Mahmood Ali: గణతంత్ర వేడుకల్లో స్పృహ కోల్పోయిన మాజీ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ
Telangana News: తెలంగాణ భవన్ లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో మాజీ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ అస్వస్థతకు గురయ్యారు. సిబ్బంది, ఇతర నేతలు ఆయనకు ప్రాథమిక చికిత్స అందించారు.
Ex Deputy Cm Mahmood Ali Faints in Republic Day Celebrations: గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని హైదరాబాద్ (Hyderabad) తెలంగాణ భవన్ (Telangana Bhawan) లో శుక్రవారం ఉదయం వేడుకలు నిర్వహిస్తుండగా మాజీ డిప్యూటీ సీఎం, బీఆర్ఎస్ నేత మహమూద్ అలీ (Mahmood Ali) అస్వస్థతకు గురయ్యారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) జాతీయ జెండాను ఎగురవేస్తున్న సమయంలో.. మహమూద్ అలీ ఒక్కసారిగా స్పృహ కోల్పోయి కింద పడిపోయారు. వెంటనే స్పందించిన సిబ్బంది, ఇతర నేతలు ఆయన్ను పట్టుకుని పైకి లేపే ప్రయత్నం చేశారు. ప్రాథమిక చికిత్స అనంతరం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని అధికారులు తెలిపారు. కాగా, ఈ అనూహ్య ఘటనతో నేతలు ఆందోళనకు గురయ్యారు.
#WATCH | Hyderabad: Former Telangana Deputy CM Mahmood Ali faints during #RepublicDay2024 celebrations at Telangana Bhawan. pic.twitter.com/GCzoMb9l8U
— ANI (@ANI) January 26, 2024
Also Read: Viral News: హ్యాపీ ఇండిపెండెన్స్ డే- తెలంగాణ మంత్రి రాంగ్ ట్వీట్ వైరల్