Ekta Kapoor: ఎంతోమంది విడాకులకు మీరే కారణమన్న నెటిజన్, స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఏక్తాకపూర్
Ekta Kapoor: బాలీవుడ్ నిర్మాత ఏక్తాకపూర్ ఓ నెటిజన్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నేనొక అడల్ట్, కాబట్టి అడల్ట్ సినిమాలే చేస్తా అంటూ దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చారు.
బాలీవుడ్ నిర్మాత ఏక్తాకపూర్ (Ekta Kapoor) ఓ నెటిజన్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నీ వల్ల ఎంతోమంది యువత చెడిపోతున్నారు. మంచి సినిమాలు చేయడం తెలుసుకో అంటూ కామెంట్ చేశారు. నెటిజన్ల విమర్శలకు తనదైన శైలిలో దిమ్మదిరిగిపోయే కౌంటర్లు ఇచ్చారు. థ్యాంక్యూ ఫర్ కమింగ్ ప్రమోషన్స్‌లో నిర్మాత ఏక్తా కపూర్ నెటిజన్ల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. నువ్వూ, ఆ కరణ్ జోహర్ కలిసి చాలామందిని చెడగొడుతున్నారు అని ప్రశ్నించారు. మరో నెటిజన్ ఎంతోమంది విడాకులకు మీ ఇద్దరే కారణం అంటూ దూషించాడు. దీనికి ఓ అవునా అంటూ ఏక్తాకపూర్ కామెంట్ చేశారు.
ఆస్క్ మీ ఎనీథింగ్..
థ్యాంక్యూ ఫర్ కమింగ్ మూవీలో భూమి ఫడ్నేకర్, షెహనాజ్ గిల్, కుషా కపిలా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కరణ్ బూలానీ దర్శకత్వం వహిస్తుండగా, ఏక్తాకపూర్, రియా కపూర్, అనిల్ కపూర్ సంయుక్తంగా చిత్రాన్ని నిర్మించారు. సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికేట్ ఇచ్చిన ఈ సినిమా ఈ నెల 6న విడుదలైంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఏక్తాకపూర్ తాజాగా ట్విటర్ వేదికగా ‘Ask Me Anything’ సెక్షన్ నిర్వహించారు. దీంతో నెటిజన్లు ఏక్తాకపూర్‌ను దూషించడంతో, ఆమె అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు.
నేనొక అడల్ట్‌ని..
దయచేసి మీరు అడల్ట్ సినిమాలు చేయడం మానండి అంటూ ఓ నెటిజన్ విజ్ఞప్తి చేశాడు. నేనొక అడల్ట్, కాబట్టి అడల్ట్ సినిమాలే చేస్తా అంటూ దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చారు. జితేంద్ర, శోభా కపూర్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె పలు సినిమాలు, సీరియల్స్‌ను నిర్మించారు. రాగిణి ఎంఎంఎస్, డర్టీ పిక్చర్, షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్, ఏక్ విలన్, ఉడ్తా పంజాబ్, సూపర్ సింగ్, హాఫ్ గర్ల్‌ఫ్రెండ్, డ్రీమ్‌గర్ల్ వంటి చిత్రాలకు ఆమె నిర్మాతగా వ్యవహరించారు.
సీరియల్స్‌తో..
బాలాజీ టెలీఫిల్మ్స్ను స్థాపించి సీరియల్స్‌కు క్రేజ్‌ను తెచ్చిపెట్టారు నిర్మాత ఏక్తాకపూర్. తాను నిర్మించిన సీరియల్స్‌కు సూపర్ క్రేజ్ తీసుకొచ్చారు. కబీ బహు థీ సీరియల్‌తో బుల్లితెరపై సంచలనం సృష్టించింది. సీరియల్స్ తీసుకున్న సమయంలో స్మృతి ఇరానీ, ఏక్తా కపూర్‌ల మధ్య స్నేహం కుదిరింది. ఏక్తా సీరియల్ ' క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ' సీరియల్ స్మృతి జీవితాన్ని మార్చేసింది. ఈ సీరియల్లో నటించిన స్మృతి అత్యంత ప్రేక్షకాధారణ సొంతం చేసుకుంది. ప్రస్తుతం స్మృతి నటనకు దూరమై కేంద్ర మంత్రిగా పని చేస్తున్నారు.
తెలుగులో నువ్వునేను, శ్రీరామ్ వంటి సినిమాల్లో నటించిన అనితా హసానందనికి బుల్లితెరలో లైఫ్ ఇచ్చారు ఏక్తాకపూర్. అనితకు కెరీర్ వెండి తెరపై కంటే స్మాల్ స్క్రీన్ పైనే అద్భుతంగా సాగింది. ఆమె కెరీర్‌ను ఏక్తా కపూర్ మళ్ళీ సక్సెస్ బాట పట్టించింది. ఏక్తా కపూర్ అనితా హసానందానికి ఒకటి కాదు అనేక సీరియల్స్‌లో అవకాశం ఇచ్చింది. ఏక్తా కపూర్ ఎన్నో సీరియల్స్ నిర్మించి, ఎంతో మందికి స్టార్ డం వచ్చేలా అవకాశాలు ఇచ్చారు. ఆమె నిర్మించిన సీరియల్స్ ప్రేక్షకుల్లో మంచి సంపాదించుకున్నాయి.