అన్వేషించండి

జగన్ కక్షసాధింపులపై అమిత్ షాకు లోకేశ్ ఫిర్యాదు, చంద్రబాబు ఆరోగ్యంపై ఆరా

తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్,కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు. జగన్ కక్షసాధింపు చర్యలను అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు.

తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్,కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు. జగన్ కక్షసాధింపు చర్యలను అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. చంద్రబాబు అరెస్ట్, విచారణ పేరుతో తనని వేధిస్తున్నారని వివరించారు. ఆఖరికి తన తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణిని కూడా ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. చంద్రబాబుపై ఎన్ని కేసులు పెట్టారు ? నీపై ఎన్ని కేసులు పెట్టారని లోకేశ్ ను అడిగారు అమిత్ షా. కక్ష సాధింపుతో జగన్ ప్రభుత్వం పెట్టిన కేసుల వివరాలు అమిత్ షాకు చెప్పారు.

అదేవిధంగా ట్రయిల్ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న వివిధ కేసులకు సంబంధించిన విచారణలను అమిత్ షాకి చెప్పారు. 73 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తిని కేసుల పేరుతో ఇబ్బంది పెట్టడం మంచిది కాదని అభిప్రాయపడ్డారు అమిత్ షా. చంద్రబాబు ఆరోగ్యం ఎలా ఉందంటూ లోకేశ్ ను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్ని పరిణామాలను గమనిస్తున్నట్లు లోకేశ్ తో చెప్పారు అమిత్ షా. ఈ సమావేశంలో బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, బీజేపీ తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డి పాల్గొన్నారు.

స్కిల్ డెవలప్ మెంట్ కేసు ఏంటి ?
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో నెలరోజులకు పైగా చంద్రబాబు రాజమండ్రి జైలులో ఉన్నాయి. ఆయన న్యాయవాదులు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై శుక్రవారం విచారణ జరగనుంది.
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్ష‌ణ ఇస్తామంటూ రూ.3300 కోట్లకు సీమెన్స్ సంస్థ - డిజైన్‌టెక్ సంస్థ‌లు ఒప్పందం చేసుకున్నాయి. ఇందులో ప్రభుత్వం 10శాతం నిధులు, మిగిలిన 90 శాతం సీమెన్స్ సంస్థ చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. ప్రభుత్వం తరపున 10శాతం వాటాగా జీఎస్టీతో కలిపి రూ.370 కోట్లను అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం చెల్లించింది. ప్ర‌భుత్వం చెల్లించిన రూ.370 కోట్లలో రూ.240 కోట్ల రూపాయ‌ల‌ను సీమెన్స్ సంస్థ పేరుతో కాకుండా డిజైన్‌టెక్ సంస్థ‌కు బ‌ద‌లాయించారంటూ ఏపీ సీఐడీ అభియోగాలు నమోదు చేసింది. కేబినెట్‌ను తప్పుదారిపట్టించి ఆ తర్వాత ఒప్పందంలో మరొకటిపెట్టి డబ్బులు కాజేశారని అభియోగాలు ఉన్నాయి. దీనిపై గత కొంత కాలంగా లోతుగా విచారిస్తున్న సీఐడీ పలువురిపై కేసులు కూడా నమోదు చేసింది. 

చంద్రబాబుపై ఉన్న కేసులు
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం అంగళ్లులో వైఎస్సార్‌సీపీ నేతలపై దాడి కేసుల్లో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రథమ ముద్దాయిగా ఉన్నారు. పోలీసులు హత్యాయత్నం, నేరపూరిత కుట్ర, ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. యాత్ర ముసుగులో టీడీపీ నేతలు వైఎస్సార్‌సీపీ నేతల హత్యకు కుట్ర పన్ని, మారణాయుధాలు, బాటిళ్లు, రాళ్లు, కర్రలతో దాడులకు పాల్పడ్డారని పోలీసులు అభియోగాలు మోపారు.  అటు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డులో అక్ర‌మాలు చోటుచేసుకున్నాయ‌ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదుతో ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. దర్యాప్తులో భాగంగా గత ఏడాది ఏప్రిల్ లో ఐపీసీ, అవినీతి నిరోధక చట్టంలోని వివిధ సెక్షన్ల కింద సీఐడీ కేసు నమోదు చేసింది.

టాప్ హెడ్ లైన్స్

Anant Ambani: తిరుమల శ్రీవారికి అనంత్ అంబానీ 27.5 కోట్ల విలువైన భారీ విరాళం, గోశాల ఆధునీకరణకు నిర్ణయం
తిరుమల శ్రీవారికి అనంత్ అంబానీ 27.5 కోట్ల విలువైన భారీ విరాళం, గోశాల ఆధునీకరణకు నిర్ణయం
YS Jagan: రైతుల కోసం వెళ్లిన వైసీపీ నేతలపై దాడులు దారుణం, పోలీసులు సైతం కోఆర్డినేట్: వైఎస్ జగన్
రైతుల కోసం వెళ్లిన వైసీపీ నేతలపై దాడులు దారుణం, పోలీసులు సైతం కోఆర్డినేట్: వైఎస్ జగన్
Tirumala Devotees Rush: తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Breaking News: రేపు ఏపీ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం
రేపు ఏపీ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం

వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vedma Bojju Patel: ఎమ్మెల్యేగా ఉన్నా, ఏం జరుగుతుందో తెలియడం లేదు: వెడ్మ బొజ్జు పటేల్
ఎమ్మెల్యేగా ఉన్నా, ఏం జరుగుతుందో తెలియడం లేదు: వెడ్మ బొజ్జు పటేల్
YS Jagan: రైతుల కోసం వెళ్లిన వైసీపీ నేతలపై దాడులు దారుణం, పోలీసులు సైతం కోఆర్డినేట్: వైఎస్ జగన్
రైతుల కోసం వెళ్లిన వైసీపీ నేతలపై దాడులు దారుణం, పోలీసులు సైతం కోఆర్డినేట్: వైఎస్ జగన్
Secrets of Tirumala: 'వేంకటేశ్వర' పేరు వెనుకున్న రహస్యం ఏంటి? తిరుమలలో జరుగుతున్న అద్భుతాలేంటో తెలుసా?
'వేంకటేశ్వర' ఈ పేరు వెనుకున్న రహస్యం ఏంటి? తిరుమలలో జరుగుతున్న అద్భుతాలేంటో తెలుసా?
Indiramma Housing Scheme: ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
Jyothika Munirathnam: బుల్లితెరపై విలన్ రోల్, రియల్ లైఫ్‌లో మోడ్రన్ క్వీన్.. జ్యోతిక మునిరత్నం గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
బుల్లితెరపై విలన్ రోల్, రియల్ లైఫ్‌లో మోడ్రన్ క్వీన్.. జ్యోతిక మునిరత్నం గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
Afghanistan Earthquake: అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
Tirumala Devotees Rush: తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Sunday Puja Vidhi : ఆదివారం ఉప్పు తినొద్దు! ఈ రోజు పూజావిధానం, ఫలితాల గురించి తెలుసుకోండి!
ఆదివారం ఉప్పు తినొద్దు! ఈ రోజు పూజావిధానం, ఫలితాల గురించి తెలుసుకోండి!
Embed widget