Pawan Comments On CBN: ఇరుకు చొక్కా తొడిగినట్టు ఉంది.. అభ్యర్థిని ప్రకటించడం తప్పు -పొత్తుపై పవన్ కీలక వ్యాఖ్యలు-
Pawan Comments On TDP Alliance: పొత్తు ధర్మం ప్రకారం చంద్రబాబు ఆ సీటుకు అభ్యర్థి ప్రకటించకుండా ఉండాల్సింది అన్నారు పవన్ కల్యాణ్.
![Pawan Comments On CBN: ఇరుకు చొక్కా తొడిగినట్టు ఉంది.. అభ్యర్థిని ప్రకటించడం తప్పు -పొత్తుపై పవన్ కీలక వ్యాఖ్యలు- Janasena Chief pawan kalyan shocking comments on alliance with tdp in andhra Pradesh elections 2024 Pawan Comments On CBN: ఇరుకు చొక్కా తొడిగినట్టు ఉంది.. అభ్యర్థిని ప్రకటించడం తప్పు -పొత్తుపై పవన్ కీలక వ్యాఖ్యలు-](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/26/679552d5816fc567d96bacf2636a2c871706248206592215_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Janasenani comments On TDP And Chandra babu: టీడీపీ అధినేత చంద్రబాబు ఈ మధ్య మండపేట, అరకు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడం ఇప్పుడు వివాదం అవుతోంది. దీన్ని పవన్ కల్యాణ్ తప్పుపడుతున్నారు. మండపేట నుంచి చాలా మంది నాయకులు వచ్చారు. చాలా బాధపడిపోతున్నారు. మండపేటలో టీడీపీ అభ్యర్థిని ప్రకటించడం బాగా లేదన్నారు. నిజంగానే అది చెప్పాల్సింది పార్టీ నేతల అభిప్రాయాలతో ఏకీభవిస్తాను. చాలా ఇబ్బంది పడ్డాం. గత ఎన్నికల్లో 18 శాతం ఓటింగ్ ఉంది. అది ఇవాళ చాలా బలమైనదిగా ఉంది. ఇప్పుడు అది పదిశాతం పెరిగింది. అయితే నేను ఒక నియోజకవర్గం గురించి మాట్లాడితే ఆ ప్రాంత లీడర్నే అవుతాను. నేను రాష్ట్రాన్ని యూనిట్‌గా చూస్తాను . దీని వల్ల కొన్నిసార్లు ఇబ్బంది కలగవచ్చు. పొత్తు ధర్మం ప్రకారం ప్రకటించకుండా ఉండాల్సింది. నేను పార్టీ లీడర్లకు క్షమాపణ చెబుతున్నాను. వచ్చే సమావేశాల్లో మాట్లాడి దాన్ని ఎలా సరిదిద్దాలో సరిదిద్దుతాం. రాజోలు, రాజానగరంలో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించారు.
మీరు ప్రకటించారు- నేనూ ప్రకటిస్తా: పవన్
జనసేన ఆఫీస్‌లో జెండా ఆవిష్కరించిన తర్వాత పార్టీ లీడర్లతో మాట్లాడిన పవన్ కల్యాణ్ టీడీపీ ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించడంపై చాలా ఘాటుగానే స్పందించారు. పొత్తు ధర్మం ప్రకారం టీడీపీ సీట్లు అనౌన్స్ చేయకూడదు అన్నారు. లోకేష్ సీఎం పదవి గురించి మాట్లాడిన తాను పట్టించుకోలేదన్నారు. చంద్రబాబు నన్ను అడగకుండా రెండు సీట్లు ప్రకటించారు కాబట్టి నేను రెండు సీట్లు ప్రకటిస్తా అన్నారు పవన్. రాజోలు, రాజనగరంలో జనసేన పోటీ ఉంటుంది తెలిపారు.
నాకూ ఒత్తిడి ఉంది
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఉన్నట్టే తనకూ పార్టీ లీడర్ల నుంచి ఒత్తిడి ఉందని... అందుకే ప్రత్యేక పరిస్థితుల్లో ఈ రెండు సీట్లలో పోటీ చేయాలని నిర్ణయించుకున్‌నట్టు అభ్యర్థులను ప్రకటించినట్టు పవన్ చెప్పుకొచ్చారు. కలిసి ముందుకు వెళ్తేనే బలమైన నిర్మాణం చేసుకోవచ్చని అన్నారు. ఎప్పుడు జనసేన బలం ఇచ్చేవాళ్లం అవుతున్నాంగానీ తీసుకునే పరిస్థితులో లేకుండా పోతున్నామన్నారు. పోటీ కోసం 50-70 స్థానాలు తీసుకోవాలని తనకు తెలియనిది కాదని... కానీ ఒంటరిగాపోటీ చేస్తే కొన్ని సీట్లు వస్తాయో లేదో తెలియదు అన్నారు. వాస్తవాలు తెలియవని చాలా మంది విమర్శిస్తుంటారని అవి తెలియకుండా రాజకీయాల్లోకి ఎలా వచ్చానని ప్రశ్నించారు. ఇద్దరు వ్యక్తులను కలపడం కష్టమని.. విడదీయం చాలా తేలికన్నారు. అందుకే తనకు ఎప్పుడూ కలపడమే ఇష్టమని పేర్కొన్నారు.
అలానే ఉంటుంది: పవన్
రాష్ట్ర ప్రయోజనలు దృష్టికి పెట్టుకొని నేను మౌనంగా ఉంటున్నాని తెలిపారు. సీనియర్ నేతగా ముఖ్యమంత్రిగా పని చేశారు కాబట్టి అలా జరుగుతూ ఉంటాయనుకున్నట్టు వివరించారు. పొత్తులు సీట్లు సర్దుబాటు అంటే వాళ్లకు ఇరుకు చొక్కా తొడుక్కున్నట్టు ఉంటుందని ఉదహరించారు. అందుకే అనుకోకుండా కొన్ని జరుగుతాయి వాటిని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు పవన్.పార్టీ నేతలు అర్దం చేసుకోవాలని కోరుతున్నాని రిక్వస్ట్ చేశారు.
పొత్తును ఇబ్బందులకు గురి చేసేలా కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారని పవన్ ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం 2024 లో మళ్ళీ అధికారంలోకి రాకూడదని కామెంట్ చేశారు. జగన్‌పై తనకు వ్యక్తిగత కక్ష లేదని అన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)