అన్వేషించండి

Top Headlines Today: దసరా తర్వాత విశాఖలోనే జగన్ బస- అమిత్‌షాకు ఫిర్యాదు చేసిన లోకేష్- మార్నింగ్ టాప్‌ న్యూస్

Top 10 Headlines Today: నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం

Top 10 Headlines Today

చలో విశాఖ

ఉత్తరాంధ్ర అభివృద్ధి పేరుతో అధికార యంత్రాంగాన్ని తరలించేందుకు ఏపీ ప్రభుత్వం రెడీ అవుతోంది. విజయదశమి నుంచి సీఎం క్యాంప్ ఆఫీస్ విశాఖలోనే ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రాజధాని తరలింపు అనే పేరు లేకుండా ఉత్తరాంధ్ర అభివృద్ధి అని కలరింగ్ ఇస్తోంది. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం పేరుతో అధికారులు తరచూ అక్కడికి వెళ్లాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉత్తరాంధ్ర అభివృద్ధి సాకుతో సీనియర్ అధికారులు, శాఖాధిపతులు అక్కడికి రావాలని ఉత్తర్వులో పేర్కొంది. అధికారులు విశాఖలో ఉండేందుకు ట్రాన్సిట్ వసతి కోసం కమిటీ వేసింది. మంత్రులు, సీనియర్ అధికారులు అక్కడ ఉండేందుకు వసతి ఏర్పాట్లు చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. సీఎంకు సహాయపడేందుకు మిగతా అధికారులు కూడా విశాఖలో ఉండేలా ఏర్పాట్లకు కమిటీ నియమించింది. పాలనా రాజధాని విశాఖకు తరలివెళ్తుండటంతో, వెనుకబడిన తమ సంగతేంటని రాయలసీమ వాసులు ప్రశ్నిస్తున్నారు.  పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న వేళ...ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో పలువురు ఐఏఎస్‌, ఐపీఎస్‌లను బదిలీ చేసింది. జిల్లా కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలు బదిలీ జాబితాలో ఉన్నారు. విధి నిర్వహణలో అధికారుల అలసత్వంపై ప్రతిపక్షాల ఫిర్యాదులతో ఈసీ యాక్షన్ తీసుకుంది. కీలక శాఖల అధికారులు, పలు జిల్లాల ఎస్పీలు, కలెక్టర్లను బదిలీ చేసింది. ప్రధాన నగరాల పోలీస్‌ కమిషనర్లకూ స్థానచలనం కలిగింది. నలుగురు కలెక్టర్ల బదిలీ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీష్‌, మేడ్చల్‌ కలెక్టర్‌ అమోయ్‌ కుమార్‌, యాదాద్రి జిల్లా కలెక్టర్‌ కృష్ణారెడ్డి, నిర్మల్‌ కలెక్టర్‌ వరుణ్ రెడ్డిని బదిలీ చేసింది. వీరితో పాటు 13 మంది ఎస్పీలు, సీపీలను సైతం ట్రాన్స్‌ఫర్‌ చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

అమిత్‌షాకు ఫిర్యాదు

తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్,కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు. జగన్ కక్షసాధింపు చర్యలను అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. చంద్రబాబు అరెస్ట్, విచారణ పేరుతో తనని వేధిస్తున్నారని వివరించారు. ఆఖరికి తన తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణిని కూడా ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. చంద్రబాబుపై ఎన్ని కేసులు పెట్టారు ? నీపై ఎన్ని కేసులు పెట్టారని లోకేశ్ ను అడిగారు అమిత్ షా. కక్ష సాధింపుతో జగన్ ప్రభుత్వం పెట్టిన కేసుల వివరాలు అమిత్ షాకు చెప్పారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

అభివృద్ధి అజెండా

భారత దేశంలో దక్షిణాది రాష్ట్రాది ఓ ప్రత్యేకమైన స్థానం. పురోగామి రాష్ట్రాలుక దేశం మొత్తం పేరు తెచ్చుకున్నాయి. దక్షిణాదిలోని ఐదు రాష్ట్రాలకు ప్రత్యేకమైన సంస్కృతి, సంప్రదాయాలు ఉన్నాయి. భాషలు కూడా వేర్వేరు. రాజకీయంగానూ భిన్నమైన పంథాలతో వెళ్తూంటాయి. దేశ రాజకీయాలన్నీ ఓ దిశగా వెళ్తూంటే దక్షిణాది ప్రజలు మరింత భిన్నంగా ఆలోచిస్తారు. ప్రాంతీయతే పెద్ద పీటవేస్తారు. భారత దేశంలో భిన్నత్వంలో ఏకత్వం అనే మాట ఏకాభిప్రాయానికి రావడానికి దక్షిణాది రాష్ట్రాలు కూడా ఓ కారణం.  పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

చెన్నైలో కవిత

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గురువారం (అక్టోబరు 12) నాడు చెన్నైలో పర్యటించనున్నారు. ఏబీపీ నెట్‌వర్క్ సంస్థ నిర్వహించనున్న ‘ద సదరన్ రైసింగ్ సమ్మిట్’లో కవిత పాల్గొంటారు. ఈ సమ్మిట్ లో ‘సార్వత్రిక ఎన్నికలు 2024: ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారు?’ అనే అంశంపై గురువారం నాడు రాత్రి 7 గంటల 30 నిమిషాల నుంచి జరిగే చర్చా వేదికలో పాలుపంచుకుని కవిత తన అభిప్రాయాలను తెలియజేయనున్నారు. ఈ అంశంపై జరిగే చర్చలో కాంగ్రెస్ ఎంపీ కార్తి చిదంబరం, తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే.అన్నామలై పాల్గొంటారు. ఈ చర్చా వేదికకు ప్రముఖ రచయిత చేతన్ భగత్ సమన్వయకర్తగా వ్యవహరిస్తారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

బెయిల్‌పై వాదనలు

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఏపీ సీఐడీ నమోదు చేసిన కేసుల్లో ఒకటైన ఫైబర్ నెట్ కేసులో పీటీ వారెంట్ పై నేడు (అక్టోబరు 11) విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. వాదనలు విన్న అనంతరం ఏసీబీ కోర్టు పీటీ వారెంట్‌పై విచారణ గురువారానికి (అక్టోబరు 12) వాయిదా వేసింది. సీఐడీ తరఫున న్యాయవాది వివేకానంద సుదీర్ఘ వాదనలు వినిపించారు. ఫైబర్ నెట్ కేసు వివరాలు, ఎంత మందిని సీఐడీ పోలీసులు అరెస్టు చేశారనే విషయాలను వివేకానంద న్యాయమూర్తికి వివరించారు. చంద్రబాబును కోర్టులో హాజరుపర్చాలని ఉందని ఆయన వాదించారు. ఈ క్రమంలోనే పీటీ వారెంట్‌పై వాదనలు కొనసాగించడానికి ఏసీబీ కోర్టు సమ్మతించింది. తర్వాత విచారణను గురువారం (అక్టోబరు 12) మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేసింది. వాదనల అనంతరం ఏసీబీ కోర్టు నిర్ణయం వెల్లడించనుంది.పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

రికార్డుల మోత  

వన్డే ప్రపంచ కప్ 2023లో తొమ్మిదో మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో 273 పరుగుల లక్ష్యాన్ని భారత్ 35 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ రోహిత్ శర్మ 131 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ విజయంతో టీమిండియా, కెప్టెన్ రోహిత్ శర్మ తమ పేరిట ఎన్నో రికార్డులు నమోదు చేసుకున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

రోహిట్ విజయం 

వరల్డ్ కప్‌లో టీమిండియా దూసుకుపోతుంది. ఆఫ్ఘనిస్తాన్‌పై ఎనిమిది వికెట్ల తేడాతో గెలవడం ద్వారా వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. దీంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. మెరుగైన నెట్ రన్‌రేట్‌తో న్యూజిలాండ్ టాప్‌లో ఉంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి 272 పరుగులు చేసింది. అనంతరం టీమిండియా కేవలం 35 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి ఘనవిజయాన్ని అందుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

ఏక్తాకపూర్ ఫైర్

బాలీవుడ్ నిర్మాత ఏక్తాకపూర్ ఓ నెటిజన్​కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నీ వల్ల ఎంతోమంది యువత చెడిపోతున్నారు. మంచి సినిమాలు చేయడం తెలుసుకో అంటూ కామెంట్ చేశారు. నెటిజన్ల విమర్శలకు తనదైన శైలిలో దిమ్మదిరిగిపోయే కౌంటర్లు ఇచ్చారు. థ్యాంక్యూ ఫర్‌ కమింగ్‌ ప్రమోషన్స్‌లో నిర్మాత ఏక్తా కపూర్‌ నెటిజన్ల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. నువ్వూ, ఆ కరణ్‌ జోహర్‌ కలిసి చాలామందిని చెడగొడుతున్నారు అని ప్రశ్నించారు. మరో నెటిజన్ ఎంతోమంది విడాకులకు మీ ఇద్దరే కారణం అంటూ దూషించాడు. దీనికి ఓ అవునా అంటూ ఏక్తాకపూర్ కామెంట్‌ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

పోటుగాళ్లే లీడ్

బిగ్ బాస్ సీజన్ 7లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలో అయిదుగురు కంటెస్టెంట్స్.. కొత్తగా హౌజ్‌లోకి ఎంటర్ అయిన తర్వాత పాత కంటెస్టెంట్స్, కొత్త కంటెస్టెంట్స్ మధ్య పోటీపెట్టారు బిగ్ బాస్. పాత కంటెస్టెంట్స్‌ను ఆటగాళ్లుగా, కొత్త కంటెస్టెంట్స్‌ను పోటుగాళ్లుగా మార్చి.. వీరిద్దరి మధ్య ఎవరు బెస్ట్ అని పోటీని పెట్టారు. ఇప్పటికే ఎవరు బెస్ట్ అని చెప్పే ఛాలెంజ్‌లో రెండు టాస్కులు పూర్తవ్వగా.. నేడు (అక్టోబర్ 12న) ప్రసారమయిన ఎపిసోడ్‌లో మరో రెండు టాస్కులు జరిగాయి. ఇప్పటివరకు కొత్తగా వచ్చిన కంటెస్టెంట్స్ బ్యాచ్ అంటే పోటుగాళ్లు లీడ్‌లో ఉండగా.. వారికి పోటీ ఇవ్వడానికి ఆటగాళ్లు కూడా బాగానే ప్రయత్నాలు చేశారు పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Ram Gopal Varma: ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
Hydra Commissioner Ranganath House:హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
Indian Railways: జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధంపుష్ప 2 మూవీలోని కిస్సిక్ సాంగ్‌పై విపరీతమైన ట్రోల్స్యూపీలోని షాహీ మసీద్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తతవిజయ్‌తో రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిన రష్మిక

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Ram Gopal Varma: ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
Hydra Commissioner Ranganath House:హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
Indian Railways: జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
Tata Punch CNG EMI: టాటా పంచ్ సీఎన్‌జీ ఈఎంఐలో కొనడం ఎలా? - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
టాటా పంచ్ సీఎన్‌జీ ఈఎంఐలో కొనడం ఎలా? - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
Neha Shetty : గోల్డెన్ డ్రెస్​లో గ్లో అవుతున్న నేహాశెట్టి.. హాట్ లుక్స్​తో ట్రీట్ ఇస్తోన్న టిల్లు బ్యూటీ
గోల్డెన్ డ్రెస్​లో గ్లో అవుతున్న నేహాశెట్టి.. హాట్ లుక్స్​తో ట్రీట్ ఇస్తోన్న టిల్లు బ్యూటీ
Ram Gopal Varma Latest Updates: తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Embed widget