
Top Headlines Today: హాట్ హాట్‌గా పవన్ బాబు పంచాయితీ; తెలంగాణ మంత్రి రాంగ్ ట్వీట్ వైరల్ - నేటి టాప్ న్యూస్
నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం

పొత్తుపై పవన్ కీలక వ్యాఖ్యలు
టీడీపీ అధినేత చంద్రబాబు ఈ మధ్య మండపేట, అరకు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడం ఇప్పుడు వివాదం అవుతోంది. దీన్ని పవన్ కల్యాణ్ తప్పుపడుతున్నారు. మండపేట నుంచి చాలా మంది నాయకులు వచ్చారు. చాలా బాధపడిపోతున్నారు. మండపేటలో టీడీపీ అభ్యర్థిని ప్రకటించడం బాగా లేదన్నారు. నిజంగానే అది చెప్పాల్సింది పార్టీ నేతల అభిప్రాయాలతో ఏకీభవిస్తాను. చాలా ఇబ్బంది పడ్డాం. గత ఎన్నికల్లో 18 శాతం ఓటింగ్ ఉంది. అది ఇవాళ చాలా బలమైనదిగా ఉంది. ఇప్పుడు అది పదిశాతం పెరిగింది. అయితే నేను ఒక నియోజకవర్గం గురించి మాట్లాడితే ఆ ప్రాంత లీడర్నే అవుతాను. ఇంకా చదవండి
హాట్ హాట్‌గా పవన్ బాబు పంచాయితీ
నాలుగు రోజులు ఆగండి... టీడీపీ, జనసేన నేతలు రోడ్లపైకి వచ్చి కొట్టుకుంటారు... ఇది ఈ మధ్యకాలంలో టీడీపీ, జనసేన పొత్తుపై వైసీపీ నేతలు చేసిన కామెంట్స్. నేతలు కాదు అధినేత అసంతృప్తి వ్యక్తం చేసే పరిస్థితి వచ్చింది. పోటాపోటీగా సీట్లు కూడా ప్రకటించేసుకున్నారు. టీడీపీ, జనసేన పొత్తు మరింత ముందుకు వెళ్లక ముందే కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అరకు, మండపేట సీట్లలో అభ్యర్థులను టీడీపీ అధినేత ప్రకటించేశారు. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మండపేట నుంచి టీడీపీ అభ్యర్థిగా వేగుళ్ల జోగేశ్వరరావు పోటీ చేస్తారని వెల్లడించారు. ఈ మధ్య రా కదలిరా పేరు నిర్వహించిన బహిరంగ సభలో అరకు అభ్యర్థిని కూడా వెల్లడించారు. ఇదే ఇప్పుడు జనసేనాని ఆగ్రహానికి కారణమైంది. ఇంకా చదవండి
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే యోచనలో అజారుద్దీన్
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కీలక ముస్లిం నేత, మాజీ క్రికెటర్ అజారుద్దీన్ రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణలో మొన్న జరిగిన ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన అజారుద్దీన్ బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ చేతిలో పరాజయం పాలయ్యారు. సుమారు 16 వేల ఓట్ల తేడాతో పరాజయం పాలైన అజారుద్దీన్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఎమ్మెల్సీ స్థానంపై ఆశలు పెట్టుకున్నారు. ఎమ్మెల్సీ ఇచ్చి మైనార్టీ కోటాలో మంత్రి పదవి ఇస్తారని అజారుద్దీన్ ఆశించారు. ఈ మేరకు తన సన్నిహితులు వద్ద మనసులో మాటను చెప్పారు. కానీ, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అజారుద్దీన్‌కు ఎమ్మెల్సీ ఇచ్చేందుకు ఆసక్తి చూపించడం లేదు. అజారుద్దీన్‌కు కాకుండా అమీర్ ఆలీ ఖాన్‌కు ఎమ్మెల్సీ ఇవ్వడం పట్ల అజారుద్దీన్ తీవ్ర అసంతృప్తిని సన్నిహితులు వద్ద వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఏళ్ల నుంచి ఉన్న తనకు కనీసం అవకాశం ఇవ్వకపోవడం దారుణమంటూ సన్నిహితులు వద్ద వాపోయినట్టు తెలిసింది. ఇంకా చదవండి
తెలంగాణ మంత్రి రాంగ్ ట్వీట్ వైరల్
తెలంగాణ మంత్రి దామోదర్ రాజనర్సింహ చేసిన ఓ ట్వీట్ వైరల్ అవుతోంది. గణతంత్రి దినోత్సవ శుభాకాంక్షలు చెప్పబోయి ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు. దీంతో నెటిజన్లు రెచ్చిపోయారు. ముఖ్యంగా బీఆర్‌ఎస్ అనుకూల వర్గీయులు దాన్ని తెగ ట్రోల్ చేస్తున్నారు. మంత్రి స్థాయి వ్యక్తికి ఇది కూడా తెలియదా అంటు కామెంట్స్ చేస్తున్నారు. ఇంకా చదవండి
గణతంత్ర వేడుకల్లో స్పృహ కోల్పోయిన మాజీ డిప్యూటీ సీఎం
గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని హైదరాబాద్ (Hyderabad) తెలంగాణ భవన్ (Telangana Bhawan) లో శుక్రవారం ఉదయం వేడుకలు నిర్వహిస్తుండగా మాజీ డిప్యూటీ సీఎం, బీఆర్ఎస్ నేత మహమూద్ అలీ (Mahmood Ali) అస్వస్థతకు గురయ్యారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) జాతీయ జెండాను ఎగురవేస్తున్న సమయంలో.. మహమూద్ అలీ ఒక్కసారిగా స్పృహ కోల్పోయి కింద పడిపోయారు. వెంటనే స్పందించిన సిబ్బంది, ఇతర నేతలు ఆయన్ను పట్టుకుని పైకి లేపే ప్రయత్నం చేశారు. ప్రాథమిక చికిత్స అనంతరం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని అధికారులు తెలిపారు. కాగా, ఈ అనూహ్య ఘటనతో నేతలు ఆందోళనకు గురయ్యారు. ఇంకా చదవండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
