అన్వేషించండి

Top Headlines Today: ఉద్దానం పర్యటనలో సీఎం జగన్; తెలంగాణ స్పీకర్ పీఠంపై తొలి దళిత నేత - నేటి టాప్ న్యూస్

నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం

కిడ్నీ బాధితులకు మాటిచ్చా, పూర్తి చేశాను - సీఎం జగన్

తన పాదయాత్రలో ఉద్దానం ప్రజల బాధను చూశానని, అప్పుడు తాను ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు హామీలు నెరవేర్చానని సీఎం జగన్ (CM Jagan) తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో (Palasa) గురువారం రూ.85 కోట్లతో నిర్మించిన డా.వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ (YSR Kidney Research Center), సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని (Super Speciality Hospital) ఆయన ప్రారంభించారు. ఇక్కడ 42 మంది సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు, 60 మంది స్టాఫ్ నర్సులు, 60 మంది సహాయక సిబ్బంది, 200 పడకల సామర్థ్యంతో డయాలసిస్ యూనిట్లు ఏర్పాటు చేశారు. ఇంకా చదవండి

వైజాగ్‌ ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం

విశాఖలోని ఇండస్‌ ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం ధాటికి భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఒక్కసారి అలుముకున్న పొగ, మంటలతో ఆసుపత్రిలో ఉన్న రోగులు భయాందోళనలకు గురయ్యారు. అవకాశం ఉన్న వాళ్లు బయటకు పరుగులు తీశారు. కదల్లేని వాళ్లు మాత్రం అక్కడే ప్రాణాలు అరచేతిలో పట్టుకొని ఉండిపోయారు. ఇంకా చదవండి

శుక్రవారం ఆస్పత్రి నుంచి ఇంటికి కేసీఆర్

బాత్‌రూంలో జారిపడి గాయం కావడంతో  యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సీఎం కేసీఆర్ శుక్రవారం డిశ్చార్జ్ కానున్నారు. అనంతరం అక్కడి నుంచి నంది నగర్ ఇంటికి కేసీఆర్ వెళ్లనున్నారు. సుమారు 6 రోజులుగా యశోద ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్న కేసీఆర్ ఆరోగ్యం కాస్త కుదుట పడటంతో ఆస్పత్రి వర్గాలు ఇంటికి వెల్లడానికి పరిమిషన్ ఇచ్చినట్లు సమాచారం. అయితే ఇప్పుడు కేసీఆర్ ఆరోగ్యం బాగానే ఉందని, భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. శుక్రవారం కేసీఆర్ ను డిశ్చార్జ్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే కేసీఆర్ ప్రగతి భవన్ ను ఖాళీ చే్శారు. ఫామ్ హౌస్ కు వెళ్లారు. అయితే వైద్య సేవల కోసం ఫామ్ హౌస్ దూరంగా ఉండటంతో.. ఆయన సిటీలోని తన ఇంట్లోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. నందినగర్ లో ఇంటిని యుద్ధప్రాతిపదికన బాగు చేసినట్లుగా తెలుస్తోంది. ఇంకా చదవండి

బాధ్యతలు చేపట్టిన రోజే ఐటీ మినిస్టర్ వార్నింగ్

ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మినిస్టర్‌గా దుద్దిళ్ల శ్రీధర్‌బాబు బాధ్యతలు స్వీకరించారు. ఈ ఉదయం 9 గంటల సమయంలో తన ఛాంబర్‌లో శాస్త్రోక్తంగా తన సీట్లు కూర్చున్నారు. అనంతరం బాధ్యతలు తీసుకున్న ఫైల్‌పై సంతకాలు చేశారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత అధికారులతో సమావేశమయ్యారు. తొలి సమావేశంలోనే అధికారులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు శ్రీధర్‌బాబు. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేసేలా లీకులు ఇస్తే మాత్రం సహించేది లేదని చెప్పేశారు. ఈ మధ్యకాలంలో ఓ కంపెనీ తెలంగాణ నుంచి వెళ్లిపోతోందని ప్రధాన మీడియాలో వార్తలు వచ్చాయి. దీన్ని అవకాశంగా తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం మొదలైపోయింది. ఇంకా చదవండి

ఈ సంప్రదాయం కొనసాగిద్దాం- అసెంబ్లీలో సీఎంగా రేవంత్‌రెడ్డి తొలి స్పీచ్‌

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత అసెంబ్లీలో తొలి ప్రసంగం చేశారు. స్పీకర్‌గా ఎన్నికైన గడ్డం ప్రసాద్ కుమార్ ను అభినందిస్తూ మాట్లాడారు. తొలి స్పీచ్‌లో ఆయన ఏమన్నారంటే..." మూడో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌ను ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి సహకారం అందించిన బీఆర్‌ఎస్‌, బీజేపీ, ఎంఐఎం, సీపీఐ కాంగ్రెస్‌ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మంచి సంప్రదాయాన్ని ముందుకు తీసుకొచ్చాం. ఇదే సంప్రదాయం భవిష్యత్‌లో కొనసాగాలని కోరుకుంటున్నాను. అందరి సహకారం అందరి సమన్వయంతో సమావేశాలు నిర్వహించుకుంటే తెలంగాణ ఆకాంక్షను సభ ద్వారా పరిష్కరించవచ్చు. ఇంకా చదవండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Kavitha New Party: రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు

వీడియోలు

అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..
బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Kavitha New Party: రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
Nicolas Maduro Guerra Warning:చరిత్ర చెబుతుంది ద్రోహి ఎవరో? తల్లి మీద ఒట్టు అంటూ ట్రంప్‌కు మదురో కుమారుడు వార్నింగ్
చరిత్ర చెబుతుంది ద్రోహి ఎవరో? తల్లి మీద ఒట్టు అంటూ ట్రంప్‌కు మదురో కుమారుడు వార్నింగ్
Telugu Woman Murder: అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
Nizamabad Crime News:నిజామాబాద్‌లో మిస్టరీ డెత్‌; గుండెపోటుతో భర్త చనిపోయినట్టు భార్య డ్రామా! ఒక్క ఫోన్ కాల్‌తో ఆటకట్టు!
నిజామాబాద్‌లో మిస్టరీ డెత్‌; గుండెపోటుతో భర్త చనిపోయినట్టు భార్య డ్రామా! ఒక్క ఫోన్ కాల్‌తో ఆటకట్టు!
Gold Jewellery Insurance: బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే ఉచిత బీమా లభిస్తుంది.. ఏ సందర్భాల్లో కవర్ అవుతుంది
బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే ఉచిత బీమా లభిస్తుంది.. ఏ సందర్భాల్లో కవర్ అవుతుంది
Embed widget