Top Headlines Today: తెలంగాణ కాంగ్రెస్‌లో చేరికల జోరు; తిరుమలలో నిబంధనల బేఖాతరు - నేటి టాప్ న్యూస్
నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం
'నా వ్యాఖ్యలను టీడీపీ వక్రీకరించింది' - చంద్రబాబు చస్తారన్న వ్యాఖ్యలపై గోరంట్ల క్లారిటీ
చంద్రబాబుపై తన వ్యాఖ్యలను టీడీపీ నేతలు వక్రీకరించారని వైసీపీ నేత, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. చంద్రబాబు రాజకీయంగా సమాధి అవుతారనేదే తన ఉద్దేశం అని స్పష్టం చేశారు. 'నా వ్యాఖ్యలను టీడీపీ వక్రీకరించింది. పద దోషంతో చంద్రబాబుపై ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది. వ్యాఖ్య నిర్మాణ లోపం వల్ల అలా మాట్లాడాను. చంద్రబాబు రాజకీయంగా చనిపోతారనేదే నా ఉద్దేశం. నా వ్యాఖ్యలు వక్రీకరించి టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీ 175 స్థానాల్లో విజయం సాధిస్తుంది. ఎన్నికల తర్వాత టీడీపీ సమాధి అవుతుంది.' అని గోరంట్ల మాధవ్ అన్నారు. ఇంకా చదవండి
చంద్రబాబు మరణం గురించి మాట్లాడితే మేలు జరుగుతుందా ?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎవరూ ఊహించని స్థాయికి దిగజారిపోతున్నాయి. ఒకరినొకరు బూతులు తిట్టుకోవడం, కుటుంబాలను కించ పర్చుకోవడం దగ్గర్నుంచి ఇప్పుడు చావులు, మరణాలు ప్రకటనల వరకూ వచ్చాయి. ఇవి సంచలనంగా మారుతున్నాయి. సామాజిక సాధికార బస్సు యాత్రలో వైఎస్ఆర్‌సీపీ నేతల ప్రసంగాలు వివాదాస్పదంగా ఉంటున్నాయి. ప్రధానంగా చంద్రబాబుపై, ఆయన కుటుంబంపై విమర్శలు గుప్పించడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్రమంలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ చంద్రబాబు జైల్లోనే చస్తాడని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఇప్పటికే టీడీపీ నేతలు చంద్రబాబు ప్రాణానికి హాని తలపెడుతున్నారని ఆరోపణలు చేస్తున్న సమయంలో ఈ వ్యాఖ్యలు మరింత దుమారం రేపుతున్నాయి. ఇంకా చదవండి
చేరికలతో జోరుమీద కాంగ్రెస్!
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పార్టీల్లో అసంతృప్తులు పెరగడాలు, మరో పార్టీ కండువా కప్పుకోవడాలు ఎక్కువ అవుతున్నాయి. గతేడాది వరకూ బీజేపీలోకి వలసలు, చేరికలు సాగగా, ఇప్పుడు కాంగ్రెస్ హవా నడుస్తోంది. టీఆర్ఎస్, బీజేపీ నుంచి అక్కడ అసంతృప్తు నేతలు కాంగ్రెస్ లోకి వస్తున్నారు. రాష్ట్ర నాయకత్వం కూడా అలాంటి వారిని కలిసి కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తోంది. కీలక నాయకుల్ని పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామితో భేటీ అయ్యారు. ఇంకా చదవండి
కామారెడ్డి కాంగ్రెస్ లో గందరగోళం, ఒక్కొక్కరుగా పార్టీ వీడుతున్న అసంతృప్త నేతలు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయం సమీపిస్తున్న కొద్దీ.. కాంగ్రెస్‌లో రోజురోజుకూ రెబల్స్ బెడద ఎక్కువ అవుతోంది. టికెట్ దక్కని నేతల్లో కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తుంటే.. మరికొంత మంది పార్టీని వీడుతున్నారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో నేతలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. టికెట్ దక్కకపోవడంతో బోరున విలపించిన ఎల్లారెడ్డి కాంగ్రెస్ కో ఆర్డినేటర్ వడ్డేపల్లి సుభాష్ రెడ్డి.. పార్టీకి రాజీనామా చేశారు. రెబల్‌గా పోటీ చేస్తానని ప్రకటించడమే కాకుండా.. తనను మోసం చేసిన రేవంత్‌ను సైతం ఓడిస్తానని శపథం చేశారాయన. ఎల్లారెడ్డిలో కె.మదన్ మోహన్‌రావుకు టికెట్ కేటాయించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది సుభాష్‌రెడ్డి వర్గం. ఇంకా చదవండి
93 మందితో శ్రీవారి దర్శనానికి వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ - అందరికీ వీఐపీ దర్శనమే!
తిరుమలలో అధికార పార్టీ ఎమ్మెల్యే అత్యుత్సాహం ప్రదర్శించారు. శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గానికి చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే గోర్లే కిరణ్ కుమార్, ఎంపీ బెల్లానా చంద్రశేఖర్ లు ఆదివారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనానికి తనతో పాటుగా 93 మందిని తీసుకొచ్చారు. వీరందరిని వీఐపీ బ్రేక్ దర్శనానికి తీసుకెళ్ళడం చర్చనీయాంశంగా మారింది. తమ నియోజకవర్గానికి చెందిన 93 మందికి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించాలంటూ టీటీడీ జేఈవో కార్యాలయంలోని అధికారులపై ఒత్తిడి తీసుకుని రావడమే కాకుండా, పైనుంచి ఒత్తిడులు తీసుకొచ్చి 93 వీఐపీ బ్రేక్ దర్శనాలు పొందినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఇంకా చదవండి