అన్వేషించండి

Telangana Election: కామారెడ్డి కాంగ్రెస్ లో గందరగోళం, ఒక్కొక్కరుగా పార్టీ వీడుతున్న అసంతృప్త నేతలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయం సమీపిస్తున్న కొద్దీ.. కాంగ్రెస్‌లో రోజురోజుకూ రెబల్స్ బెడద ఎక్కువ అవుతోంది. టికెట్ దక్కని నేతల్లో కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయం సమీపిస్తున్న కొద్దీ.. కాంగ్రెస్‌లో రోజురోజుకూ రెబల్స్ బెడద ఎక్కువ అవుతోంది. టికెట్ దక్కని నేతల్లో కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తుంటే.. మరికొంత మంది పార్టీని వీడుతున్నారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో నేతలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు.

టికెట్ దక్కకపోవడంతో బోరున విలపించిన ఎల్లారెడ్డి కాంగ్రెస్ కో ఆర్డినేటర్ వడ్డేపల్లి సుభాష్ రెడ్డి.. పార్టీకి రాజీనామా చేశారు. రెబల్‌గా పోటీ చేస్తానని ప్రకటించడమే కాకుండా.. తనను మోసం చేసిన రేవంత్‌ను సైతం ఓడిస్తానని శపథం చేశారాయన. ఎల్లారెడ్డిలో కె.మదన్‌ మోహన్‌రావుకు టికెట్ కేటాయించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది సుభాష్‌రెడ్డి వర్గం.

ఇక జుక్కల్‌లో మాజీ ఎమ్మెల్యే గంగారాం తన అనుచరులతో ఇవాళ సమావేశం కాబోతున్నారు. జుక్కల్ టికెట్ పెండింగ్‌లో పెట్టడంపై ఆయన అసంతృప్తిలో ఉన్నారు. దీనిపై అనుచరులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. ఇక బాన్సువాడ టికెట్ కోసం రెండు వర్గాలు పోటీపడటంతో పెండింగ్‌లో పెట్టింది అధిష్టానం. దీంతో రెండు వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.

పార్టీ ఔన్నత్యాన్ని పెంచిన తనకు టికెట్‌ ఇవ్వకుండా కాంగ్రెస్‌ ఇలా మోసం చేస్తుందనుకోలేదని సుభాష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కామారెడ్డిలో కాంగ్రెస్‌ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతున్న సమయంలో తాను ఎన్నో కార్యక్రమాలు చేపట్టి పార్టీని బతికించానని తెలిపారు. ఇంతచేసినా తనకు ఎందుకు టికెట్‌ ఇవ్వలేదో చెప్పాలని ప్రశ్నించారు. సర్వేల పేరు తో మోసం చేశారని, ఇవాళ పార్టీని తెలంగాణలో నాశనం పట్టించారని ఆగ్రహించారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీకోసం పనిచేసిన వారికి కాకుండా ఇతరులకు టికెట్లు ఇవ్వడం బాధగా ఉన్నదన్నారు. కార్యకర్తలతో సమావేశం నిర్వహించి భవిష్యత్తు నిర్ణయాన్ని ప్రకటిస్తానని సుభాష్ రెడ్డి తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, తన అభిమానులు సంయమనం పాటించాలని, ఎలాంటి ఆందోళనలు చేపట్టవద్దని విజ్ఞప్తి చేశారు.

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దుః కేటీఆర్

మరోవైపు అధికార పార్టీ బీఆర్ఎస్ అన్ని వర్గాలను కలుపుపోయే పనిలో పడింది. అసమ్మతి నేతలకు బుజ్జగింపులతో పాటు స్థానిక సమస్యలపై ఫోకస్ పెట్టారు. భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కే. తారక రామారావు. తననున కలిసిన కామారెడ్డి రైతు జేఏసీ బృందం కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనను వెంటనే రద్దు చేస్తున్నట్లు తెలిపారు కేటీఆర్. ఇప్పటికే రైతుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని మాస్టర్ ప్లాన్ ని రద్దు చేస్తున్నట్లు గతంలోనే మున్సిపల్ శాఖ తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు కేటీఆర్.

మరోసారి డిటిసిపి అధికారులతో మాట్లాడిన కేటీఆర్.. ప్రస్తుతం అమలులో ఉన్న పాత మాస్టర్ ప్లాన్ ప్రకారమే నడుచుకోవాలని ఆదేశించారు. రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చిన కేటీఆర్.. ఇప్పటికే మాస్టర్ ప్లాన్ రద్దుకు సంబంధించి మునిసిపల్ కౌన్సిల్ తీర్మానం చేసింది. కేటీఆర్ తీసుకున్న నిర్ణయం పట్ల రైతు జేఏసీ ధన్యవాదాలు తెలిపింది. అలాగే రైతు జేఏసీ నిరసన కార్యక్రమాల సందర్భంగా నమోదైన కేసులను కూడా సానుకూలంగా పరిశీలించి ఎత్తేసే చర్యలు తీసుకుంటామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. 

టాప్ హెడ్ లైన్స్

Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Telangana Police Recruitment 2026: తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
Breaking News:ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ

వీడియోలు

Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
Sambarala Yetigattu Release Date : సంక్రాంతి బరిలో సంబరాల ఏటిగట్టు - సుప్రీమ్ హీరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజ్ డేట్ ఫిక్స్
సంక్రాంతి బరిలో సంబరాల ఏటిగట్టు - సుప్రీమ్ హీరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజ్ డేట్ ఫిక్స్
Embed widget