను మార్చేసింది. సిటింగ్ ఎమ్మెల్యే లను సైతం పక్కన పెట్టింది. నిజానికి ఎన్నికలకు చాలా కాలం ముందు నుంచే రూలింగ్ పార్టీ బీజేపీపై కర్ణాటకలో వ్యతిరేకత బలంగా వినిపిస్తుండడంతో ముందు జాగ్రత్తగా ఇలా సాంప్రదాయ అభ్యర్థుల స్థానంలో కొత్త మఖాలను తెర మీదకు తెచ్చింది. దీనివల్ల వ్యతిరేకత ఎదుర్కొటుంది అభ్యర్థులే తప్ప ప్రభుత్వం కాదు అనే సంకేతాల్ని పంపే ప్రయత్నం చేసింది. ఇంకా చదవండి
ఉస్తాద్ భగత్ సింగ్, గబ్బర్ సింగ్, డీజేదీ సేమ్ నంబర్ - 2425 మేటర్ ఏంటంటే?
ఇప్పుడు యూట్యూబ్ అంతా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మేనియా కనబడుతోంది. ఆయన కథానాయకుడిగా నటించిన 'ఉస్తాద్ భగత్ సింగ్' (Ustaad Bhagat Singh) గ్లింప్స్ టాప్ ప్లేసులో ట్రెండ్ అవుతోంది. అయితే, అందులో మీరు ఓ విషయం గమనించారా? పవన్ కళ్యాణ్ జీప్ నంబర్! ఇంకా చదవండి
కాంగ్రెస్ నేతలకు బీఆర్ఎస్ డబ్బు సాయం చేసింది - కర్ణాటక ఫలితాలపై బండి సంజయ్
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో క్లియర్ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. కర్ణాటకలో అధికార పార్టీ బీజేపీ ఓటమిపై పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ స్పందించారు. దేశంలో ఒక రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు ఇవి.. ఆ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు వేరు అన్నారు. కర్ణాటకలో బీజేపీ ఓట్లు తగ్గలేదని, 36 శాతం ఓట్లు సాధించాం అన్నారు. కర్ణాటక ఎన్నికల్లో సీఎం కేసీఆర్ డబ్బులు ఖర్చు చేశారని సంచలన ఆరోపణలు చేశారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి 5 శాతం ఓటింగ్ పెరిగింది, జేడీఎస్ ఓట్లు 7 శాతం తగ్గాయన్నారు. ఇంకా చదవండి
బాక్సాఫీస్ వద్ద చతికిలపడ్డ 'ఛత్రపతి'.. అయినా బెల్లంకొండకు నష్టమేమీ లేదా?
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హిందీ డబ్బింగ్ సినిమాలతో నార్త్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు 'ఛత్రపతి' హిందీ రీమేక్ తో నేరుగా బాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. శుక్రవారమే ఈ చిత్రం గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే తొలి ఆట నుంచే ఈ యాక్షన్ మూవీ ప్లాప్ టాక్ తెచ్చుకుంది. బాలీవుడ్ విమర్శకుల సైతం నెగెటివ్ రివ్యూలు ఇచ్చారు. దీనికి తగ్గట్టుగానే ఓపెనింగ్స్ మరీ దారుణంగా ఉన్నాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇంకా చదవండి
ఢిల్లీపై పంజాబ్ సూపర్ విక్టరీ - ఎలిమినేట్ అయిన క్యాపిటల్స్!
ఐపీఎల్ 2023 నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ అవుట్ అయింది. శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై పంజాబ్ కింగ్స్ 31 పరుగులతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 136 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. దీంతో టోర్నమెంట్ నుంచి ఢిల్లీ అధికారికంగా అవుట్ అయింది. ఇంకా చదవండి