News
News
వీడియోలు ఆటలు
X

Chatrapathi Hindi Remake: బాక్సాఫీస్ వద్ద చతికిలపడ్డ 'ఛత్రపతి'.. అయినా బెల్లంకొండకు నష్టమేమీ లేదా?

టాలీవుడ్ దర్శక హీరోలు వి.వి వినాయక్, బెల్లంకొండ శ్రీనివాస్ కలయికలో తెరకెక్కిన 'ఛత్రపతి' హిందీ రీమేక్ నిరాశ పరిచింది. అయితే ఈ మూవీ ప్లాప్ అయినా సరే బెల్లంకొండ బాలీవుడ్ కెరీర్ కు డోకా లేదని అంటున్నారు.

FOLLOW US: 
Share:

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హిందీ డబ్బింగ్ సినిమాలతో నార్త్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు 'ఛత్రపతి' హిందీ రీమేక్ తో నేరుగా బాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. శుక్రవారమే ఈ చిత్రం గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే తొలి ఆట నుంచే ఈ యాక్షన్ మూవీ ప్లాప్ టాక్ తెచ్చుకుంది. బాలీవుడ్ విమర్శకుల సైతం నెగెటివ్ రివ్యూలు ఇచ్చారు. దీనికి తగ్గట్టుగానే ఓపెనింగ్స్ మరీ దారుణంగా ఉన్నాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం 'ఛత్రపతి' హిందీ రీమేక్ వరల్డ్ వైడ్ గా ఫస్ట్ డే అన్ని ఏరియాలను కలుపుకుని కేవలం రూ. 50 లక్షల నెట్ కలెక్షన్స్ మాత్రమే సాధించినట్లుగా తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో ఏ హిందీ చిత్రానికి కూడా ఓపెనింగ్ డే నాడు ఇంత తక్కువ వసూళ్లు రాలేదని టాక్. అంతేకాదు కొన్ని ఏరియాల్లో ఈ సినిమా జీరో షేర్ తో నిరాశ పరిచిందని బీ టౌన్ ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. రెండో రోజు థియేటర్ ఆక్యుపెన్సీ కూడా అంతంత మాత్రంగానే ఉందని, బాక్సాఫీస్ వద్ద అద్భుతం జరుగుతుందని ఆశించలేమని అంచనా వేశారు. 

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషనల్ లో తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ మూవీని అదే పేరుతో రీమేక్ చేస్తుండటంతో మొదటి నుంచే ఈ ప్రాజెక్ట్ పై అందరిలో ఆసక్తి నెలకొంది. 'అల్లుడు శీను' సినిమాతో బెల్లంకొండ శ్రీనివాస్ ను హీరోగా లాంచ్ చేసిన డైరెక్టర్ వి.వి వినాయక్, 'ఛత్రపతి' హిందీ రీమేక్ బాధ్యతలు తీసుకోవడంతో అంచనాలు ఏర్పడ్డాయి. అందులోనూ RRR చిత్రాన్ని రిలీజ్ చేసిన పెన్ స్టూడియోస్ సంస్థ, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్ తో నిర్మించారు. అయితే గ్రాండ్ గా రిలీజైన ఈ చిత్రానికి ఉత్తరాదిన ఆశించిన స్పందన రాలేదు.

'ఛత్రపతి' సినిమాని హిందీ ఆడియన్స్ కు తగ్గట్టుగా ప్రెజెంట్ చేయడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యారు. 18 ఏళ్ళ క్రితం నాటి అవుట్ డేటెడ్ స్టోరీ లైన్ ను ఆడియన్స్ రిజెక్ట్ చేసారు. ప్రెజెంట్ ట్రెండ్ చేస్తుంటే ఈ వీకెండ్ లో థియేటర్స్ నుంచి ఎక్కువ నంబర్స్ ఎక్స్పెక్ట్ చేయలేమని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్లాప్ అయినా సరే, ఇటు హీరోకి అటు నిర్మాతకు పెద్దగా నష్టమేమీ లేదనే టాక్ ఇప్పుడు సోషల్ మీడియాలో నడుస్తోంది. 

ఈ సినిమా కోసం దాదాపు 45 కోట్ల వరకూ బడ్జెట్ అయిందని టాక్. దీనికి నాన్ థియేట్రికల్ బిజినెస్ బాగానే జరిగింది. డిజిటల్ & శాటిలైట్ రైట్స్ ద్వారా 50 కోట్లు వచ్చాయని వార్తలు వచ్చాయి. ప్రమోషన్స్ కోసం ఐదు కోట్లు అయిందని అనుకున్నా.. ఖర్చు చేసిన దానికి బిజినెస్ కి బ్యాలన్స్ అవుతుంది. ఓన్ రిలీజ్ కాబట్టి, థియేట్రికల్ ద్వారా వచ్చేదంతా అదనమే. మరోవైపు 'ఛత్రపతి' హిందీ రీమేక్ రిలీజ్ అవ్వకముందే సాయి శ్రీనివాస్ హిందీలో మరో రెండు ప్రాజెక్ట్స్ కు సైన్ చేశారు. డెబ్యూ మూవీ పోయినంత మాత్రాన హీరో క్రేజ్ తగ్గిపోయిందని అనుకోలేం. 'జంజీర్' తో దెబ్బతిన్న రామ్ చరణ్.. ట్రిపుల్ ఆర్ తో సంచలనం సృష్టించడాన్ని మనం చూసాం. సో బాలీవుడ్ లో బెల్లంకొండ భవిష్యత్ ఏంటని ఇప్పుడే ఒక నిర్ధారణకు రాలేం. మరి రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో వేచి చూడాలి. 

కాగా, ఛత్రపతి రీమేక్ లో సాయి శ్రీనివాస్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ నుష్రత్ బారుచ్చా హీరోయిన్ గా నటించింది. ఒకప్పటి హీరోయిన్ భాగ్యశ్రీ హీరో తల్లి పాత్రలో కనిపించగా.. 'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేమ్ శరద్ కేల్కర్ విలన్ గా నటించారు. ఒరిజనల్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ కథ అందించగా.. మహదేవ్ స్క్రీన్ ప్లే రాశారు. తనీష్ బాగ్చి సంగీతం సమకూర్చగా.. KGF రవి బస్రురు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కంపోజ్ చేశారు.

Published at : 14 May 2023 06:27 AM (IST) Tags: SS Rajamouli V V Vinayak Chatrapathi Chatrapathi Hindi Remake Bollywood News V.V. Vinayak

సంబంధిత కథనాలు

Prasanth Varma: 8 మంది సూపర్ హీరోస్ మూవీస్ తీస్తా, ‘ఆది పురుష్’ ప్రభావం ‘హనుమాన్’ మీద ఉండదు: ప్రశాంత్ వర్మ

Prasanth Varma: 8 మంది సూపర్ హీరోస్ మూవీస్ తీస్తా, ‘ఆది పురుష్’ ప్రభావం ‘హనుమాన్’ మీద ఉండదు: ప్రశాంత్ వర్మ

సాయి పల్లవిపై మనసు పారేసుకున్న బాలీవుడ్ హీరో - ఆమెపై క్రష్ ఉందంటూ కామెంట్స్!

సాయి పల్లవిపై మనసు పారేసుకున్న బాలీవుడ్ హీరో - ఆమెపై క్రష్ ఉందంటూ కామెంట్స్!

Arjun Kapoor-Malaika Arora: బెడ్‌పై అర్ధనగ్నంగా బాయ్‌ ఫ్రెండ్ - మలైకా అరోరాపై మండిపడుతున్న నెటిజన్స్!

Arjun Kapoor-Malaika Arora: బెడ్‌పై అర్ధనగ్నంగా బాయ్‌ ఫ్రెండ్ - మలైకా అరోరాపై మండిపడుతున్న నెటిజన్స్!

‘బిచ్చగాడు’ పెద్ద మనసు - క్యాన్సర్ రోగులకు విజయ్ ఆంటోని గుడ్ న్యూస్

‘బిచ్చగాడు’ పెద్ద మనసు - క్యాన్సర్ రోగులకు విజయ్ ఆంటోని గుడ్ న్యూస్

'Hari Hara Veera Mallu Movie: ‘హరిహర వీర మల్లు’ సెట్స్‌లో భారీ అగ్ని ప్రమాదం, షూటింగ్ మరింత ఆలస్యం?

'Hari Hara Veera Mallu Movie: ‘హరిహర వీర మల్లు’ సెట్స్‌లో భారీ అగ్ని ప్రమాదం, షూటింగ్ మరింత ఆలస్యం?

టాప్ స్టోరీస్

Andhra News : జీతం బకాయిల కోసం ఆత్మహత్యాయత్నం - ఏపీలో విషాదం !

Andhra News  :  జీతం బకాయిల కోసం ఆత్మహత్యాయత్నం - ఏపీలో విషాదం  !

Allu Sirish: సందీప్ కిషన్ కాదన్న కథతో అల్లు శిరీష్? - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రేపే!

Allu Sirish: సందీప్ కిషన్ కాదన్న కథతో అల్లు శిరీష్? - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రేపే!

చంద్రబాబుకు మేనిఫెస్టో అంటే చిత్తు కాగితంతో సమానం- వైఎస్‌ఆర్‌సీపీ ఘాటు విమర్శలు

చంద్రబాబుకు మేనిఫెస్టో అంటే చిత్తు కాగితంతో సమానం- వైఎస్‌ఆర్‌సీపీ ఘాటు విమర్శలు

Karnataka Accident: కర్ణాటకలో ఘోరం, 10 మంది దుర్మరణం - నలుగురు అక్కడికక్కడే మృతి

Karnataka Accident: కర్ణాటకలో ఘోరం, 10 మంది దుర్మరణం - నలుగురు అక్కడికక్కడే మృతి